Switch to English

బిగ్‌ బాస్ 6 నేహా చౌదరి గురించి ఆసక్తికర విషయాలు

91,318FansLike
57,014FollowersFollow

తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 లో నాలుగవ కంటెస్టెంట్ గా అడుగు పెట్టిన బుల్లి తెర స్టార్ నేహా చౌదరి. ఈమె న్యూస్ రీడర్ నుండి కెరీర్‌ ని మొదలు పెట్టి క్రికెట్ కామెంట్రీ చెప్పే వరకు కెరియర్ లో ముందుకు వెళ్ళింది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో మోస్ట్ గ్లామర్ అమ్మాయిల జాబితాలో ఈమె ముందు వరుసలో ఉంటుంది అనడంలో సందేహం లేదు. అందంతో పాటు మంచి ప్రతిభ ఉన్న నేహా చౌదరి తప్పకుండా బిగ్ బాస్ లో సక్సెస్ అయ్యి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుందంటూ అంతా నమ్మకంగా ఉన్నారు.

బుల్లి తెర స్టార్ నేహా చౌదరి గురించి మరిన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. నేహా చౌదరి తిరుపతిలో జన్మించింది, కంప్యూటర్ సైన్స్ లో ఇంజనీరింగ్ పూర్తి చేసి కొన్ని నెలల పాటు సాఫ్ట్‌ వేర్‌ ఇంజనీర్ గా కూడా విధులు నిర్వహించింది. కుటుంబం మొదట్లో బాగా బతికింది, కానీ వ్యవసాయం మరియు వ్యాపారంలో నష్టం రావడంతో మధ్య తరగతి కుటుంబంగా మారింది. అందుకే నేహా చౌదరి మధ్య తరగతి జీవితాన్ని అనుభవించింది. నేహా చౌదరి తల్లిగారికి నంద్యాలలో ప్రభుత్వ ఉద్యోగం రావడంతో విద్యాభ్యాసం అంతా కూడా అక్కడే జరిగింది.

చిన్నప్పటి నుండే నేహా చౌదరికి ఎంటర్టైన్మెంట్ రంగంలో ఆసక్తి ఉండేది. ఆ ఆసక్తితోనే ఎన్నో స్కూల్ యాక్టివిటీస్ లో పాల్గొనేది. ఇక నేహా చౌదరి చిన్న వయసులో జిమ్నా స్టిక్స్ నేర్చుకుంది. చాలా చిన్న వయసులో చాలా ఫాస్ట్ గా జిమ్నాస్టిక్స్ నేర్చుకుని సీనియర్స్ కి కూడా షాక్ ఇచ్చేది. ఆమె కోచ్ సీనియర్స్ తో పాటు ఆమెకు ట్రైనింగ్ ఇచ్చేవాడు అంటే ఆమె యొక్క ప్రతిభను అర్థం చేసుకోవచ్చు.

గతంలో ఒక ఇంటర్వ్యూలో నేహా చౌదరి మాట్లాడుతూ.. తమది వ్యవసాయ కుటుంబం అయినా కూడా కొన్ని కారణాల వల్ల మా నాన్నగారు భూమిని అమ్మేశాడంటూ చెప్పుకొచ్చింది. నాకు ఫోన్ కావాలి అంటే నాన్న అప్పు చేసి మరి ఫోన్ కొనిచ్చాడని, నాకు ఇష్టమైన వాటికోసం నాన్న చాలా కష్టపడేవాడంటూ ఎమోషనల్ అయింది.

నేహ చౌదరి మొదట ప్రముఖ న్యూస్ ఛానల్ మహా న్యూస్ లో యాంకర్ గా కెరియర్ ప్రారంభించింది. అనంతరం సాక్షి. ఎన్టీవీ, వనిత, మా మ్యూజిక్, స్టార్ స్పోర్ట్స్ ఇలా ఎన్నో చానల్స్ లో హోస్ట్ గా వ్యవహరించింది. ప్రో కబడ్డీ, ఐపీఎల్ వరల్డ్ కప్ వంటి ఎన్నో టోర్నమెంట్స్ కి కూడా ఆమె యాంకర్ గా వ్యవహరించి క్రీడా అభిమానులను ఆకట్టుకుంది. బుల్లి తెరతో పాటు వెండి తెరపై కూడా మెరవాలనేది ఆమె ఆశ. అందుకే బిగ్ బాస్ లో అడుగు పెట్టి వెండి తెర అవకాశాలను వెతుక్కుంటున్నట్లుగా అంటూ స్నేహితులతో చెప్పేది.

మల్టీ టాలెంటెడ్ అనడానికి నేహ చౌదరి చక్కని ఉదాహరణ అనడంలో సందేహం లేదు. చిన్నప్పుడే జిమ్నాస్టిక్స్ లో ఛాంపియన్ గా నిలిచి, ఇంజనీరింగ్ పూర్తి చేసి ఇంజనీర్‌ గా జాబ్‌ చేసింది. ఆ తర్వాత యాంకర్ గా.. హోస్ట్ గా జాబ్ చేసింది. అంతే కాకుండా యాక్టర్ గా, డాన్సర్ గా, మోడల్ గా చివరకు యోగా టీచర్ గా కూడా నేహా చౌదరి చేసింది. ఇప్పుడు బిగ్ బాస్ లో ఆమె మల్టీ టాలెంట్‌ ఎంత వరకు ఉపయోగపడుతుంది.. ఆమెకు ప్రేక్షకులు ఎంత వరకు ఓట్లు వేస్తారు అనేది చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

శీతాకాలంలో “గుర్తుందా శీతాకాలం”

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న చిత్రాల్లో ఫీల్ గుడ్ మూవీగా రాబోతున్న చిత్రం ‘గుర్తుందా శీతాకాలం’. టాలెంటెడ్ యంగ్ హీరో స‌త్యదేవ్, మిల్కి బ్యూటీ త‌మ‌న్నా, మేఘా ఆకాష్,...

‘పంచ తంత్రం’… ట్రైలర్ ను విడుదల చేసిన రష్మిక మందన్న

డా.బ్ర‌హ్మానందం, స్వాతి రెడ్డి, స‌ముద్ర ఖ‌ని, రాహుల్ విజ‌య్‌, శివాత్మిక రాజ‌శేఖ‌ర్‌, న‌రేష్ అగ‌స్త్య‌, దివ్య ద్రిష్టి, వికాస్ ముప్ప‌ల త‌దిత‌రులు న‌టిస్తోన్న యాంథాల‌జీ ‘పంచతంత్రం’....

కథలో మార్పులు చేస్తున్న పవన్ కల్యాణ్.. గట్టిగానే ఇస్తాడట!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘హరిహర వీరమల్లు’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తుండగా, పీరియాడికల్...

వైయస్ఆర్‌తో పాటు హెలికాప్టర్‌లో వెళ్లాల్సింది.. షాకింగ్ విషయాలను వెల్లడించిన కిరణ్ కుమార్...

నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న ‘అన్‌స్టాపబుల్-2’ టాక్ షో తాజాగా నాలుగో ఎపిసోడ్‌ను స్ట్రీమింగ్ చేశారు. ఈ ఎపిసోడ్‌కు చీఫ్ గెస్టులుగా, ఏపీ రాష్ట్ర మాజీ...

కెప్టెన్ ఇనాయా.! ఫిజికల్ టాస్క్‌లో అమ్మాయిలదే హవా.!

సాధారణంగా ఫిజికల్ టాస్క్ అనగానే, అమ్మాయిలు - అబ్బాయిల మధ్య రచ్చ జరుగుతుంటుంది. అక్కడ టచ్ చేశావ్.. ఇక్కడ చెయ్యి పెట్టావ్.. అంటూ ఫిమేల్ కంటెస్టెంట్లు...

రాజకీయం

ముఖ్యమంత్రి అజ్ఞానంలో వుంటారు.! జనసేనాని సంచలన వ్యాఖ్యలు.!

‘నేను ఉద్దానం ఎప్పుడు వెళ్ళానో కూడా ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తెలియకపోవడం శోచనీయం. ఏమీ తెలియకుండానే ఆయన ఏవేవో మాట్లాడేస్తుంటారు నా గురించి. ఆయన అలా అజ్ఞానంలో వుంటారు....

జస్ట్ ఆస్కింగ్: క్రమశిక్షణ అంటే బూతులు తిట్టడమా.?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని నాలుగు మంచి మాటలు చెప్పారు. ఉన్నత పదవుల్లో వున్నవాళ్ళు మంచి మాటలు చెప్పాలి. వాటిని ప్రజలు ఆచరించేలా చూడాలి. అంతకన్నా...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని అవసరం లేదా.?

అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని అనేది అవసరమా.? కాదా.? రాష్ట్ర ప్రజలు రాజధాని విషయమై ఏమనుకుంటున్నారు.? వైసీపీ సర్కారు ఆలోచనలో ఒక రాజధాని కుదరదు.. మూడు రాజధానులు ఖచ్చితంగా వుండాల్సిందే.! ఆ మూడు...

ఇప్పటం వివాదం: పవన్ కళ్యాణ్ అంత పెద్ద నేరం చేశారా.?

ఇప్పటం గ్రామ ప్రజలు, తమ ఇళ్ళను ప్రభుత్వం కుట్ర పూరితంగా ధ్వంసం చేసిందని ఆరోపించారు. బస్సులు తిరిగే పరిస్థితి లేని గ్రామంలో వున్నపలంగా 120 అడుగుల మేర రోడ్లను వెడల్పు చేయాల్సిన అవసరమేముంది.?...

‘మూడు రాజధానులంటే..’ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు

‘అసెంబ్లీ సమయంలో అధికారులు అక్కడే ఉండాలి. ఎగ్జిక్యూటివ్ అంటే క్యాబినెట్, సెక్రటేరియట్ కు సంబంధించింది. వారంతా అసెంబ్లీకి హాజరవ్వాలి.. న్యాయపరమైన వ్యవహారాలకు సంబంధించిన వివరాలు అందించాలి. ముఖ్యమంత్రి, మంత్రుల దగ్గర చర్చించి.. వాళ్ల...

ఎక్కువ చదివినవి

బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 టైటిల్ ఆది రెడ్డికేనా.? ఇదే సంకేతమా.?

కూతురి సెంటిమెంట్ గతంలో కౌశల్‌కి వర్కవుట్ అయినట్లు, ఇప్పుడు ఆది రెడ్డికి కలిసి రానుందా.? బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో సీజన్ సిక్స్ విషయంలో ఇప్పుడు సర్వత్రా ఇదే చర్చ జరుగుతోంది....

‘ప్రేమ దేశం’ లో.. నా పాత్ర ఎంతో సరదాగా ఉంటుంది- మధుబాల

త్రిగున్, మేఘా ఆకాష్ హీరో హీరోయిన్లుగా శ్రీకాంత్ సిద్ధం దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'ప్రేమ దేశం'. 'శ్రీ క్రియేటివ్ వర్క్స్' బ్యానర్ పై శిరీష సిద్ధం ఈ చిత్రాన్ని  నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార...

ఔను, విద్య, వైద్యమంటే వేల కోట్ల వ్యాపారం.!

విద్య, వైద్యం.. వీటిని లాభాపేక్షతో సంబంధం లేకుండా చూడాలి. కానీ, విద్య అలాగే వైద్యం.. ఈ రెండిటికి సంబంధించి వచ్చేంత లాభం.. ఇంకే రంగంలోనూ కనిపించదు. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా తక్కువే...

కేంద్ర ప్రభుత్వ పెద్దలకు ‘అయ్యా.! యెస్.!’ అనాల్సిందేనా.?

కేంద్రంలో అధికారంలో వున్న పార్టీలకు ‘యెస్’ అనేలా కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహరిస్తుందా.? సర్వోన్నత న్యాయస్థానం అబ్జర్వేషన్ ఇదే.! చిన్న విషయంగా దీన్ని చూడలేం. సర్వోన్నత న్యాయస్థానం ఎంతో ఆవేదనతో చేసిన వ్యాఖ్యలివి. కేంద్ర...

ఆ ఉద్యోగులపై రైల్వే శాఖ కొరడా..! 16 నెలల్లో ఎంతమందిని తొలగించారంటే..

రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఆదేశాల ప్రకారం పనితీరు సరిగాలేని రైల్వే ఉద్యోగులపై ఆ శాఖ కొరడా ఝులిపిస్తోంది. 2021 జూలై నుంచి ఇప్పటివరకూ ప్రతి మూడు రోజులకు ఓ ఉద్యోగిపై...