బిగ్ బాస్ లో శనివారం ఫన్ డే ఎపిసోడ్ జరిగింది. ముందుగా శుక్రవారం జరిగిన ఎపిసోడ్ ను చూపించారు. అందులో విశ్వ, ప్రియాల మధ్య వాదన జరిగింది. రేషన్ మేనేజర్ బాధ్యతను సరిగా నిర్వర్తించట్లేదని ప్రియా, విశ్వను అనగా దాన్ని డిఫెండ్ చేసుకున్నాడు విశ్వ. జైల్లో ఉన్న కాజల్ విడుదలైంది. దానికంటే ముందు కార్ టాస్క్ ఒకటి జరిగింది. మూడు పొడుపు కథలను చెప్పి వాటిని గెస్ చేయమని బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ను రెండు టీమ్స్ గా డివైడ్ చేసారు. ఇందులో ప్రియా టీమ్ గెలుపొందింది. దాని తర్వాత టీమ్ మొత్తం కార్ ఎక్కి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.
ఇక నాగార్జున వచ్చాక అసలు సందడి మొదలైంది. ఎక్కువ ఆలస్యం చేయకుండా స్ట్రైట్ గా పాయింట్ లోకి దిగిపోయాడు. షణ్ముఖ్, శ్రీరామ్ చంద్రకు ఉన్న ఇబ్బందిని తొలగించాడు. వయసుకు మెచ్యూరిటీకి సంబంధం లేదని నాగార్జున చెప్పాడు. అలాగే సిరిని అందరి వెనకాల మాట్లాడకు, నువ్వు అదే చెబుతూ ఉంటావు అని క్లాస్ పీకాడు. శ్రీరామ్ చంద్ర, జెస్సీ మధ్య జరిగిన ఇష్యూను కూడా హైలైట్ చేసాడు. ఇందులో కొంత జెస్సీ వైపే మాట్లాడాడు నాగార్జున. ఎవరికి వాళ్ళు వంట వండుకోమని చెప్పడం చాలా తప్పని అన్నాడు. నీ ఇంటెన్షన్ కరెక్ట్ కానీ చెప్పే విధానం చాలా తప్పని తెలియజేసాడు. అలాగే శ్రీరామ్ చంద్ర కెప్టెన్ గా చాలా బాగా చేసినట్లు తెలిపాడు. ఇక కాజల్, రవి, లోబోల మధ్య జరిగిన విషయాన్ని కూడా పాయింట్ అవుట్ చేసాడు. లోబో నిజంగానే మిడిల్ ఫింగర్ చూపించాడా లేదా అని ప్రశ్నించాడు.
ఈరోజు ఎపిసోడ్ లో కొండ పొలం టీమ్ గెస్ట్ లుగా వచ్చారు. క్రిష్, వైష్ణవ్ తేజ్ రాగా వాళ్ళు కూడా కంటెస్టెంట్ లను కొన్ని ప్రశ్నలు అడిగారు. ఆ తర్వాత నాగార్జున ఈ వారం జరిగిన టాస్క్ కు అనుగుణంగా రాజు, స్లేవ్ టాస్క్ ను ఇచ్చాడు. దాని ప్రకారంగా ఇంట్లో రాజు ఎవరు, స్లేవ్ ఎవరు అన్నది చెప్పాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా ఒక్కో కంటెస్టెంట్ ఎవరిని రాజు ఎవరిని బానిసగా ఎంచుకున్నారు అన్నది చూద్దాం.
ప్రియా – శ్రీరామ్ చంద్ర, హమీద
శ్రీరామ్ చంద్ర – కాజల్, షణ్ముఖ్
కాజల్ – రవి, లోబో
రవి – మానస్, ప్రియాంక
మానస్ – సన్నీ, హమీద
సన్నీ – మానస్, విశ్వ
లోబో – సన్నీ, విశ్వ
షణ్ముఖ్ – రవి, హమీద
హమీద – మానస్, సన్నీ
శ్వేతా – కాజల్, మానస్
జెస్సి – రవి, లోబో
అన్నీ – సన్నీ, లోబో
సిరి – రవి, శ్రీరామ్ చంద్ర
విశ్వ – రవి, ప్రియా
చివరిగా కొంత సస్పెన్స్ ను పెట్టి ఈరోజు ఎవరినీ సేవ్ చేయలేదు నాగార్జున.