సుప్రసిద్ధ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో అప్పట్లో సంచలన విజయం సాదించిన భారతీయుడు చిత్రానికి సీక్వెల్ రూపొందుతున్న విషయం తెలిసిందే. కమల్ హాసన్ డ్యూయెల్ రోల్ పోషిస్తున్న ఈ సినిమా షూటింగ్ మొదలయ్యాక మధ్యలో బ్రేకులు పడ్డాయి. దానికి కారణం ఈ సినిమాకు భారీ బడ్జెట్ అవుతుందని తెలిసి లైకా ప్రొడక్షన్స్ తప్పుకుంటున్నట్టు ప్రకటించడంతో షూటింగ్ ఆగిపోయింది. అయితే ఇప్పుడు ఈ సినిమాను టేక్ ఓవర్ చేయడానికి మరో ప్రముఖ కంపెనీ రిలయన్స్ ముందుకు వచ్చిందట.
ప్రసుతం లైకా ప్రొడక్షన్స్ తో చర్చలు జరుపుతున్నారని టాక్. ఈ చర్చలు సఫలం అయితే భారతీయుడు 2 ఇకపై రిలయన్స్ బ్యానర్ పై తెరకెక్కనుంది. ఈ సినిమాకోసం భారీ బడ్జెట్ ప్లాన్ చేసాడు శంకర్. ఈ సినిమాకోసం ఏకంగా 400 కోట్లు పెడుతున్నట్టు తెలిసింది. భారతీయుడు సినిమా దాదాపు 20 ఏళ్ల క్రితం విడుదలై తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో అదిరిపోయే హిట్ అందుకుని బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము రేపింది. ఇప్పుడు అదే కాన్సెప్ట్ తో దానికి సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ సినిమాపై కమల్ హాసన్ కూడా భారీ ఆశలు పెట్టుకున్నాడు. ఇటీవలే రాజకీయ పార్టీ మొదలు పెట్టిన అయన భారతీయుడు 2 సినిమాలో రాజకీయ అంశాలను చూపిస్తూ క్రేజ్ తెచ్చుకుని ఆ క్రేజ్ తో అటు రాజకీయాల్లో హిట్ అవ్వాలని చూస్తున్నాడు. ఈ సినిమాకోసం కమల్ హాసన్ మేకప్ కోసం ప్రతి రోజు ఆరు గంటలు పడుతుందట. ముసలి గెటప్ తో పాటు హీరోగా రెండో గెటప్ లో కనిపించనున్న ఈ సినిమాలో హీరోయిన్స్ ఎవరన్న విషయం తెలియాల్సి ఉంది. సో ఈ రెండో భారతీయుడు ఈ నెల మూడో వారంనుండి తిరిగి షూటింగ్ మొదలు పెట్టె అవకాశాలు కనిపిస్తున్నాయి.