బిగ్ బాస్ సీజన్ 9 ఆదివారం ప్రసారమైన 85వ ఎపిసోడ్ అసలు రోలర్కోస్టర్ లాగా సాగింది. ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియతో హౌస్ పూర్తిగా టెన్షన్లోకి వెళ్లిపోయింది. ఎపిసోడ్ మధ్యలో హోస్ట్ నాగార్జున ఇంటి సభ్యులకు ఫన్ గేమ్స్ నిర్వహించి వాతావరణాన్ని కాస్త లైట్ చేశారు. కానీ సేవింగ్ రౌండ్స్ మొదలయ్యాక మాత్రం హౌస్ మొత్తం వైబ్ మళ్ళీ సీరియస్ మోడ్లోకి వెళ్లింది.
మొదటి సేవింగ్ రౌండ్: పవన్ సేఫ్ అయ్యాడు.
రెండో సేవింగ్ రౌండ్: భరణి, కల్యాణ్ లు సేఫ్ అయ్యారు.
బిగ్ బాస్ ట్రీ టాస్క్ – సంజనపై భారీ టార్గెట్!
హౌస్లో సాగిన ట్రీ టాస్క్ అసలు ఎపిసోడ్ హైలైట్. ఈ ట్రీ నుంచి ఒక్కొక్కరు, “ఇంటి లో ఉండకూడదని అనిపించే వ్యక్తిని” ట్రీ నుంచి తీసేయాలి. అందులో జరిగిన నిర్ణయాలు ఇలా ఉన్నాయి:
భరణి → సంజన ను
సంజన → రీతూను
దివ్య → రీతూను
పవన్ → సంజనను
సుమన్ → సంజనను
కల్యాణ్ → సంజనను
ఇమ్మానియేల్ → సంజనను
తనూజ → సంజనను.. ట్రీ నుంచి తొలగిస్తూ.. ఇంటిలో ఉండకూడదని అభిప్రాయపడ్డారు.
ఇక్కడ క్లియర్ గా గమనించదగ్గ విషయం ఏమిటంటే… సంజనను ఎక్కువ మంది — మొత్తం ఆరుగురు — ట్రీ నుంచి బయటకు తీసేశారు. ఇది హౌస్లో ఆమెపై ఉన్న నెగెటివ్ వైబ్ను స్పష్టంగా చూపించింది.
తరువాతి సేవింగ్ రౌండ్స్:
మూడో సేవింగ్ రౌండ్: ఇమ్మానియేల్ సేఫ్ అయ్యాడు.
నాలుగో సేవింగ్ రౌండ్: తనూజ, సంజన ఇద్దరూ సేఫ్ అయ్యారు.
చివరి ఫేస్-ఆఫ్: దివ్య vs సుమన్
చివరగా దివ్య, సుమన్ ఇద్దరూ ఎలిమినేషన్ డేలో బాటిల్ చేసుకున్నారు. ఇక్కడ అందరూ ఊహించినట్లుగానే… దివ్య ఎలిమినేట్ అయ్యింది.
ఎలిమినేషన్ తర్వాత హోస్ట్ నాగార్జున ఇచ్చిన అవకాశం ప్రకారం దివ్య హౌస్ సభ్యులపై క్విక్ ఫీడ్బ్యాక్ ఇచ్చింది:
పవన్ – నీకోసం నువ్వే ఆడు.
ఇమ్మానియేల్ – సడెన్ గా బ్లాంక్ అవుతాడు.
సంజన – మాట జాగ్రత్త.
తనూజ – నెగెటివ్ పాయింట్స్ లేవు.
కల్యాణ్ – స్ట్రాంగ్ గా ఉండు.
రీతూ – ఎమోషన్స్ను తగ్గించు.
భరణి – గేమ్ బాగా ఆడండి.
సుమన్ – ఎమోషన్ అవ్వొద్దు.
దివ్య ఇచ్చిన ఈ నిశితమైన వ్యాఖ్యలు హౌస్లోని ప్రతి ఒక్కరి మెంటల్ స్టేట్కి ఒక షేక్ ఇచ్చాయి.
హోస్ట్ నాగార్జున చివరి సూచన:
ఇప్పటికే 12 వారాలు పూర్తయ్యాయని, ఇంకా కేవలం 3 వారాలు మాత్రమే మిగిలి ఉన్నాయని నాగ్ గుర్తుచేశారు. టాప్ 5లో ఉండాలంటే ప్రతి ఒక్కరూ ఇప్పుడు మరింత శక్తివంతంగా గేమ్ ఆడాలని హోమ్మేట్స్కు సలహా ఇచ్చారు.
మొత్తానికి ఎపిసోడ్ 85 బిగ్ డ్రామా, బిగ్ టెన్షన్, బిగ్ ఎమోషన్ తో నిండిపోయింది.
