Switch to English

బిగ్‌ స్టోరీ: చంద్రబాబు అపర చాణక్యుడే కానీ.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,517FansLike
57,764FollowersFollow

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు పుట్టిన రోజు నేడు. కాంగ్రెస్‌ పార్టీతో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ అధినేతగా ఎదిగారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా 9 ఏళ్ళు పనిచేశారు. 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌కి ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఆయన సొంతం. జాతీయ స్థాయిలో చక్రం తిప్పిన ఘనుడాయన. ఒకప్పుడు ‘అపర చాణక్యుడి’గా గుర్తింపు పొందిన చంద్రబాబు, ‘వెన్నుపోటు’ రాజకీయాలకు కేరాఫ్‌ అడ్రస్‌గానూ నిలిచారు.

రైతులంటే గిట్టదనీ, దళితులంటే అస్సలు పొసగదనీ, అసలంటూ జీవితంలో ఏనాడూ నిజం చెప్పడం ఆయనకు ఇష్టముండదనీ.. చంద్రబాబు మీదకి దూసుకొచ్చే రాజకీయ విమర్శలు అన్నీ ఇన్నీ కావు. కానీ, చంద్రబాబులా సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగి, మూడు దఫాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేపట్టిన రాజకీయ నాయకుడు తెలుగు నాట ఇంకొకరు లేరంటారు చంద్రబాబు మద్దతుదారులు. పిల్లనిచ్చిన మామ స్వర్గీయ ఎన్టీఆర్‌ని రాజకీయంగా వెన్నుపోటు పొడిచి, తెలుగుదేశం పార్టీ పగాల్ని చంద్రబాబు చేపట్టారన్నది నిర్వివాదాంశం. దీనికి ఆయన ‘నాయకత్వ మార్పు’ అనే పేరు పెట్టినా, చరిత్రను వక్రీకరిస్తానంటే కుదరదు కదా.! అదే చంద్రబాబు రాజకీయంగా ఎదగడానికి కారణమయ్యింది.. అదే చంద్రబాబు రాజకీయ జీవితంలో ఎప్పటికీ చెరిపేసుకోలేని మచ్చ.

అపర చాణక్యుడిగా దేశ రాజకీయాల్లోనూ చక్రం తిప్పిన చంద్రబాబు, ఆనాటి వాడి.. వేడి.. మాత్రం ఇప్పుడు చూపించలేకపోతున్నారు. చంద్రబాబు ఎవర్నీ నమ్మరు.. తన నీడను తానే నమ్మరు.! అయితే, చంద్రబాబు కొందర్ని నమ్ముతారు.. ఎలాంటోళ్ళనంటే, తనను రాజకీయంగా వెన్నుపోటు పొడిచేవారిని. అదే, చంద్రబాబుని ఇప్పుడు ఈ స్థితిలోకి తీసుకొచ్చింది. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో నాశనమయ్యింది.. ఆంధ్రప్రదేశ్‌లోనూ అదే పరిస్థితి. దీనంతటికీ చంద్రబాబు స్వయంకృతాపరాధమే కారణం. పుత్ర రత్నం నారా లోకేష్‌ కారణంగా పార్టీ భ్రష్టుపట్టిపోయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నా, ఆ తప్పిదాన్ని సరిదిద్దుకోలేని దుస్థితి చంద్రబాబుది. గతమెంతో ఘనం.. ప్రస్తుతం గందరగోళం.. భవిష్యత్‌ భయానకం.. ఇదీ ఇప్పుడు చంద్రబాబు పరిస్థితి.

ఏడు పదుల వయసులోకి అడుగు పెట్టిన చంద్రబాబు నుంచి మళ్ళీ మునుపటి రాజకీయ చాణక్యాన్ని చూడగలమా.? అవకాశమే లేదన్నది మెజార్టీ అభిప్రాయం. చంద్రబాబు మాత్రం, వయసు శరీరానికే.. మనసుకు కాదంటారు. కానీ, అది మాటల్లో చూపలేకపోతున్నారు.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Taapsee: తాప్సీ సీక్రెట్ గా పెళ్లి చేసుకుందా..!? న్యూస్ వైరల్

Taapsee: హీరోయిన్ తాప్సీ (Taapsee) పెళ్లి చేసుకుందా..? అంటే తాప్సీ ఫ్రెండ్, నిర్మాత కనిక చేసిన ఇన్ స్టా పోస్ట్ ఔననే సమాధానమే ఇస్తోంది. కొన్ని...

Ram Charan: రామ్ చరణ్-సుకుమార్ కాంబో.. RC17 ప్రకటన వచ్చేసింది..

Ram Charan: యావత్ తెలుగు చిత్ర పరిశ్రమ మాత్రమే కాకుండా మెగాభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న  భారీ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. గ్లోబల్ స్టార్ రామ...

Ram Charan Birthday Special: కథల ఎంపికలో రామ్ చరణ్ స్పెషాలిటీ...

Ram Charan: మెగా ఫ్యామిలీ హీరోలకు మాస్ ఇమేజ్ ఓ వరం. దశాబ్దాలుగా మెగాస్టార్ చిరంజీవి సాధించిన క్రేజ్ అది. తనదైన శైలి నటన, డైలాగులు,...

Kamal Haasan: ‘కల్కి’లో తన పాత్ర రివీల్ చేసిన కమల్ హాసన్

Kamal Haasan: అగ్ర కథానాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. మరోవైపు లోక్ సభ ఎన్నికల సమయం కావడంతో...

Ram Charan: ‘సుజిత్ పెళ్లికి ఎందుకు పిలవలేదు..’ ఆనంద్ మహీంద్రాకు రామ్...

Ram Charan: సుజిత్ పెళ్లికి నన్నెందుకు ఆహ్వానించలేదని రామ్ చరణ్ (Ram Charan) ప్రశ్నించడంతో పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) సమాధానమిచ్చారు. ఇంతకీ...

రాజకీయం

వైసీపీని గెలిపించడమే బీజేపీ లక్ష్యమా.?

టీడీపీ - జనసేన కూటమితో కలిసింది బీజేపీ.. అధికారికంగా.! కానీ, వైసీపీతో కలిసి పనిచేస్తున్నట్లుగా వుంది బీజేపీ వ్యవహారం.! ఇదీ, నిన్నటి బీజేపీ ఎంపీ అభ్యర్థుల లిస్ట్ తర్వాత రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్న...

పవన్ కళ్యాణ్ మీద విషం కక్కుతున్న ముద్రగడ.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం విషం చిమ్ముతున్నారు. తన కుటుంబ సభ్యులపై చంద్రబాబు పోలీసుల ద్వారా దాడి చేయించారనీ, బూతులు తిట్టించారనీ ముద్రగడ పద్మనాభం ఆరోపిస్తున్నప్పుడు,...

Janasena: జనసేనలో నిరసనలు.. తిరుగుబాట్లు..

Janasena: జనసేన (Janasena)లో అంతర్గపోరు తప్పేలాలేదా అంటే ప్రస్తుత పరిణామాలు ఇవే సూచిస్తున్నాయి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటు ఆశిస్తున్న జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్, స్థానిక కార్యకర్తలు, ఆయన మద్దతుదారులు...

రఘురామ కృష్ణరాజుకి ఎందుకిలా జరిగింది చెప్మా.?

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకి షాక్ తగిలింది. కొద్ది రోజుల క్రితమే ఆయన తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఎన్నికల ముందర చేసిన రాజీనామా కావడంతో, అది ఆమోదం పొందలేదు. చాలాకాలంగా...

ఎన్నికల బరిలో కంగనా రనౌత్.. పోటీ అక్కడ నుంచే

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్( Kangana Ranaut) భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేయనున్నారు. ఆ పార్టీ ఈరోజు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇందులో...

ఎక్కువ చదివినవి

డ్రగ్స్ దొంగలెవరు.? రాష్ట్రం ఏమైపోతోంది.?

అబ్బే, రాష్ట్రం ఏమైపోతోందన్న బెంగ ఎవరికీ లేదు. ఎందుకంటే, రాష్ట్రం ప్రధాన రాజకీయ పార్టీలకి ప్రధాన ఆదాయ వనరుగా మారింది తప్ప, రాష్ట్ర శ్రేయస్సు గురించి ఎవరికీ ఎలాంటి చింతా లేదన్నది నిర్వివాదాంశం. విపక్షాల...

Ram Charan: ‘సుజిత్ పెళ్లికి ఎందుకు పిలవలేదు..’ ఆనంద్ మహీంద్రాకు రామ్ చరణ్ ప్రశ్న

Ram Charan: సుజిత్ పెళ్లికి నన్నెందుకు ఆహ్వానించలేదని రామ్ చరణ్ (Ram Charan) ప్రశ్నించడంతో పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) సమాధానమిచ్చారు. ఇంతకీ ఆ సుజిత్ ఎవరు.. ఫన్నీ సంభాషణ...

Ram Charan : చరణ్‌ బర్త్‌డేకి ముచ్చటగా మూడు…!

Ram Charan : మెగా పవర్‌ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు వేడుకలకు ఫ్యాన్స్ సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. మార్చి 27న ఆయన ఫ్యాన్స్ తో...

కర్మ ఈజ్ బ్యాక్: గులాబీ పార్టీ గల్లంతే.!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాస్త గట్టిగా తలచుకుంటే, తెలంగాణ నుంచి భారత్ రాష్ట్ర సమితి పూర్తిగా ఔట్ అయిపోతుంది. గులాబీ పార్టీలో కేసీయార్, ఆయన తనయుడు కేటీయార్, కుమార్తె కేటీయార్ మాత్రమే...

అందరినీ మెప్పించే చిత్రం ‘టిల్లు స్క్వేర్’: దర్శకుడు మల్లిక్ రామ్

తెలుగునాట యువతలో కల్ట్ ఫాలోయింగ్ సంపాదించుకున్న సినిమాలలో 'డీజే టిల్లు' ఒకటి. టిల్లుగా స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ పంచిన వినోదాన్ని ప్రేక్షకులు అంత తేలికగా మరిచిపోలేరు. టిల్లు మాటలు, చేష్టలు ప్రేక్షకుల...