జార్జ్ రెడ్డి, పలాస సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు తిరువీర్. ఆయన హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం “భగవంతుడు”. ఫరియా అబ్దుల్లా హీరోయిన్. గోపి.జి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఏషియన్ ఫిలిమ్స్ బ్యానర్ పై నారాయణ దాస్ నారంగ్, పనస శంకరయ్య గౌడ్ సమర్పణలో రవి పనస ఫిలిం కార్పొరేషన్ బ్యానర్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రొమాంటిక్ పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందుతోంది.
మంగళవారం హీరో తిరువీర్ పుట్టినరోజుని పురస్కరించుకుని మూవీ టీం “భగవంతుడు” సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ మూవీ ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ సినిమాని రూపొందిస్తున్నారు. కన్నడ నటుడు రిషి, రవీందర్ విజయ్, షెల్లి కిషోర్, కాలకేయ ప్రభాకర్, చిరాగ్ జానీ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.