Switch to English

BIGG BOSS 9 TELUGU E91: కల్యాణ్, ఇమ్మానియేల్, తనూజ.. ముందుకి; పవన్, సుమన్ లు వెనక్కి.. తేల్చేసిన ఇంటి సభ్యులు.

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,203FansLike
57,764FollowersFollow

బిగ్ బాస్ సీజన్ 9 శనివారం నాటి 91వ ఎపిసోడ్ లో.. హోస్ట్ నాగార్జున స్టేజ్ ఎంట్రీతోనే మూడ్ హైపరైపోయింది. మొదటి ఫైనలిస్ట్ అయిన కల్యాణ్‌ను ప్రత్యేకంగా అభినందించిన నాగ్, వెంటనే ఇంట్లో జరిగిన తప్పులపై ఒకదాని తర్వాత ఒకటి వీడియో క్లిప్స్ చూపిస్తూ అందరికీ సున్నితంగా వార్నింగ్ ఇచ్చాడు.

ఇంకా రెండు వారాలే మిగిలుండటంతో, శుక్రవారం భాగంగా అందరూ కలిసి తమ బిగ్ బాస్ ప్రయాణంలోని భావోద్వేగాలను పంచుకున్నారు. తనూజ అందరినీ తాకేలా గేమ్ వల్ల ఎవరికైనా హర్ట్ అయ్యుంటే సారీ అని చెప్పడంతో సభ్యులు ఎమోషనల్ అయ్యారు. తరువాత మరికొందరూ తమ ఫీల్‌లను పంచుకున్నారు.

తర్వాత నాగార్జున ఎంట్రీతో అసలు క్లాస్ మొదలైంది. టికెట్ టు ఫినాలే గేమ్స్‌లో అందరూ బాగా ఆడారని చెప్పిన నాగ్.. ఒక్కొక్కరి ఆటను రివ్యూ చేస్తూ ఎవరి ప్లస్–మైనస్ ఏంటో స్పష్టంగా చెప్పేశారు.

ఇమ్మానియేల్ గేమ్ అర్థం చేసుకుని ఆడలేదని చెబుతూ సీసా పగలకొట్టిన నాగ్, అతనికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టు అయ్యింది.
రీతూ లెక్కల్లో తడబడటంపై నాగ్ మళ్లీ లెక్కలు అడిగితే… ఆమె మళ్లీ తడబడటంతో ఇంట్లో నవ్వుల పూలు.
భరణి ట్రైయాంగిల్ లాజిక్ తప్పు అని చెప్పి సీసా పగలకొట్టి మైనస్ ఇచ్చారు. అదే గేమ్‌లో క్లారిటీ లేకుండా మాట్లాడిన తనూజకూ సీసానే సమాధానం!
పవన్ మంచి ఆట ఆడినా, “టికెట్ టు ఫినాలే నేను తీసుకుంటా!” అని ఓవర్ కాన్ఫిడెన్స్ చూపించడాన్ని నాగ్ కౌంటర్ చేస్తూ మైనస్ ఇచ్చారు.
నామినేషన్ టైమ్‌లో ఇమ్మానియేల్‌తో వేరే విషయాలు మాట్లాడిన తనూజను కూడా నాగ్ అది టైమ్ కాదని హితవు చెప్పాడు.
అయితే కల్యాణ్, రీతూ ఆటలను నాగ్ స్పెషల్‌గా ప్రశంసించారు.

తర్వాత వచ్చింది అసలు హైలైట్ కథ.. కప్ ఎవరికర్హం?

ప్రతి ఒక్కరూ కప్ పట్టుకుని “నేనెందుకు అర్హుడు/అర్హురాలు?” అని చెప్పాలి. మిగతావారు థంబ్స్ అప్, థంబ్స్ డౌన్‌తో తమ అభిప్రాయం చెప్పాలి.

ఈ ప్రక్రియ లో వోటింగ్ ఇలా వచ్చింది:

సుమన్ – 3 థంబ్స్ అప్, 4 థంబ్స్ డౌన్

ఇమ్మానియేల్ – 7 థంబ్స్ అప్

భరణి – 5 అప్, 2 డౌన్

సంజన – 4 అప్, 3 డౌన్

పవన్ – 3 అప్, 4 డౌన్

కల్యాణ్ – అన్ని 7 థంబ్స్ అప్

తనూజ – 7 థంబ్స్ అప్

రీతూ – 4 అప్, 3 డౌన్

సుమన్, పవన్ ఇద్దరికీ అత్యధికంగా నాలుగు థంబ్స్ డౌన్ రావడంతో, ఈ వారం ఎలిమినేషన్ అనుమానం వారిద్దరిపైనే గట్టిగా పడింది.

రేపటి సండే ఎపిసోడ్‌లో ఎవరు బయటికెళతారో… అసలు డ్రామా అప్పుడు తేలనుంది!

సినిమా

ప్రేక్షకుల ప్రేమే మా అసలైన విజయం: ‘అనగనగా ఒక రాజు’ థాంక్యూ...

సంక్రాంతి కానుకగా విడుదలై థియేటర్లలో నవ్వుల పండగ సృష్టించిన చిత్రం ‘అనగనగా ఒక రాజు’ విజయోత్సాహంతో దూసుకుపోతోంది. స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్‌ పొలిశెట్టి కథానాయకుడిగా నటించిన...

మెగా 158లో చిరంజీవి సరసన ఐశ్వర్య రాయ్?

మెగాస్టార్ చిరంజీవి తాజా బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై టాలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. బాబీ దర్శకత్వంలో తెరకెక్కనున్న మెగా 158 సినిమాను పూర్తి...

సంక్రాంతికి ‘మిరాకిల్’ ఫస్ట్ లుక్.. యాక్షన్‌తో ఆకట్టుకుంటున్న ప్రభాస్ నిమ్మల కొత్త...

సంక్రాంతి పండుగ కానుకగా దర్శకుడు ప్రభాస్ నిమ్మల తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘మిరాకిల్’ ఫస్ట్ లుక్‌ను చిత్ర బృందం ఈరోజు (జనవరి 16) అధికారికంగా విడుదల...

సంక్రాంతి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘మన శంకర వర ప్రసాద్ గారు’

సంక్రాంతి పండుగ సీజన్‌లో విడుదలైన మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ బాక్సాఫీస్ వద్ద దూకుడు ప్రదర్శిస్తోంది. విడుదలైన కేవలం నాలుగు...

CHIRANJEEVI: చిరంజీవి క్రేజ్, రేంజ్ ఏంటో చూస్తున్న ‘Gen Z’

CHIRANJEEVI: ‘నువ్వేమైనా చిరంజీవి అనుకుంటున్నావా..., నువ్వో చిరంజీవి మరి.., చిరంజీవిలా ఆ ఫోజేంటేహే’.. ఇదీ 80, 90 దశకాల్లో చిరంజీవి హవా. చెప్పాలంటే రాజకీయాల్లోకి వెళ్లే...

రాజకీయం

మంగళగిరిలో మంత్రి నారా లోకేష్ సందడి: సాహిత్యానికి సత్కారం, క్రీడలకు ఉత్సాహం, చేనేతకు ప్రోత్సాహం

మంగళగిరి నియోజకవర్గంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శుక్రవారం వరుస కార్యక్రమాల్లో పాల్గొంటూ విస్తృతంగా సందడి చేశారు. సాహిత్య రంగానికి ప్రోత్సాహం ఇవ్వడంతో పాటు, క్రీడలను ఉత్సాహపరిచి, స్థానిక వ్యాపారాలకు...

“స్వగ్రామం నుంచి స్వర్ణాంధ్ర దిశగా: సమసమాజమే లక్ష్యం”: చంద్రబాబు

నారావారిపల్లెలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం నిర్వహించి ప్రభుత్వ అభివృద్ధి దృక్పథం, పండుగల ప్రాధాన్యం, గ్రామీణ పునర్నిర్మాణం, ఆర్థిక అసమానతలపై తన ఆలోచనలను విస్తృతంగా వెల్లడించారు. గతంలో గ్రామాలకు వెళ్లడానికి...

నారావారిపల్లెలో సంక్రాంతి వేడుకలు: కుటుంబంతో కలిసి పూజల్లో పాల్గొన్న నారా లోకేష్

మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని నారావారిపల్లెలో సంప్రదాయబద్ధంగా నిర్వహించిన వేడుకల్లో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి గ్రామంలో ఏర్పాటైన సంక్రాంతి సంబరాల్లో ఆయన పాల్గొని...

వాటర్‌ పాలిటిక్స్‌లో రాజకీయ ఆరోపణలు.. ఏపీపై ప్రభావం?

ఆంధ్రప్రదేశ్‌–తెలంగాణ రాజకీయాల్లో నీటి అంశం మరోసారి కేంద్రబిందువుగా మారింది. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్‌, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ మధ్య సన్నిహిత రాజకీయ అవగాహన ఉందన్న ఆరోపణలు మళ్లీ తెరపైకి...

పీపీపీపై కేంద్రం మరో లేఖ.. రాష్ట్ర వైద్య రంగానికి కీలక దిశానిర్దేశం

వైద్య సేవల డిమాండ్‌–లభ్యత మధ్య ఉన్న గ్యాప్‌ను పూరించేందుకు పబ్లిక్–ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) విధానాన్ని మరింత విస్తృతంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి మరోసారి స్పష్టమైన సూచనలు చేసింది. ఈ మేరకు...

ఎక్కువ చదివినవి

కూకట్ పల్లిలో జనసేనకు బలమైన ఊపు… భారీగా పార్టీలో చేరికలు

తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో కూకట్ పల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీలో భారీగా చేరికలు చోటు చేసుకున్నాయి. పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలపై విశ్వాసంతో ముందుకు సాగాలని...

Daily Horoscope: ఆర్థిక లాభాలు మేషానికి, ఉద్యోగంలో కొత్త అవకాశాలు కన్యకు

జనవరి 12, 2026 సోమవారం రాశిఫలాలు మేషం (Aries): ఈ రోజు మీకు ఆర్థిక విషయాల్లో లాభ సూచనలు కనిపిస్తాయి. గతంలో చేసిన ప్రయత్నాలకు ఫలితం దక్కుతుంది. కుటుంబ సభ్యులతో చర్చలు అనుకూలంగా సాగుతాయి....

సంక్రాంతికి భారీ ఊరట: ఉద్యోగులు, పెన్షనర్లు, కాంట్రాక్టర్లకు రూ.2653 కోట్ల విడుదల

అమరావతి కేంద్రంగా కూటమి ప్రభుత్వం సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఉద్యోగులు, పెన్షనర్లు, పోలీస్ సిబ్బంది, వివిధ అభివృద్ధి పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు భారీ ఊరటనిచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పెండింగ్‌లో...

వరంగల్‌లో పండుగ హంగామా.. ‘అనగనగా ఒక రాజు’ ప్రీ రిలీజ్ వేడుకలో నవీన్ పొలిశెట్టి కాన్ఫిడెన్స్

సంక్రాంతికి అసలైన పండుగ వినోదాన్ని అందించాలనే లక్ష్యంతో రూపొందిన సినిమా ‘అనగనగా ఒక రాజు’ ప్రీ రిలీజ్ వేడుక వరంగల్ జిల్లా హనుమకొండలో ఘనంగా జరిగింది. కాకతీయ ప్రభుత్వ కళాశాల వేదికగా నిర్వహించిన...

సంక్రాంతి బాక్సాఫీస్‌ను ఊపేస్తున్న మెగా సినిమా!

సంక్రాంతి 2026 సీజన్‌లో ప్రేక్షకుల మొదటి ఎంపికగా నిలిచిన చిత్రం మన శంకర వర ప్రసాద్ గారు. విడుదలైన తొలినాళ్ల నుంచే ఈ సినిమా థియేటర్ల వద్ద అసాధారణ వాతావరణాన్ని సృష్టిస్తోంది. తెలుగురాష్ట్రాల...