బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో, ఎనిమిదో సీజన్ నుంచి ఈ వీక్ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్.. నిజంగానే సర్‌ప్రైజింగ్ వన్.! ఔను, ఎవరూ ఊహించలేదు, సోనియా ఎలిమినేట్ అయిపోతుందని. నిజానికి, అనఫీషియల్ ఓటింగ్ ప్యాటర్న్స్ ఏవి చూసినాగానీ, సోనియా కంఫర్ట్ పొజిషన్‌లోనే సేవ్ అయిపోయి వుండాలి.
అసలు బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో.. ఓటింగ్ ఒరిజినల్ ప్యాటర్న్ ఏంటో.. ఎవరు ఎలా ఓట్లు వేస్తున్నారో.. ఎవరికి ఎన్ని ఓట్లు వేస్తున్నారో.. దీనికి, అధికారికంగా ఎలాంటి సమాచారమూ వుండదు. హౌస్‌లో ఏ కంటెస్టెంట్ స్ట్రాంగ్, ఎవరు వీక్.? అన్నదానిపై ఆడియన్స్ జడ్జిమెంట్‌తో అస్సలు సంబంధమే వుండదు.
ఎందుకంటే, లైవ్ టెలికాస్ట్‌లో కూడా బిగ్ బాస్ ఎవర్ని చూపించాలనుకుంటే, వాళ్ళనే చూపిస్తాడు. అలా చూపించే కంటెంట్‌ని బట్టి, కంటెస్టెంట్ల ‘క్యారెక్టర్’ని జడ్జ్ చేసెయ్యడం జరుగుతుంటుంది ఆడియన్స్. అలా, కొంతమంది కంటెస్టెంట్స్ విషయంలో విపరీతమైన నెగెటివిటీ క్రియేట్ అవడం చూస్తున్నాం.. గత కొన్ని సీజన్లుగా.
ఈసారీ అదే జరిగింది. సోనియా మీద విపరీతమైన నెగెటివిటీ క్రియేట్ అయ్యింది. హౌస్‌లో కంటెస్టెంట్లు గ్రూపులుగా ఏర్పడి, రాజకీయాలు చేయడం మామూలే. కానీ, సోనియా.. ఈ గ్రూపు రాజకీయాల ముద్రతో ఔట్ అయిపోయింది.
నిఖిల్, పృధ్వీలను తనవైపు తిప్పుకుని, తన గుప్పిట్లో పెట్టుకుందన్నది సోనియా మీద ప్రధాన ఆరోపణ. బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో, గత సీజన్లలో ఇలాంటివి చాలానే జరిగాయి. కానీ, సోనియా తరహాలో ఎవరూ ఎలిమినేట్ అవలేదని చెప్పొచ్చు.
ఏదన్నా విషయమ్మీద తప్పో, ఒప్పో.. తనదైన వాదనని బలంగా వినిపించే కంటెస్టెంట్ అంటే, సోనియా మాత్రమే. బోల్డంత కంటెంట్ కూడా ఇస్తోంది సోనియా. అలాంటి సోనియా మీద, మిగతా హౌస్ మేట్స్ (మెజార్టీ) కత్తి కట్టేయడమంటే.. అందులోనూ కొంత విషయం లేకపోలేదు. సోనియా, ఆ ఇద్దరితో తప్ప.. మిగతా హౌస్‌మేట్స్‌తో కలవ లేదు సరికదా, అందర్నీ శతృవుల్లానే చూసిందేమో.!
ఈ విశ్లేషణ అంతా, టెలికాస్ట్ అయిన రెగ్యులర్ ఎపిసోడ్స్ అలాగే లైవ్ స్ట్రీమింగ్‌ని అనుసరించి మాత్రమే సుమీ. లోపల నిజంగా ఏం జరిగిందన్నది ఆ కంటెస్టెంట్లకి మాత్రమే తెలుస్తుంది. హౌస్‌లో మెజార్టీ ఫిమేల్ కంటెస్టెంట్లు తనను టార్గెట్ చేశారనీ, అదే తన ఎలిమినేషన్‌కి కారణమయి వుండొచ్చని సోనియా విశ్లేషించుకుంటోంది.
మరోపక్క, సోనియా వల్ల నిఖిల్ అలాగే ఫృధ్వీ ఆట చెడిపోతోందని ఆ ఇద్దరు కంటెస్టెంట్లను అభిమానించే కొందరు నెటిజన్స్ ఫీల్ అవడమూ, సోనియాకి వ్యతిరేకంగా ఓట్లు పడటానికి కారణమైందని చెప్పొచ్చేమో.
విష్ణు ప్రియ – సోనియా, నబీల్ – సోనియా, ప్రేరణ – సోనియా, యష్మి – సోనియా.. ఇలా గట్టి యుద్ధాలే బిగ్ హౌస్‌లో జరిగాయ్. అయినాగానీ, సోనియాని పంపించేసి హౌస్‌లో మణికంఠని కొనసాగించడమేంటో. మణికంఠతో పోల్చితే హండ్రెడ్ పర్సంట్ పెర్‌ఫెక్ట్ కంటెస్టెంట్ కదా సోనియా అంటే.!
బిగ్ బాస్‌లో ఏమైనా జరగొచ్చు.. బిగ్ బాస్ ఎలా ఆడిస్తే ఆట అలా సాగుతుంటుంది. సోనియా ఎలిమినేషన్ ఇందుకు నిదర్శనం. గత సీజన్లలో కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్లు షాకింగ్‌గా బయటకు వెళ్లిపోయారు. ఏమో, వైల్డ్ కార్డ్ ఎంట్రీ రూపంలో సోనియా మళ్ళీ హౌస్‌లోకి వచ్చే అవకాశముందా.? వుంటే మాత్రం, ఆట మరింత రసవత్తరంగా మారే అవకాశాల్లేకపోలేదు.
అన్నట్టు, ఈ వారం ఓ ‘మిడ్ వీక్ ఎలిమినేషన్’ వుంటుందని హోస్ట్ అక్కినేని నాగార్జున ప్రకటించేయడం ఒకింత ఆసక్తికరం. వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా ఈ వారం వుండొచ్చని గుసగుసలు వినిపిస్తున్నాయి.