బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో ఎనిమిదో సీజన్ ముగింపుకి వచ్చింది. ఈ వారాంతంలో టైటిల్ విజేత ఎవరన్నది తేలిపోతుంది. గడచిన వీకెండ్‌లో రోహిణి, విష్ణుప్రియ ఎలిమినేట్ అయ్యారు. ఇక, టైటిల్ రేసులో మిగిలింది నిఖిల్, ప్రేరణ, నబీల్, గౌతమ్, అవినాష్ మాత్రమే.!
నిఖిల్, ప్రేరణ, నబీల్.. బిగ్ హౌస్‌లో మొదటి నుంచీ వున్నారు. కానీ, గౌతమ్ అలాగే అవినాష్ మాత్రం వైల్డ్ కార్డ్ ఎంట్రీస్.! ఎంటర్టైనింగ్ కోణంలో చూస్తే, ఈ సీజన్ మొత్తానికీ సెంటరాఫ్ ఎట్రాక్షన్ అవినాష్ మాత్రమే. కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, టాస్కుల్లోనూ అవినాష్ చాలా బాగా ఆడాడు. డిగ్నిటీ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి.. అవినాష్ బాడీ లాంగ్వేజ్ ఈ సీజన్‌లో చాలా మెచ్యూర్డ్‌గా వుంది.
గౌతమ్ కృష్ణ ‘అశ్వద్ధామ’ అంటూ చేసిన హడావిడి మాత్రమే కాదు, టాస్కుల్లోనూ చాలా బాగా ఆడాడు. అతనికి సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది ఈ మధ్యకాలంలో.
నిఖిల్, ప్రేరణ ‘కన్నడ’ కోటాలో హడావిడి చేస్తున్నారు. ఈ ఇద్దరిలోనూ ప్రేరణకి ఎక్కువ మార్కులు పడతాయ్. నిఖిల్ మొదట్లో ఆకట్టుకున్నాడు, ఆ తర్వాత బాగా డల్ అయిపోయాడు. నిఖిల్ వెంటే నబీల్.. అన్నట్లు తయారైంది వ్యవహారం.
వాస్తవానికి, నబీల్ కంటే కూడా రోహిణి చాలా చాలా బెటర్. రోహిణిని ఎందుకు పంపించేశారన్నది ఓ పెద్ద క్వశ్చన్. విష్ణుప్రియ ఎప్పుడో ఎలిమినేట్ అయిపోయి వుండాల్సింది. కానీ, ఇక్కడిదాకా తీసుకొచ్చి.. చివర్లో ఆమెని పక్కన పడేశారు.
ప్రస్తుతం కనిపిస్తున్న ఓటింగ్ ట్రెండ్స్ ప్రకారం చూసుకుంటే, అవినాష్‌కి మద్దుతుగా పడుతున్న ఓట్లు చాలా చాలా ఎక్కువనే చెప్పాలి. ఆ తర్వాతి స్థానం గౌతమ్‌దే. నిఖిల్ – ప్రేరణ – నబీల్ మధ్య ఓట్లు డివైడ్ అవుతున్నాయి. ఈ ముగ్గురిలో మళ్ళీ ప్రేరణకి ‘విమెన్ కార్డ్’ అనేది అడ్వాంటేజ్.
సీజన్ మొదటి నుంచీ చూస్తున్నవారికి, నిఖిల్ పట్ల హోస్ట్ అక్కినేని నాగార్జునకి వున్న స్పెషల్ ఇంట్రెస్ట్ ఈజీగానే అర్థమవుతుంది. అదే సమయంలో, గౌతమ్ అంటే నాగార్జునకి అస్సలు పడదన్న విషయమూ బోదపడుతుంది.
పేరుకే ఓటింగ్.. టైటిల్ విన్నర్ ఎవరన్నది ముందే డిసైడ్ అయిపోతుందన్న వాదనా లేకపోలేదు. స్ట్రాంగ్ వాయిస్ సోనియా ఆకుల, హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన తీరు కావొచ్చు.. పృధ్వీని హౌస్‌లో చాలా వారాలు సాగదీయడం కావొచ్చు.. చెప్పుకుంటూ పోతే, చాలా ఉదాహరణలు.. బిగ్ బాస్ అసలు రియాల్టీ షో కాదని చెప్పడానికి కనిపిస్తాయి.
బయాస్డ్ బిగ్ బాస్ యాంగిల్‌లో చూస్తే, నిఖిల్ లేదా ప్రేరణ.. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరికి టైటిల్ విన్నర్ అనే ట్యాగ్ తగిలించేయొచ్చు. గ్రౌండ్ రియాల్టీ చూస్తే మొదటి ఆప్షన్ అవినాష్, రెండో ఆప్షన్ గౌతమ్.
నిన్న ఎలిమినేట్ అయిన విష్ణు ప్రియని కేవలం వీకెండ్ ఎపిసోడ్స్‌లో ఫన్ కోసం వాడుకున్నారు బిగ్ బాస్ నిర్వాహకులు. అంతే కాదు, పృధ్వీతో విష్ణుప్రియకి పులిహోర కలిపించే వ్యవహారాల్ని బిగ్ బాగానే డిజైన్ చేశాడు
పృధ్వీకి స్నేహితులు గనుక నిఖిల్, ప్రేరణలకు విష్ణు ప్రియ నుంచి మద్దతు లభిస్తోంది.
ఓవరాల్‌గా ఈ సీజన్ ఒకింత పాజిటివ్ నోట్‌తో మొదలైనా.. చివరికొచ్చేసరికి నీరుగారిపోయింది. కాకపోతే, గత సీజన్‌తో పోల్చితే ఈ సీజన్ కొంచెం ఎక్కువ హడావిడి చేసినట్లే కనిపిస్తోంది.