తెలుగు బిగ్ బాస్ కొత్త సీజన్ సందడి షురూ అయ్యింది. గత నెలలోనే సీజన్ 6 కి సంబంధించిన అప్‌డేట్ వచ్చింది. ఆ తర్వాత మళ్లీ ఎలాంటి అప్డేట్ స్టార్ మా నుండి రాకపోవడంతో ఆగస్టులో సీజన్ 6 ప్రారంభం పై అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కానీ తాజాగా ప్రోమో షూట్ చేయడంతో పాటు సీజన్ 6 కి సంబంధించిన లోగో ను కూడా అధికారికంగా విడుదల చేశారు. ఒకటి రెండు రోజుల్లోనే కొత్త సీజన్ ప్రోమో ను విడుదల చేస్తారనే వార్తలు వస్తున్నాయి.
నాగార్జున ఈసారి చాలా విభిన్నంగా మరింత దూకుడుగా షో ను నిర్వహిస్తారనే వార్తలు జోరుగా వస్తున్నాయి. ఇదే సమయంలో షో ను స్టార్ మా లో మరింత ఎక్కువ రేటింగ్ వచ్చే విధంగా టెలికాస్ట్ చేయాలని భావిస్తున్నారు. బిగ్ బాస్ ఓటీటీకి కూడా మంచి రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో ఈ రెగ్యులర్ బిగ్ బాస్ కు మరింతగా స్పాన్సర్స్ వచ్చారని.. దాంతో కాస్త ఖరీదైన కంటెస్టెంట్స్ ను ఎంపిక చేశారనే వార్తలు వస్తున్నాయి.