బెల్లంకొండ శ్రీనివాస్ తమ్ముడు, ప్రముఖ నిర్మాత బెల్లంకొండ శ్రీనివాస్ చిన్న కొడుకు గణేష్ కూడా హీరోగా ఎంట్రీ ఇస్తోన్న విషయం తెల్సిందే. బెల్లంకొండ గణేష్ నటిస్తోన్న డెబ్యూ మూవీకి స్వాతిముత్యం అనే ఆసక్తికర టైటిల్ ను పెట్టారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా వర్ష బొల్లమ నటిస్తోంది. తాజా సమాచారం ప్రకారం స్వాతిముత్యం విడుదల తేదీని ఖరారు చేసారు.
దసరా కానుకగా అక్టోబర్ 5న స్వాతిముత్యం విడుదల కానుంది. ఇదే తేదికి నాగార్జున ది ఘోస్ట్ కూడా విడుదల కానుంది. సో, నాగార్జునతో తన మొదటి చిత్రంతోనే పోటీ పడనున్నాడు జూనియర్ బెల్లంకొండ. అయితే అది దసరా సీజన్ కాబట్టి కచ్చితంగా విడుదల తేదీల్లో క్లాష్ లు ఉంటాయి.
సితార ఎంటరైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా లక్ష్మణ్ కె కృష్ణ డైరెక్ట్ చేస్తున్నాడు. మహతి స్వర సాగర్ సంగీతాన్ని అందిస్తున్నాడు.