యష్మీ గౌడ.. తెలుగు టీవీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. “స్వాతి చినుకులు” అనే సీరియల్ ద్వారా ఆడియన్స్ కి పరిచయమైంది ఈమె. ఈటీవీలో ప్రసారమైన ఈ సీరియల్ లో వెన్నెల అనే పాత్రలో కనిపించింది. ఆ సీరియల్ సూపర్ హిట్ కావడంతో వరుస ఆఫర్లు అందుకుంది. మోడల్ గా కెరీర్ మొదలుపెట్టిన యష్మీ.. మిస్ మైసూర్, మిస్ ఫోటోజెనిక్ ఫేస్ టైటిల్స్ ని అందుకుంది. ” విద్యా వినాయక” అనే సీరియల్ తో కన్నడలో తెరంగేట్రం చేసింది. తెలుగులో “స్వాతి చినుకులు” తర్వాత జీ తెలుగు లో వచ్చిన “నాగ భైరవి” లో లీడ్ రోల్ పోషించింది. మాటీవీలో వచ్చిన సూపర్ హిట్ సీరియల్ “కృష్ణ ముకుంద మురారి” లో ముకుంద పాత్రలో నెగటివ్ రోల్ చేసింది.
ఆ సీరియల్ తో యష్మీ బాగా పాపులర్ అయింది. ఈ మధ్యనే ఈ సీరియల్ కు ఎండ్ కార్డ్ పడింది. ప్రస్తుతం తనను ముకుందా అని పిలుస్తున్నారని, అంతలా ఆ పాత్ర జనాల్లో ప్రభావం చూపిందని మొన్నామధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఆ సీరియల్ తర్వాత డైరెక్ట్ గా బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి అదరగొడుతోంది. హౌస్ లోకి వచ్చి రాగానే.. రోజా పూలు ఇచ్చి హోస్ట్ నాగార్జునను మెప్పించింది. తనకి ఇష్టమైన బిర్యాని టేస్ట్ చేయించి మరీ నాగ్ ఆమెను హౌస్ లోకి స్వాగతించారు. ఇప్పటికైతే మిగతా కంటెస్టెంట్లకు గట్టి పోటీ ఇస్తున్న ఆమె.. గత సీజన్ లో ప్రియాంకను గుర్తుకు తెస్తోంది. ఆమెలాగే యష్మీ కూడా ఎక్కువ రోజులు హౌస్ లో ఉంటుందేమో చూడాలి.