ఈరోజు జరిగిన ఎపిసోడ్ 67 లో కెప్టెన్సీ పోటీ కోసం.. నాగమణి టాస్క్ పేరుతో మార్బుల్ (గోలీలు) సంపాయించటం అనే గేమ్ పెట్టటం జరిగింది.. నిన్న జరిగిన పాములు, నిచ్చెన టీమ్ లకు ఈ టాస్క్ ను ఇచ్చారు..
కానీ.. ఈసారి జరిగిన బిగ్ బాస్ షో లో ఇచ్చిన ఫీజికల్ టాస్క్ ల మోతాదు కొంచం ఎక్కువనే చెప్పాలి.. ముందు సీజన్ల కన్నా ఇంటి సభ్యులు ఎక్కువగా ఫీజికల్ గా కష్టపడాల్సి వస్తోంది..ఆడ మగ తేడా లేకుండా ఒకరినొకరు లాగి పడేయడం.. ఈ సీజన్ లో ఎక్కువగా చూస్తున్నాము.. దీనికి సంబంధించి వాగ్వివాదాలు కూడా అంతే స్థాయిలో ఉంటున్నాయి.. అసలు ఈ సీజన్ లో ఇచ్చిన ఫిజికల్ టాస్క్ లు.. చాలామటుకు సాధారణ వీక్షకులకు అర్థం కాకనే.. అలా అలా చూసేసారని చెప్పవచ్చు.. కొద్దిమంది ప్రేక్షకులను తెలుగు బులెటిన్ అడిగి మరీ ఈ విషయం నిర్దారించటం జరిగింది.. కేవలం ఇంటి సభ్యులు, నిర్వాహకులకు మాత్రమే ఏ మేరకు అర్థం అయ్యాయో అని.. సామాన్య ప్రేక్షుకులు సరిపెట్టుకుంటున్నారు..
ఇదే కాక రేవంత్ ప్రతి టాస్క్ లోను ఎక్కువగా ఒకే రకంగా ఎగ్రస్ అవ్వటం.. వీక్షకులకు.. కొంత చికాకు కలిగిస్తుందని చెప్పవచ్చు..
మొత్తానికి.. ఈ సీజన్ లో ఫిజికల్ టాస్క్ ల గోల, నామినేషన్ లప్పుడు.. సభ్యుల ఆరోపణల తో కూడిన అరుపుల గోల మునుపటి సీజన్ ల కన్నా కాస్త ఎక్కువగా ఉందని చెప్పవచ్చు.. మరి ఇవి వీక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటున్నాయో… నిర్వాహకులకే తెలియాలి.. నిశితంగా గమనిస్తే.. ఈసారి వినోదం అందించటాన్ని పూర్తిగా మరిచిపోయినట్టుగా ఉంది… సూర్య ఉన్నంతకాలం మాత్రమే అతను వివిధ హీరోల అనుకరణతో కొంత వినోదాన్ని పండించాడు.
బిగ్ బాస్ షో అంటే వినోదం కూడా ఒక భాగమే కదా…