‘సాహో’ తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాధాకృష్ణ డైరెక్షన్ లో పూర్తి ప్రేమకథా చిత్రం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ పీరియడ్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీకి ‘ఓ డియర్’ లేదా ‘రాధే శ్యామ్’ టైటిల్స్ ని పరిశీలిస్తున్నారు. ఈ లాక్ డౌన్ పరిస్థితికి ముందే డేంజరస్ అయిన జార్జియాలో షూటింగ్ చేశారు.
కానీ కరోనా ఎఫెక్ట్ వలన అనుకున్న దానికంటే ముందే షూట్ ఫినిష్ చేసుకొని రావాల్సి వచ్చింది. ప్రస్తుతానికైతే షూటింగ్ లేదు కానీ జార్జియా బ్యాక్ డ్రాప్ లో ఓ హాస్పిటల్లో తీయాల్సిన సీన్స్ కోసం అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈ హాస్పిటల్ సెట్ ని వేస్తున్నారు. మొదట్లో ట్రైన్, మార్కెట్ లాంటి కొన్ని సెట్స్ ని అన్నపూర్ణ స్టూడియోస్‌లో వేశారని తెలిపాము. వాటికి ఈ హాస్పిటల్ సెట్ కూడా యాడ్ అయ్యింది.
1970 లండన్ బ్యాక్ డ్రాప్ లో జరిగే కథ కావడం వలన ప్రొడక్షన్ టీం ఇప్పటికే చిన్నా పెద్దా కలిపి 20కి పైగా సెట్స్ ని వేసింది. ఈ రేంజ్ సెట్స్ వేయడం ఇదే తొలిసారి కావడం విశేషం. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని ఈ ఏడాదే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసే ఆలోచనలో ఈ చిత్ర టీం ఉంది.
774572 431065Overall, politicians are split on the problem of whether Twitter is far more for business or individual use. The very first thing is the fact which you can build up quite a large following of men and women. 227854