పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమా ను సంక్రాంతికి విడుదల చేయాలని నిర్మాత పట్టుబట్టాడు. కాని రాజమౌళి మరియు నిర్మాతల మండలి వారు పవన్ కళ్యాణ్ తో చర్చించడం వల్ల ఫిబ్రవరికి వాయిదా వేయడం జరిగింది. సంక్రాంతి బరిలో ఆర్ ఆర్ ఆర్ మరియు రాధే శ్యామ్ సినిమాలు ఉన్న కారణంగా భీమ్లా నాయక్ ను వాయిదా వేయాలనే నిర్ణయానికి వచ్చారు. కాని ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ సినిమా వాయిదా పడింది. రాధే శ్యామ్ సినిమా కూడా వాయిదా పడటం కన్ఫర్మ్ అయ్యింది అంటున్నారు.
ఈ సమయంలో భీమ్లా నాయక్ సినిమా ను విడుదల చేసే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సంక్రాంతికి పెద్ద సినిమా ల కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. సంక్రాంతికి పెద్ద సినిమాల పోటీ లేదు కనుక భీమ్లా నాయక్ విడుదల అయితే భారీ గా వసూళ్లు నమోదు అయ్యే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమా విడుదల కానుంది కనుక ఎలాంటి ఇబ్బంది లేకుండా రికార్డు స్థాయి ఓపెనింగ్స్ ను భీమ్లా నాయక్ దక్కించుకుంటుంది అనే నమ్మకంను విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. విడుదల చేయాలా వద్దా అనే విషయమై భీమ్లా నాయక్ మేకర్స్ సందిగ్దంలో ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి పవన్ కళ్యాణ్ నిర్ణయం ఏంటీ.. విడుదల ఉండేనా అనేది చూడాలి.