Switch to English

బిగ్‌ స్టోరీ: వైఎస్‌ జగన్‌కి ‘వెన్నుపోటు’ పొడుస్తున్నదెవరు.?

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అవుతూనే, పెద్దయెత్తున సలహాదారుల నియామకాన్ని చేపట్టారు. అనేక విభాగాల్లో ఈ సలహాదారులు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డికి తగిన సలహాలు ఇవ్వాల్సి వుంది. ఆయా రంగాలకు చెందిన కొందర్ని వైఎస్‌ జగన్‌ ఎంపిక చేసుకుని మరీ తనకు సలహాదారులుగా నియమించుకున్న విషయం విదితమే. ఈ నియామకాలు ఇంకా కొనసాగుతూనే వున్నాయి.

అన్నట్టు, సలహాదారులకు ఇచ్చే గౌరవ వేతనాలు కూడా భారీగానే వుంటున్నాయి. చంద్రబాబు హయాంలోనూ ఈ సలహాదారుల వ్యవస్థ వుందండోయ్‌. అప్పుడు ఆయన్ని విమర్శించిన జగన్‌, ఇప్పుడు అదే బాటలో నడుస్తున్నారనుకోండి.. అది వేరే విషయం.

మరోపక్క, మీడియాలోనూ కొందర్ని తనకు అనుకూలంగా వైఎస్‌ జగన్‌ మార్చుకున్నారన్నది ఓపెన్‌ సీక్రెట్‌. ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియానే కాదు, వెబ్‌ మీడియాలోనూ కొంత భాగం ఆయనకు అనుకూలంగా పనిచేస్తోంది. మరి, ఇంత సరంజామా వున్నప్పుడు, ప్రభుత్వానికి తలనొప్పులు వస్తే ఎలా.?

ముఖ్యమంత్రి అయ్యాక గడచిన పదకొండు నెలల సమయంలో దాదాపు 50 సార్లకు పైగా న్యాయస్థానాల్లో మొట్టికాయలు పడ్డాయి వైఎస్‌ జగన్‌ సర్కార్‌కి. ఇది చిన్న విషయమేమీ కాదు. ఇంతకు ముందెన్నడూ ఏ ప్రభుత్వానికీ ఈ స్థాయిలో మొట్టికాయలు పడలేదు. అంటే, అక్కడ సలహదారుల వ్యవస్థ సరిగ్గా పనిచేయడంలేదన్నమాట. సహచర మంత్రులు కూడా, ఆయా విషయాల్లో ముఖ్యమంత్రికి ‘సరైన డైరెక్షన్స్‌’ ఇవ్వలేకపోతున్నారన్నమాట.

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా పనిచేసిన నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ విషయంలో ఏం జరిగిందో చూశాం. ‘ప్రభుత్వం పరువు పోతుందా.?’ అన్న ముందస్తు చూపు ఒక్కరంటే ఒక్కరికి కూడా లేకుండా పోయింది. పైగా, ‘బొచ్చు పీకుతాడా.?’ అంటూ ఓ మంత్రిగారు బూతు పురాణం అందుకోవడం. జగన్‌ని మెప్పించేందుకు మంత్రులు కావొచ్చు, ఇతర ముఖ్య నేతలు కావొచ్చు ఈ తరహా ‘ఓవరాక్షన్‌’ చేయడం సహజమే.

కానీ, ఇక్కడే ముఖ్యమంత్రి.. ఆయన సలహాదారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ఇంగ్లీషు మీడియం విషయంలో కూడా వాస్తవ పరిస్థితిని ముఖ్యమంత్రికి ఎవరూ ముందస్తుగా అర్థమయ్యేటట్లుగా చెప్పినట్లు లేదు. దాంతో, మొట్టికాయ తప్పలేదు. వైసీపీ జెండా రంగుల విషయంలో కావొచ్చు, ఇతరత్రా విషయాల్లో కావొచ్చు.. అన్నిటిలోనూ ఇదే పరిస్థితి.

భజన మీడియాని, తన చుట్టూ వున్న భజన బ్యాచ్‌ని నమ్ముకుంటే.. రానున్న నాలుగేళ్ళలో ఇంతకంటే పెద్ద ఎదురు దెబ్బల్ని వైఎస్‌ జగన్‌ ఎదుర్కోవాల్సి వస్తుంది. కష్టమైనా, నిజాల్ని తెలుసుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి మీద వుంటుంది. లేకపోతే, ప్రతిసారీ మొట్టికాయలేయుంచుకుంటున్న వ్యక్తి నాయకుడెలా అవుతాడు.? పరిపాలనకు ఎలా అర్హుడవుతాడు.? అన్న చర్చ ప్రజల్లో షురూ అవుతుంది. అది రాజకీయంగా వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డికి అస్సలేమాత్రం మంచిదికాదు.

భజన ముసుగులో కొందరు ‘వెన్నుపోటు’కి పాల్పడుతున్నారన్న విషయాన్ని వైఎస్‌ జగన్‌ ఎప్పుడు గుర్తిస్తారో ఏమో.! గ్రౌండ్‌ లెవల్‌లో ఏం జరుగుతుందో గుర్తించక, భజనపరుల్ని ప్రోత్సహించిన చంద్రబాబుకి ఏ గతి పట్టిందో వైఎస్‌ జగన్‌ ఇప్పటికైనా గుర్తెరగాలి.

సినిమా

నా భర్తతో ఉండలేక పోతున్నా అంటూ ట్వీట్‌.. సోనూ సూద్‌ సమాధానం...

గత నెల రోజులుగా సోషల్‌ మీడియాలో సోనూ సూద్‌ పేరు ఒక రేంజ్‌ లో మారు మ్రోగి పోతుంది. వలస కార్మికుల పాలిట దేవుడు అంటూ...

తమిళ, మలయాళ స్టార్స్‌తో తెలుగు మల్టీస్టారర్‌

ఈమద్య కాలంలో మల్టీస్టారర్‌ చిత్రాలు వరుసగా వస్తున్నాయి. మల్టీస్టారర్‌ చిత్రాలకు ఉన్న క్రేజ్‌ను క్యాష్‌ చేసుకునేందుకు మేకర్స్‌ ఎక్కువగా మల్టీస్టారర్‌ చిత్రాలను చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు....

ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ.. మల్టీస్టారర్ పై బాలయ్య స్పందన..

నందమూరి నట సింహం బాలకృష్ణ సినిమా గురించి మాట్లాడినా.. రాజకీయం గురించి మాట్లాడినా స్పష్టత ఉంటుంది. నిజాన్ని నిర్భయంగా చెప్పే ఆయన ఓ యూట్యూబ్ చానెల్...

క్షమాపణ చెప్పాలన్న నాగబాబు కామెంట్స్ పై బాలకృష్ణ రియాక్షన్.!

గత కొద్దిరోజులుగా తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని వివాదాలు జరుగుతున్నాయి. ఈ వివాదం నందమూరి బాలకృష్ణ 'సినీ వర్గ మీటింగ్స్ కి నన్ను పిలవలేదు' అంటూ...

అనసూయకు పొలిటికల్‌ ఆఫర్స్‌ కూడా వస్తున్నాయా?

జబర్దస్త్‌ హాట్‌ యాంకర్‌ అనసూయ ప్రస్తుతం బుల్లి తెర మరియు వెండి తెరపై చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. సోషల్‌ మీడియాలో కూడా ఈమెకు...

రాజకీయం

అన్నదాతలకు శుభవార్త చెప్పిన కేంద్ర కేబినెట్

అన్నదాతలకు శుభవార్త: వివిధ పంటలకు మద్ధతు ధరలు పెంచిన కేంద్ర కేబినెట్( ఖరీఫ్ సీజన్ కోసం). ప్రతి క్వింటాల్ కు..... 1 . వరి - నూతన ధర రూ. 1,868/-( పెంచిన ధర రూ.53) 2....

నిమ్మగడ్డ ఇష్యూలో సుప్రీంను ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం

ఏపీ ఎన్నికల కమీషనర్‌గా విధులు నిర్వహిస్తున్న నిమ్మగడ్డ రమేష్‌ను ప్రభుత్వం అర్థాంతరంగా తొలగిస్తూ ఉతర్వులు తీసుకు వచ్చింది. ఆ ఉతర్వులను నిమ్మగడ్డ రమేష్‌ హైకోర్టులో సవాల్‌ చేశారు. ఏపీ హైకోర్టులో నిమ్మగడ్డ రమేష్‌కు...

జన్మంతా జగన్‌తోనేనంటున్న విజయసాయిరెడ్డి.. నమ్మొచ్చంటారా.?

‘వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డితో నాకున్న అనుబంధం చాలా విలువైనది. ఇప్పుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డితోనూ అదే అనుబంధం కొనసాగుతోంది. ఇకపైనా, అదే కొనసాగుతుంది. జన్మంతా జగన్‌ వెంటే నా ప్రయాణం. ఇందులో ఇంకో మాటకు...

కరోనా వారియర్లే రక్షకులు.. వారిపై దాడులు సహించం: ప్రధాని మోదీ

దేశంలో కరోనా విపత్కర పరిస్థితుల్లో అత్యుత్తమ సేవలు అందిస్తున్న వైద్యులు, హెల్త్ వర్కర్లపై దాడులు చేస్తే సహించేది లేదని ప్రధాని మోదీ తెలిపారు. కర్ణాటకలోని రాజీవ్ గాంధీ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్.....

బెజవాడలో గ్యాంగ్‌ వార్‌: హత్యా ‘రాజకీయం’లో కొత్త కోణం.!

రాష్ట్ర రాజధాని అమరావతి పరిధిలోని బెజవాడ ఒక్కసారిగా ‘గ్యాంగ్‌ వార్‌’తో ఉలిక్కిపడింది. రెండు గ్యాంగ్‌ల మధ్య గొడవలో ఓ గ్యాంగ్‌ లీడర్‌ హతమయ్యాడు. ఓ అపార్ట్‌మెంట్‌కి సంబంధించిన గొడవలో ఇద్దరు వ్యక్తులు ‘సెటిల్‌మెంట్‌’కి...

ఎక్కువ చదివినవి

కారు యాక్సిడెంట్‌లో 22 ఏళ్ళ నటి మృతి

ఈమద్య కాలంలో సినిమా ఇండస్ట్రీ మరియు బుల్లి తెర ఇండస్ట్రీకి చెందిన నటీ నటులు మృతి చెందడం ఆత్మహత్య చేసుకోవడం గురించి వార్తల్లో పదే పదే చూస్తూ ఉన్నాం. ఆర్థిక ఇబ్బందులతో నటి...

చంద్రబాబు: స్వపక్షాన్నీ కొనక తప్పదా?

ఏడాది క్రితం జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలైన తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం విచిత్రమైన పరిస్థితుల్లో ఉంది. భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ సీపీని తట్టుకుని మరో నాలుగేళ్లు ఎలా పోరాడాలా అని...

ఇన్ సైడ్ స్టోరీ: కన్నా లక్ష్మీనారాయణ కోడలు సుహారిక మరణం వెనుక గల కారణాలు.?

గత రాత్రి(మే 28న) ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ చిన్నకుమారుడు ఫణింద్ర భార్య సుహారిక అనుమానాస్పదంగా మరణించిందని తెలిపాము. ఈ సుహారిక మరణం గురించి పలు అనుమానులు వెల్లువెత్తుతున్నాయి. మేము ఇన్...

మనం ‘సినిమాలు’ ఎందుకు చూస్తాం.!

నేటి తరంలో వినోదం అనేది ఒక్క క్లిక్ దూరంలో ఉన్నప్పటికీ, సినిమా టికెట్ల ధరలు మన అవసరాల కంటే ఎక్కువ అయినప్పటికీ సిసలైన వినోదం కోసం థియేటర్లకు వెళ్ళి మరీ సినిమాలు చూస్తాం. అసలు...

మిడతలను తరమికొట్టేందుకు రైతు వినూత్న ప్రయత్నం

‘నూతన సంవత్సర శుభాకాంక్షలు.. ఈ ఏడాది అందరికీ శుభాలు జరగాలి’ అంటూ చెప్పుకుని రోజులు గడవక ముందే ప్రజలకు కష్టాలు మొదలైపోయాయి. కరోనా రూపంలో వచ్చిన ఉపద్రవం ప్రపంచ మానవాళిపై విరుచుకు పడుతోంది....