Switch to English

భీమ్లా నాయక్ రివ్యూ: మాస్ ఎంటర్టైనర్.

Critic Rating
( 3.25 )
User Rating
( 3.60 )

No votes so far! Be the first to rate this post.

Movie భీమ్లా నాయక్
Star Cast పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి, నిత్య మీనన్, సంయుక్త మీనన్
Director సాగర్ కె చంద్ర
Producer సూర్యదేవర నాగవంశీ
Music తమన్.ఎస్
Run Time 2 hr 25 Mins
Release ఫిబ్రవరి 25, 2022

కొంత కాలం గ్యాప్ తర్వాత తెలుగులో వస్తోన్న భారీ సినిమా భీమ్లా నాయక్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ తో ఈ సినిమా మీద అంచనాలు భారీగా పెరిగాయి. రానా దగ్గుబాటి మరో లీడ్ రోల్ లో నటించిన ఈ సినిమా ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దామా.

కథ:

డాన్నీ, ఒక రిటైర్డ్ మిలిటరీ వ్యక్తి. ఒక పరిస్థితిలో పోలీసుల్ని కొట్టి అడ్డంగా దొరికిపోతాడు. ఎస్ఐ భీమ్లా నాయక్ (పవన్ కళ్యాణ్) అనే సిన్సియర్ ఎస్ఐ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరగడంతో డేనియల్ ను లోపల వేస్తాడు. దీంతో డాన్నీ ఈగో హర్ట్ అవుతుంది. భీమ్లా నాయక్ అంతు చూస్తా అంటాడు. అటు భీమ్లా నాయక్ ఆత్మగౌరవం మీద దెబ్బ పడుతుంది.

ఇక ఒకరిపై ఒకరు ఆధిపత్యం చూపించుకోవాలనే కసితో రగిలిపోతుంటారు. వీరిద్దరిలో ఎవరు పైచేయి సాధించారు? సుగుణ (నిత్యా మీనన్) పాత్ర ఏంటి? చివరికి డేనియల్ శేఖర్, భీమ్లా నాయక్ లు ఏం చేసారు? అన్నది చిత్ర కథ.

నటీనటులు:

పవన్ కళ్యాణ్ ను పవర్ స్టార్ అని ఎందుకంటారో ఈ తరం వాళ్లకి ఏమైనా డౌట్స్ ఉంటే ఈ చిత్రంతో మరోసారి తీర్చేస్తాడు పవన్ కళ్యాణ్. అదిరిపోయే పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. ముఖ్యంగా ఫ్యాన్స్ కు అయితే విందు భోజనంలా అనిపిస్తుంది. డైలాగ్ డెలివరీ కానీ, మ్యానరిజమ్స్ కానీ టాప్ లెవెల్ లో ఉన్నాయంతే.

భీమ్లా నాయక్ టైటిల్ దగ్గరనుండి ప్రమోషన్స్ వరకూ మొత్తం భీమ్లా నాయక్ డామినేషన్ కనిపించింది. అయితే సినిమాలో మాత్రం పవన్ కు మ్యాచ్ అయ్యే ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు రానా దగ్గుబాటి. పవన్ కళ్యాణ్ ఇంటెన్సిటీని పూర్తిగా మ్యాచ్ చేయడంలో సక్సెస్ సాధించాడు. ఇది చాలా మందిని ఆశ్చర్యపరిచేదే. ఎందుకంటే పవన్ ముందు రానా పాత్ర తేలిపోతుందేమో అనుకుంటారు కానీ రెండు పాత్రలను సమంగా తీర్చిదిద్దాడు దర్శకుడు.

నిత్యా మీనన్, సంయుక్త మీనన్, మురళి శర్మ, రావు రమేష్ తమ తమ పాత్రలను చక్కగా పోషించారు.

సాంకేతిక వర్గం:

అయ్యప్పనుమ్ కోశియుమ్ కు చిన్నపాటి మార్పులు నరేషన్ పరంగా చేసారు. త్రివిక్రమ్ అందించిన స్క్రీన్ ప్లే ఒరిజినల్ కంటే రేసిగా ఉంది. ఇక మాటల మాంత్రికుడు, డైలాగ్స్ విషయంలో కూడా ఇంప్రెస్ చేస్తాడు. ఒరిజినల్ తో పోలిస్తే మరింత మాస్ గా ఉంది ఈ చిత్రం. థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి. సాంగ్స్ బాగున్నాయి. ఇక బీజీఎమ్ అయితే నెక్స్ట్ లెవెల్లో సాగింది.

ఈ రీమేక్ కు పెర్ఫెక్ట్ ఛాయస్ గా సాగర్ కె చంద్ర గురించి చెప్పుకోవచ్చు. తన టేకింగ్ ను మెచ్చుకోవాలి. ఇక సితార ఎంటర్టైన్మెంట్స్ అందించిన ఈ చిత్రం నిర్మాణ పరంగా టాప్ లెవెల్లో సాగింది.

పాజిటివ్:

  • పవన్ కళ్యాణ్, రానా పెర్ఫార్మన్స్
  • డైలాగ్స్
  • బస్ సీన్, ప్రీక్లైమాక్స్
  • బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
  • సెకండ్ హాఫ్, క్లైమాక్స్
  • సెకండ్ హాఫ్ లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్

నెగటివ్:

  • స్లో ఫస్ట్ హాఫ్
  • సాంగ్స్ చిత్రీకరణ
  • కొరియోగ్రఫీ

చివరిగా:

భీమ్లా నాయక్ ఒరిజినల్ కంటే బెటర్ గా, ఒరిజినల్ కంటే మాస్ గా తెరకెక్కిన చిత్రం. రానా దగ్గుబాటి, పవన్ కళ్యాణ్ తమ తమ పాత్రల్లో చెలరేగిపోయారు. ఆత్మగౌరవానికి, అహంకారానికి మధ్య మడమతిప్పని యుద్ధం అని టీమ్ ఈ చిత్రం గురించి ప్రమోట్ చేసింది. భీమ్లా నాయక్ కేవలం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు మాత్రమే కాక అందరినీ మెప్పిస్తుంది. మాస్ ఎంటర్టైనర్.

తెలుగు బులెటిన్ రేటింగ్: 3.25/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: మాస్ కు కేరాఫ్ అడ్రెస్ గా...

కమర్షియల్ అంశాలు ఎక్కువగా ఉండే మాస్ కథాంశాల్ని చిరంజీవి ఎక్కువగా చేశారు. పాత్రను అన్వయం చేసుకుని తనదైన శైలిలో నటించి హీరోగా చిరంజీవి ఎలివేట్ అయిన...

కార్తికేయ 2 మూవీ రివ్యూ: డీసెంట్ థ్రిల్లర్

నిఖిల్, చందూ మొండేటి కాంబినేషన్ లో వచ్చిన చిత్రం కార్తికేయ 2. కొన్నేళ్ల క్రితం వచ్చిన బ్లాక్ బస్టర్ కార్తికేయకు కొనసాగింపుగా ఈ చిత్రం వచ్చింది....

డబ్బింగ్ కార్యక్రమాలు మొదలుపెట్టిన బేబీ

యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ నటిస్తోన్న తాజా చిత్రం బేబీ. యూట్యూబ్ ద్వారా ఫేమ్ సంపాదించుకున్న వైష్ణవి చైతన్య ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుండగా,...

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: చిరంజీవి నటనకు కీర్తి కిరీటం ‘ఆపద్భాంధవుడు

మెగాస్టార్ ఇమేజ్ తో చిరంజీవి చేసిన సినిమాలన్నీ 90శాతం కమర్షియల్ అంశాలు ఉన్న సినిమాలే. ఖైదీ తర్వాత వచ్చిన విపరీతమైన మాస్ ఇమేజ్ తో ఫ్యాన్స్,...

మాచెర్ల నియోజకవర్గం రివ్యూ

నితిన్, కృతి శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మాచెర్ల నియోజకవర్గం. ఎడిటర్ గా పేరు తెచ్చుకున్న ఎస్ ఆర్ శేఖర్ ఈ చిత్రాన్ని డైరెక్ట్...

రాజకీయం

కొత్త సమస్య.. ఆ నదిపై ప్రాజెక్టు వద్దని ఏపీ సీఎంకు తమిళనాడు సీఎం లేఖ

ఏపీ-తమిళనాడు సరిహద్దులో కుశస్థలి అంతర్రాష్ట్ర నదిపై జలాశయాల నిర్మాణం చేపట్టొద్దని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని తమిళనాడు సీఎం స్టాలిన్ ఓ లేఖలో కోరారు. ‘కుశస్థలి నదిపై ఏపీ ప్రభుత్వం 2చోట్ల...

ఎలక్షన్ ఫీవర్.! అసెంబ్లీ నియోజకవర్గానికి 30 కోట్లు ఖర్చు మాత్రమేనా.?

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా ఎన్నికలంటే అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారిపోయిందన్నది నిర్వివాదాంశం. అసెంబ్లీ నియోజకవర్గానికే 150 కోట్ల పైన ఖర్చు చేసిన ప్రబుద్ధులున్నారు రాజకీయాల్లో.. అంటూ 2019 ఎన్నికల సమయంలో ప్రచారం...

వైఎస్ విజయమ్మకి రోడ్డు ప్రమాదం.! వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ అనుమానం.!

కారు టైర్లు పేలిపోవడం అనేది జరగకూడని విషయమేమీ కాదు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో జరుగుతుంటుంది. కార్ల టైర్లను సరిగ్గా మెయిన్‌టెయిన్ చేయకపోవడం వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతుంటాయని నిపుణులు చెబుతుంటారు. మామూలు వ్యక్తుల...

రేవంత్ రెడ్డి వర్సెస్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి.!

ఎవరో తిడితే, ఇంకెవరో క్షమాపణ చెప్పాలట.! ఇదెక్కడి పంచాయితీ.? ఎలాగైనా కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్ళగొట్టబడాలనే ఆలోచనతో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వున్నట్టున్నారు. లేకపోతే, అద్దంకి దయాకర్ తన మీద చేసిన...

ఛీరెడ్డి బూతులు.! ‘బూతుల శాఖ’ దక్కుతుందా.?

బూతులు తిట్టారు, నానా యాగీ చేశారు.. చివరికి కొడాలి నాని పరిస్థితి ఏమయ్యింది.? మంత్రి పదవి ఊడింది.! ఇది చూసైనా, వైసీపీలో చాలామందికి బుద్ధి రావాలి కదా.? కానీ, అంతకు మించి ఎగిరెగిరి...

ఎక్కువ చదివినవి

జనసేనలోకి మాజీ మంత్రి బాలినేని.! ఈ పుకార్లు పుట్టించిందెవరబ్బా.?

నిప్పు లేకుండా పొగ రాదన్నది తరచూ మనం వినే మాట. కానీ, ఇప్పుడు నిప్పుతో పని లేదు, పొగ దానంతట అదే వచ్చేస్తోంది. రాజకీయాల్లో అయితే మరీనూ.! మాజీ మంత్రి, వైసీపీ సీనియర్...

ఛీరెడ్డి బూతులు.! ‘బూతుల శాఖ’ దక్కుతుందా.?

బూతులు తిట్టారు, నానా యాగీ చేశారు.. చివరికి కొడాలి నాని పరిస్థితి ఏమయ్యింది.? మంత్రి పదవి ఊడింది.! ఇది చూసైనా, వైసీపీలో చాలామందికి బుద్ధి రావాలి కదా.? కానీ, అంతకు మించి ఎగిరెగిరి...

కార్తికేయ 2 మూవీ రివ్యూ: డీసెంట్ థ్రిల్లర్

నిఖిల్, చందూ మొండేటి కాంబినేషన్ లో వచ్చిన చిత్రం కార్తికేయ 2. కొన్నేళ్ల క్రితం వచ్చిన బ్లాక్ బస్టర్ కార్తికేయకు కొనసాగింపుగా ఈ చిత్రం వచ్చింది. మరి కార్తికేయ 2 ఎలా ఉందో...

హోంమంత్రి తానేటి వనితపై జుగుప్సాకరమైన ట్రోలింగ్.! కానీ, ఎందుకు.?

హోంమంత్రి తానేటి వనతి ఎట్టకేలకు మీడియా ముందుకొచ్చారు.. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ వ్యవహారానికి సంబంధించి స్పందించారు. కాస్త లేటుగా అయినా, హోంమంత్రి తానేటి వనిత ఈ విషయమై...

చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో జన సైనికుల రక్తదానం

''రక్తం దొరకని కారణంగా ఎవరికీ ప్రాణాపాయం ఉండకూడదు" అన్న మెగాస్టార్ చిరంజీవి ఆశయానికి అనుగుణంగా ఎందరో అభిమానులు ప్రతీరోజు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కు వచ్చి రక్తదానం చేస్తున్నారు.. త్వరలో మెగాస్టార్ జన్మదినం...