కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఎన్నో ఏళ్లుగా స్ట్రైట్ తెలుగు సినిమా చేయాలని అనుకున్నా కుదరలేదు. త్రివిక్రం తో సూర్య సినిమా ఉంటుందని కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నా అది మాత్రం జరగలేదు. ఐతే తెలుగు యువ దర్శకులు సూర్య స్టార్ ఇమేజ్ కి తగిన కథలను సిద్ధం చేసి అతనికి వినిపించారని తెలుస్తుంది. త్వరలోనే సూర్య తొలి తెలుగు స్ట్రైట్ సినిమా అనౌన్స్ మెంట్ రాబోతుందని ఫిల్మ్ నగర్ టాక్. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో వెంకీ అట్లూరి డైరెక్షన్ లో సూర్య సినిమా దాదాపు కన్ఫర్మ్ అయినట్టే అని తెలుస్తుంది.
ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఉగాది నాడు ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమాలో హీరోయిన్ గా మిస్టర్ బచ్చన్ బ్యూటీ భాగ్య శ్రీ బోర్స్ ని ఫిక్స్ చేసినట్టుగా చెప్పుకుంటున్నారు. బాలీవుడ్ లో ఒక సినిమా చేసి హరీష్ శంకర్ దృష్టిని ఆకర్షించిన భాగ్య శ్రీ మాస్ మహారాజ్ రవితేజతో మిస్టర్ బచ్చన్ ఛాన్స్ పట్టేసింది. ఐతే తెలుగు ఎంట్రీ గ్రాండ్ గానే ఇచ్చినా సినిమా మాత్రం వర్క్ అవుట్ కాలేదు. ఐతే ఆ రిజల్ట్ అమ్మడి కెరీర్ మీద ఎఫెక్ట్ పడలేదని అర్ధమవుతుంది.
ప్రస్తుతం భాగ్య శ్రీ బోర్స్ దుల్కర్ సల్మాన్ తో కాంత, విజయ్ దేవరకొండతో కింగ్ డమ్, రామ్ తో ఒక సినిమా చేస్తుంది. ఈ మూడు కాకుండానే సూర్య వెంకీ అట్లూరి కాంబో సినిమా ఛాన్స్ కూడా అందుకున్నట్టు తెలుస్తుంది. సూర్యతో చేస్తున్న సినిమా పాన్ ఇండియా రిలీజ్ ఉంటుంది. సో భాగ్యానికి మరో బపర్ ఆఫర్ తగిలినట్టే అన్నమాట. ఈ సినిమాల్లో ఏ ఒక్కటి సూపర్ హిట్ అయినా భాగ్య శ్రీ కెరీర్ దూసుకెళ్లే అవకాశం ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు.