బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో ఎనిమిదో సీజన్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్‌కి రంగం సిద్ధమయ్యింది.? ఒకరు కాదు, ఎక్కువమందే వైల్డ్ కార్డ్ రూపంలో బిగ్ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. రేపే.. అంటే, ఆదివారం అక్టోబర్ 6న ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వుంటాయని బిగ్ హోస్ట్ అక్కినేని నాగార్జున, శనివారం ప్రసారమైన ఎపిసోడ్‌లో ప్రకటించేశారు.
ఈ వీకెండ్ సెలబ్రేషన్స్ కూడా ఓ రేంజ్‌లో వుండబోతున్నట్లు ప్రోమో కూడా వదిలారు. ఇక, శనివారం ఎపిసోడ్‌లో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, కంటెస్టెంట్ యష్మి తన సీక్రెట్ బాయ్‌ఫ్రెండ్ విషయాన్ని వెల్లడించింది. పేరు మాత్రం ప్రకటించలేదు. అతని పేరు, తన పేరు కలిసొచ్చేలా టాట్టూ వేసుకుందట యష్మి. ఈ విషయం ఇంట్లో కూడా ఎవరికీ తెలియదని ఆమె అంటోంది.
ఇదంతా యష్మికి ఆమె ఇంటి నుంచి వచ్చిన లెటర్‌లోని విశేషాలు రివీల్ చేయడానికి, నాగ్ పెట్టిన పరీక్షలో వెల్లడయ్యింది. ఇంతా చేసి నాగ్ రివీల్ చేసిన, ఆ లెటర్‌లోని ముఖ్యాంశాలూ పెద్దగా ఏమీ లేవనుకోండి.. అది వేరే సంగతి.
మరోపక్క, హౌస్ నుంచి మిడ్ వీక్ ఎలిమినేట్ అయిన ఆదిత్య ఓం, శనివారం నాగార్జునతో కలిసి వేదికపై కనిపించాడు. ఈ రోజు అతని పుట్టినరోజు కూడానట. హౌస్‌మేట్స్‌లో కొందరికి హగ్స్ ఇచ్చాడు వేదిక మీదనుంచే.. కొందరికి పంచ్‌లు కూడా ఇచ్చాడు. పంచ్‌లు కూడా స్వీట్ పంచ్‌లేననుకోండి.. అది వేరే సంగతి.
షరామామూలుగానే, హోస్ట్ అక్కినేని నాగార్జున శనివారం ఎపిసోడ్‌లో కొందరు కంటెస్టెంట్లకు క్లాస్ తీసుకున్నాడు. సీత, మణికంఠకి బాగా పడ్డాయ్. అంతలోనే మణికంఠకి ఊరట కూడా ఇచ్చేశాడు నాగ్. ఆ స్పెషల్ ఎంట్రెస్ట్ ఏమిటో ఎవరికీ అర్థం కావడంలేదు.
ప్రేరణ బాగా ఆడుతోందంటూ నాగ్ కితాబులివ్వడం గమనార్హం. ఈ అప్రీషియేషన్ కోసమే తాను ఎదురు చూసినట్లు ప్రేరణ చెప్పుకొచ్చింది. విష్ణు ప్రియని పదే పదే ‘కళామతల్లి ముద్దు బిడ్డ’ అని నాగ్ పిలవడం ఎందుకో, విష్ణు ప్రియకి కూడా నచ్చినట్లు లేదు. ‘నువ్వు ఇక్కడికి వచ్చెయ్ విష్ణు ప్రియా..’ అని నాగ్ అడిగితే, ‘మీరడిగితే ఎక్కడికైనా వచ్చేస్తా’ అని విష్ణుప్రియ చెప్పడం, అయితే వచ్చెయ్.. అని నాగ్ ఇంకోసారి అనడం.. ‘వద్దు’ అని విష్ణు ప్రియ తిరస్కరించడం.. ఇవన్నీ డ్రమెటిక్‌గా సాగాయ్.
ఇదిలా వుంటే, ఎలిమినేట్ అయిన ఆదిత్య ఓంకి సంబంధించి హౌస్ జర్నీ తాలూకు వీడియో ప్లే చేశారు. ఇది ఒకింత ఎమోషనల్‌గానే డిజైన్ చేశారు. అన్నట్టు, రేపు ఇంకో ఎలిమినేషన్ వుంది. అదెవరన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.
కొత్తగా వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చే కంటెస్టెంట్లు మరీ వైల్డ్‌గా వుంటారని హోస్ట్ నాగార్జున ప్రస్తుత హౌస్ మేట్స్‌ని హెచ్చరిస్తున్నా, గత అనుభవాల నేపథ్యంలో ఆ రాబోయే కంటెస్టెంట్లకు అంత సీన్ వుండదని బిగ్ బాస్ వ్యూయర్స్ డిసైడ్ అయిపోయారు.
Why viewers still use to read news papers when in this technological
world everything is accessible on net?