బిగ్ బాస్ సీజన్ 9 శుక్రవారం ప్రసారమైన 90వ ఎపిసోడ్ నిజంగా మసాలా, ఎమోషన్, హీట్ అన్నీ కలగలసిన రోలర్ కోస్టర్ లాంటిది. మొదటి ఫైనలిస్ట్ కోసం జరిగిన గేమ్స్ ఇంట్లో టెన్షన్‌ని ఒక్కసారిగా పెంచేసాయి. సభ్యుల మధ్య మాటామాటలు, సపోర్ట్ గేమ్, సైకాలజీ—అన్నీ కలిసి ఈ ఎపిసోడ్‌ను అత్యంత ఆసక్తికరంగా తీర్చిదిద్దాయి.
నిన్నటి ఎపిసోడ్ నుంచే కొనసాగుతున్న రీతూ–భరణి ఫేస్‌ఆఫ్ మరింత హీట్ అయ్యింది. తొలిపోటి నిర్ణయంపై భరణి అభ్యంతరం చెప్పడంతో పరిస్థితి ఉత్కంఠ రేపింది. ఈ ఇష్యూ రీతూ–భరణి మధ్యే కాదు, భరణి–కళ్యాణ్ మధ్య కూడా తగవుకు దారితీసింది. అయితే ఈ రౌండ్‌లో రీతూనే విజేతగా సంచాలక్ సంజన ప్రకటించడంతో ఆట దిశ మారిపోయింది. రీతూ, భరణి గడులు స్వాధీనం చేసుకుంది. భరణి ఫైనలిస్ట్ అయ్యే అవకాశం కోల్పోయాడు.
తరువాతి ప్రధాన టాస్క్ — “కట్టు, నిలబెట్టు”. బ్రిక్స్‌తో టవర్ కట్టి, ఇతరులు దాన్ని పడగొట్టకుండా కాపాడుకోవాల్సిన ఈ గేమ్‌లో అందరూ తమ స్ట్రాటజీలను బయటపెట్టారు. చాలా మంది రీతూనే టార్గెట్ చేశారు. కల్యాణ్‌కు మాత్రం ఇంటి సభ్యుల నుంచి భారీ సపోర్ట్ దొరికింది. తనూజ అయితే కల్యాణ్‌ను టార్గెట్ చేస్తే ఎదుటివారి టవర్ నేలకూల్చుతానని వార్నింగ్ ఇచ్చింది. రీతూ వైపు పవన్ ఒక్కడే నిలిచాడు. టాస్క్ చాలా హుషారుగా సాగింది. చివరికి సంచాలక్ సంజన కల్యాణ్‌ను ఫస్ట్ ప్లేస్‌గా, ఇమ్మానియేల్‌ను సెకండ్‌గా ప్రకటించింది.
దాంతో బిగ్ బాస్ మరోసారి ఇమ్మానియేల్–రీతూ మధ్య ప్రత్యేక టవర్ పోటీ పెట్టాడు. ఇమ్మానియేల్‌కు కళ్యాణ్, భరణి సపోర్ట్ కాగా, రీతూకు తనూజ, పవన్ సపోర్ట్ అందించారు. కఠినంగా సాగిన ఈ రౌండ్‌లో రీతూనే గెలిచింది. దీంతో ఇమ్మానియేల్ మొదటి ఫైనలిస్ట్ రేస్ నుండి బయటపడ్డాడు. అతని గడులు కల్యాణ్‌కు వెళ్లాయి. ఇమ్మానియెల్ కు మొదటి ఫైనలిస్ట్ అవకాశం చేజారినందుకు ఇమ్మానియెల్ కన్నా కూడా కళ్యాణ్ ఎక్కువగా ఎమోషన్ అయ్యాడు. కళ్యాణ్ బాధ పడుతూ ఫేస్ వాష్ కు వెళ్ళినప్పుడు అది గమనించిన తనూజ కళ్యాణ్ ను దూరం నుంచీ చూస్తూ ఉన్న క్యూట్ దృశ్యం ఈ సీజన్ లోనే హైలైట్ అని చెప్పవచ్చు. ఇది సినిమా దృశ్యాన్ని తలపించింది.
ఇప్పుడు ప్రధాన తుది పోటీ కళ్యాణ్–రీతూ మధ్య “జయమ్ము నిచ్చయంబురా”. పవన్, తనూజ ఈ టాస్క్‌కు సంచాలకులుగా వ్యవహరించారు. ఈ రౌండ్‌ను కల్యాణ్ ముందుగానే పూర్తి చేసి ఘన విజయం సాధించాడు.
అలా సీజన్ 9 తొలి ఫైనలిస్ట్‌గా కల్యాణ్ అధికారికంగా అవతరించాడు. బిగ్ బాస్ షీల్డ్‌ను స్వీకరించిన కల్యాణ్ ఎమోషన్‌తో నిండిపోయాడు. ఇంట్లో ఆనంద వాతావరణం నెలకొంది.
ఇదిలా ఉండగా, గత వారం ఎపిసోడ్‌లో ఇమ్మానియేల్ పాడిన పాటలో తనపై నెగటివ్ లైన్స్ ఉన్నట్లు భావించి సంజన ఏడ్చిన విషయంపై కూడా చర్చ సాగింది. ఇమ్మానియేల్ అది తన గురించి కాదని సంజనకు, సభ్యులందరికీ వివరించాడు.
ఎపిసోడ్ 90 బిగ్ బాస్ సీజన్ 9లో ఇప్పటివరకు వచ్చిన అత్యంత డ్రామాటిక్, హై-టెన్షన్, ఎమోషనల్ ఎపిసోడ్!
