నిఖిల్ అంటే కూల్ అండ్ లవ్లీ.! పృధ్వీ హ్యాండ్సమ్‌గా నవ్వుతాడుగానీ, కోపమొస్తే మనిషి కాదు, మృగంలా మారిపోతాడు.! నబీల్ అయితే, ఓవరాక్షన్‌కి కేరాఫ్ అడ్రస్.! గౌతమ్‌ని చూస్తే కుళ్ళుమోతుతనం కనిపిస్తుంది.! ఇలా బిగ్ హౌస్‌లో ఈ ముగ్గురు కంటెస్టెంట్ల గురించీ, బయట ఓ బలమైన అభిప్రాయం వుంది.!
బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో ఎనిమిదో ఎడిషన్ ముగింపు దశకు వస్తున్న సంగతి తెలిసిందే. సీజన్ ఎనిమిది అంటే ట్విస్టుల మయం.. అని హోస్ట్ అక్కినేని నాగార్జున చెబుతూ వస్తున్నాడు. వైల్డ్ కార్డ్ ఎంట్రీలు పెద్దయెత్తున రావడమొక్కటీ కాస్త ఆసక్తికరం. మిగతా టాస్కులు అన్నీ పాత వ్యవహారాలే.
పైన చెప్పుకున్న ముగ్గురు కంటెస్టెంట్లలో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు.? అంటే, ఎగ్రెసివ్ కంటెస్టెంట్ల గురించిన చర్చ ఇది. అవినాష్ కూడా కోప్పడతాడు, టేస్టీ తేజకి కూడా కోపమొస్తుంది. నిఖిల్ తక్కువోడేమీ కాదు. ఫిమేల్ కంటెస్టెంట్లూ అంతే. కాకపోతే, పైన పేర్కొన్న ముగ్గురి లోంచి ఇద్దర్ని.. వీలైతే, ముగ్గుర్నీ.. కనీసం ఒక్కర్నయినా వున్నపళంగా బయటకు పంపించేయాలంటూ సోషల్ మీడియా వేదికగా డిమాండ్లు చూస్తున్నాం.
వీరిలో గౌతమ్ అంటే హోస్ట్ అక్కినేని నాగార్జునకీ బాగా కాలుతోంది. అందుకే, శనివారం ఎపిసోడ్‌లో ‘షటప్ గౌతమ్’ అనేశాడాయన. సో, ఈ వారం గౌతమ్ ఎలిమినేట్ అయిపోవడానికి అవకాశాలు ఎక్కువగా వున్నట్లేనన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ, నబీల్ అలాగే పృధ్వీలలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారనేవారూ లేకపోలేదు.
ఆదివారం ఎపిసోడ్‌లో యష్మీ ఎలిమినేట్ అయిన దరిమిలా, ఈ వారం మాత్రం ఫిమేట్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవబోతోందన్న వాదనా లేకపోలేదు. విష్ణు ప్రియని అనూహ్యంగా గెంటేస్తారా.? అన్న ప్రచారానికి ఈ వాదనే కారణం.
ఈ వారం ఇద్దరు కంటెస్టెంట్ల ఎలిమినేష్ వుంటుందనీ, ఒకటి మిడ్ వీక్ ఎలిమినేషన్ అనీ.. లీకులు వస్తున్నాయ్. ఇదెంత నిజం.? అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. ముందే చెప్పుకున్నట్లు బిగ్ హౌస్‌లో ఏమైనా జరగొచ్చు. అంతా బిగ్ బాస్ మాయ.!