నిర్మాత రవీంద్ర బెనర్జీ ముప్పనేని (Benny) నటుడు మురళీకాంత్‌తో కలిసి చేస్తున్న దండోరా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా ఎందుకు ఒక డిఫరెంట్ పాయింట్‌తో చేయాలనిపించిందో చెబుతూ— కొన్ని కథలు చాలా సింపుల్‌గా ఉన్నా, అందులోని ఎమోషన్ మనసుకు తాకితే ఆ కథను రాసినవాడే దాన్ని ఉత్తమంగా సినిమాకి తీసుకువెళ్లగలడని తన నమ్మకం అని అన్నారు.
బెన్నీ మాట్లాడుతూ, “చాలా జోనర్స్ వస్తుంటాయి… కానీ మనుషుల గురించి, మనం బతికే విధానం గురించి, మన కళ్ల ముందే జరుగుతున్న సమస్యల గురించి చెప్పే కథలను అనుభవించినవాడే వాటిని నిజాయితీగా చెప్పగలడు. మురళీకాంత్ నాకు దండోరా కథ చెప్పినప్పుడు అచ్చం అలా ఫీల్ అయ్యాను. ఈ కథను అతడే చెప్పాలి, అతడే తెరకెక్కించాలి అనిపించింది,” అని తెలిపారు.
డిసెంబర్ 25 విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం కథలోని భావోద్వేగాలు, సామాజిక అంశాలు ప్రేక్షకులను కనెక్ట్ చేస్తాయన్న నమ్మకాన్ని నిర్మాత వ్యక్తం చేశారు.
