మూడు రాజధానులు వద్దు.. ఒకే రాజధాని ముద్దు.. అంటున్నారు ఏపీ బీజేపీ నేతలు. హైకోర్టు విషయంలో మాత్రం, బీజేపీ ఓ విధానానికి కట్టుబడి వుంది.. ఆ హైకోర్టు కర్నూలులో పెట్టాలని బీజేపీ ఎప్పటినుంచో చెబుతోంది. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ ప్రభుత్వం పరిపాలన రాజధాని, శాసన రాజధాని, న్యాయ రాజధాని.. అంటూ విశాఖపట్నం, అమరావతి, కర్నూలు పేర్లను తెరపైకి తీసుకురావడమే కాదు, అసెంబ్లీలో బిల్లు కూడా పాస్ చేసిన విషయం విదితమే.
మరి, ఈ పరిస్థితుల్లో బీజేపీ గనుక ఒకే రాజధాని డిమాండ్‌కి కట్టుబడి వుంటే.. కేంద్ర ప్రభుత్వ స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయాల్సి వుంటుంది. అది తప్ప, ఇంకో దారి లేదు.. మూడు రాజధానుల్ని అడ్డుకోవడానికి.
అయితే, కేంద్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయంలో జోక్యం చేసుకోదని బీజేపీ ఎంపీ (రాజ్యసభ) జీవీఎల్ నరసింహారావు తెగేసి చెబుతున్నారు. దాంతో జీవీఎల్ తీరు అస్సలేమాత్రం మింగుడు పడ్డంలేదు ఏపీ బీజేపీ నేతలకి. ‘కేంద్రం జోక్యం చేసుకోదు.. మనమేమో, మనకున్న బలంతో అధికార వైఎస్సార్సీపీపై పోరాడలేం.. అలాంటప్పుడు, మూడు రాజధానులు వద్దు – ఒక రాజధాని ముద్దు అనడమెందుకు.?’ అని ఏపీ బీజేపీలో అంతర్గతంగా తీవ్రమైన చర్చ జరుగుతోంది.
కాగా, బీజేపీకి తాజా మిత్రపక్షమైన జనసేన, ఢిల్లీకి వెళ్ళి కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి, అమరావతికి న్యాయం చేస్తామని చెబుతున్నా.. దాన్ని సైతం తప్పుపడుతున్నారు జీవీఎల్. ‘పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్ళి, బీజేపీ పెద్దలతో మాట్లాడొచ్చు.. కేంద్రంతోనూ మాట్లాడొచ్చు.. కానీ, మూడు రాజధానుల్ని అడ్డుకునే బాధ్యత కేంద్రానిది కాదు’ అని జీవీఎల్ తేల్చి చెప్పేస్తున్నారు.
దాంతో, జీవీఎల్‌పై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేయాలని బీజేపీలో ఓ వర్గం డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ‘జీవీఎల్ మీద చర్యలు తీసుకుంటారా.? రాజకీయంగా మమ్మల్ని ఈ విషయంపై పూర్తిగా మౌనం దాల్చమంటారా.?’ అంటూ అధిష్టానానికి ఇప్పటికే కొందరు బీజేపీ నేతలు సమాచారం ఇచ్చినట్లు సమాచారం.
98380 447490I discovered your weblog web site on google and check just a couple of of your early posts. Proceed to maintain up the exceptional operate. I just extra up your RSS feed to my MSN Data Reader. Seeking forward to reading much more from you in a whilst! 146808
965413 774568Hey! I merely wish to give an enormous thumbs up for the good information youve got here on this post. I will likely be coming back to your weblog for more soon. 681261
50617 426062Most reliable human being messages, nicely toasts. are already provided gradually during the entire wedding celebration and therefore are anticipated to be quite laid back, humorous and as well as new all at once. best man speech 722646