Switch to English

మొన్న ‘పే సీఎం’, ఇప్పుడేమో ‘భారతి పే’.! వైసీపీలో ‘బులుగు’ కుంపటి.?

91,318FansLike
57,015FollowersFollow

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే పార్టీ అధినాయకత్వం పట్ల వ్యతిరేకత వుందా.? రెడ్డి సామాజిక వర్గంలో కొందరు, వైసీపీకి ఎదురు తిరుగుతున్నారా.? సోషల్ మీడియా వేదికగా ఈ మేరకు పెద్దయెత్తున రచ్చ జరుగుతోంది.

కర్నాటక ముఖ్యమంత్రి బొమ్మైకి వ్యతిరేకంగా ‘పే సీఎం’ అంటూ పోస్టర్లు వెలిసిన విషయం విదితమే. ముఖ్యమంత్రి అవినీతి కార్యకలాపాలకు పాల్పడుతున్నారనీ, 40 శాతం కమీషన్లు దండుకుంటున్నారనీ ఆరోపిస్తూ, ఈ ‘పే సీఎం’ పోస్టర్లను రూపొందించారు.

క్యూ ఆర్ కోడ్ స్థానంలో కర్నాటక ముఖ్యమంత్రి బొమ్మై ఫొటోని పొందుపరిచారు. ఈ పోస్టర్లు కర్నాటక రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టించాయి. కర్నాటకలో బొమ్మై పాలన అవినీతిమయం.. అంటూ జనం పెద్దయెత్తున్న నినదిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.

ఇక, తెలుగునాట.. అందునా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ‘భారతి పే’ అంటూ పోస్టర్లు వెలిశాయి. ‘మద్యం సొమ్ములు స్వీకరించబడును..’ అంటూ ఈ పోస్టర్లను రూపొందించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సతీమణి భారతి పేరు, ఫొటోతోపాటు.

అయితే, ఇదంతా విపక్షాల దుష్ప్రచారమని వైసీపీ అంటోంది. అనడమేంటి.? శపిస్తోంది కూడా. ‘మహిళల్ని అవమానించినవారెవ్వరైనా మాడి మసైపోవాల్సిందే. ఇది చరిత్ర. దేవీ నవరాత్రుల తొలి రోజున సాక్సాత్తూ సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతిగారిని ఎలాంటి సంబంధం లేని విషయంలో భారతి పే అంటూ అసత్య ప్రచారం చేస్తున్న టీడీపీ నేతలకు ఇదే గతి పట్టబోతోంది.. షేమ్ ఆన్ టీడీపీ’ అంటూ వైసీపీ సోషల్ మీడియా వేదికగా స్పందించింది.

‘భువనేశ్వరి పే’ అనడం ఎంతసేపురా లోకేష్.. అంటూ వైసీపీ నేత నాగార్జున యాదవ్ సోషల్ మీడియాలో ట్వీటేశారు. అయితే, గతంలో భువనేశ్వరి మీద జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేతలా, ఇప్పుడు నీతులు చెబుతున్నదీ.. శాపనార్థాలు పెడుతున్నదీ.? అంటూ టీడీపీ ఎదురుదాడికి దిగుతోంది.

ఇంకోపక్క, రెడ్డి సంఘం పేరుతో.. సోషల్ మీడియాలో ఓ లెటర్ హెడ్ దర్శనమిస్తోంది. రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందనీ, ఈ నేపథ్యంలోనే తాము ఈ చర్యలకు దిగుతున్నామనీ ఆ లెటర్ హెడ్‌లో పేర్కొన్నారు. ఈ మేరకు ‘గంగులకుంట నరేష్ కుమార్ రెడ్డి, అరండల్ పేట, గుంటూరు’ పేరుతో ఓ లెటర్ హెడ్ కనిపిస్తోంది.

తమ వైఫల్యాల్ని ఇతరుల మీదకు నెట్టేయడం వైసీపీకి వెన్నతో పెట్టిన విద్య. మద్యం కుంభకోణంలో వైసీపీ నేతల మీద తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అదీ ఢిల్లీని కుదిపేసిన మద్యం కుంభకోణంలో. దానికి సమాధానం చెప్పుకోలేక.. విపక్షాల మీద వైసీపీ ఎదురుదాడి చేస్తున్న వైనం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

మహిళలు దుస్తులు లేకపోయినా బాగుంటారు: వివాదాస్పదమైన రామ్ దేవ్ వ్యాఖ్యలు

ప్రముఖ యోగ గురు రామ్ దేవ్ బాబా మహిళలపై చేసిన వ్యాఖ్యలు తాజాగా వివాదాస్పదమయ్యాయి. మహిళలు దుస్తులు లేకపోయినా బాగుంటారని అన్నారు. మహారాష్ట్రలోని ఠాణేలో పతంజలి...

కీర్తి భట్‌పై సింపతీ వేవ్.! బిగ్ బాస్ విన్నర్‌ని చేస్తుందా.?

కీర్తి భట్.! బుల్లితెర నటీమణి.! ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు సీజన్ సిక్స్‌లో వన్ ఆఫ్ ది ఇంట్రెస్టింగ్ కంటెస్టెంట్స్ అని చెప్పొచ్చు. చేతి వేలికి...

కాంతారా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..! ఓటీటీలో ‘వరాహరూపం’లో ఒరిజినల్ వెర్షన్

సంచలన విజయం సాధించిన ‘కాంతారా’ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. సినిమా క్లైమాక్స్ లో వచ్చే ‘వరాహరూపం’ సినిమాకే హైలైట్ గా నిలిచింది. అయితే.. తమ...

మోక్షజ్ఞ ఎంట్రీ షురూ..! సినిమాపై.. దర్శకుడిపై క్లారిటీ ఇచ్చిన బాలకృష్ణ..

నందమూరి అభిమానుల ఎదురుచూపులకు తెర దించుతూ నటసింహం బాలకృష్ణ కీలక అనౌన్స్ మెంట్ చేశారు. తనయుడు నందమూరి మోక్షజ్ఞ తెరంగేట్రానికి ముహూర్తం కుదిరిందనే కీలక అప్డేట్...

నటీమణులపై అసభ్యకర పోస్టులు… అనసూయ ఫిర్యాదు… నిందితుడి అరెస్ట్

సినీ నటులు, యాంకర్లు అని తేడా లేకుండా సెలబ్రిటీల ఫోటోలను మార్ఫింగ్ చేసి అసభ్య పదజాలంతో సామజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతోన్న వ్యక్తిని సైబరాబాద్ పోలీసులు...

రాజకీయం

‘సీకే పల్లి పీఎస్ ముందు పరిటాల సునీత, శ్రీరామ్ బైఠాయింపు..’ పరిస్థితి ఉద్రిక్తత

సత్యసాయి జిల్లా సీకే పల్లి పోలిస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రి, టీడీపీ నేత పరిటాల సునీత, ధర్మవరం టీడీపీ ఇంచార్జి పరిటాల శ్రీరామ్, జిల్లా టీడీపీ అధ్యక్షుడు పార్ధసారధి...

ముఖ్యమంత్రి అజ్ఞానంలో వుంటారు.! జనసేనాని సంచలన వ్యాఖ్యలు.!

‘నేను ఉద్దానం ఎప్పుడు వెళ్ళానో కూడా ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తెలియకపోవడం శోచనీయం. ఏమీ తెలియకుండానే ఆయన ఏవేవో మాట్లాడేస్తుంటారు నా గురించి. ఆయన అలా అజ్ఞానంలో వుంటారు....

జస్ట్ ఆస్కింగ్: క్రమశిక్షణ అంటే బూతులు తిట్టడమా.?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని నాలుగు మంచి మాటలు చెప్పారు. ఉన్నత పదవుల్లో వున్నవాళ్ళు మంచి మాటలు చెప్పాలి. వాటిని ప్రజలు ఆచరించేలా చూడాలి. అంతకన్నా...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని అవసరం లేదా.?

అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని అనేది అవసరమా.? కాదా.? రాష్ట్ర ప్రజలు రాజధాని విషయమై ఏమనుకుంటున్నారు.? వైసీపీ సర్కారు ఆలోచనలో ఒక రాజధాని కుదరదు.. మూడు రాజధానులు ఖచ్చితంగా వుండాల్సిందే.! ఆ మూడు...

ఇప్పటం వివాదం: పవన్ కళ్యాణ్ అంత పెద్ద నేరం చేశారా.?

ఇప్పటం గ్రామ ప్రజలు, తమ ఇళ్ళను ప్రభుత్వం కుట్ర పూరితంగా ధ్వంసం చేసిందని ఆరోపించారు. బస్సులు తిరిగే పరిస్థితి లేని గ్రామంలో వున్నపలంగా 120 అడుగుల మేర రోడ్లను వెడల్పు చేయాల్సిన అవసరమేముంది.?...

ఎక్కువ చదివినవి

‘సీకే పల్లి పీఎస్ ముందు పరిటాల సునీత, శ్రీరామ్ బైఠాయింపు..’ పరిస్థితి ఉద్రిక్తత

సత్యసాయి జిల్లా సీకే పల్లి పోలిస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రి, టీడీపీ నేత పరిటాల సునీత, ధర్మవరం టీడీపీ ఇంచార్జి పరిటాల శ్రీరామ్, జిల్లా టీడీపీ అధ్యక్షుడు పార్ధసారధి...

జస్ట్ ఆస్కింగ్: ఏపీలో ఐటీ, సీబీఐ, ఈడీ దాడులెందుకు జరగట్లేదు.?

తెలంగాణలో అధికార తెలంగాణ రాష్ట్ర సమితికి కంటి మీద కునుకు లేకుండా పోతోంది కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు, సోదాల కారణంగా. సీబీఐ, ఈడీ, ఐటీ.. ఇలా వివిధ శాఖలు.. అధికార పార్టీ...

మెగాస్టార్ చిరంజీవికి అరుదైన పురస్కారం..! కేంద్ర ప్రభుత్వం ప్రకటన

మెగాస్టార్ చిరంజీవికి అరుదైన పురస్కారం లభించింది. కేంద్ర ప్రభుత్వం అందించే ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ – 2022 అవార్డుకు ఈ ఏడాదికి చిరంజీవిని ఎంపిక చేసింది. ఆదివారం గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్...

మహేష్ సినిమాకు మరో దెబ్బ.. సౌండ్ కూడా మారిందా..?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన నెక్ట్స్ చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో స్టార్ట్ చేశాడు. ఇప్పటికే తొలి షెడ్యూల్ షూటింగ్ కూడా జరుపుకున్న ఈ సినిమాకు ప్రస్తుతం...

కెప్టెన్ ఇనాయా.! ఫిజికల్ టాస్క్‌లో అమ్మాయిలదే హవా.!

సాధారణంగా ఫిజికల్ టాస్క్ అనగానే, అమ్మాయిలు - అబ్బాయిల మధ్య రచ్చ జరుగుతుంటుంది. అక్కడ టచ్ చేశావ్.. ఇక్కడ చెయ్యి పెట్టావ్.. అంటూ ఫిమేల్ కంటెస్టెంట్లు నానా యాగీ చేస్తుంటారు. మొదటి సీజన్...