Barbakik: పురాణగాధలను ఇతివృత్తంగా తీసుకుని నేటి పరిస్థితులకు అన్వయించకుని సినిమాలుగా తెరకెక్కించే ట్రెండ్ ప్రస్తుతం కొనసాగుతోంది. జై హనుమాన్, కార్తికేయ.. వంటి సినిమాలు ఆ తరహాలోనివే. ఈక్రమంలో వస్తున్న మరో సినిమా ‘త్రిబాణధారి బార్బరిక్’. భీముడి మనవడు, ఘటోత్కచుడి కుమారుడే బార్బరికుడు. ఈ కథాంశంతో తెరకెక్కుతున్న సినిమా మోషన్ పోస్టర్ విడుదల చేసింది టీమ్.
ఒకేసారి మూడు బాణాలు ప్రయోగించడంలో దిట్ట బార్బరికుడు. ఆయన కథను నేటి కాలంలోని పరిస్థితులకు ఎలా కల్పించామనేదే కథ అని చిత్ర బృందం తెలిపింది. ఈ నేపథ్యంలో విడుదలైన మోషన్ టీజర్ ఆకట్టుకుంటోంది. ‘వెయ్యేనుగుల బలశాలి బలభీముడి మనవడిని, ఘటోత్కచుడికి కొడుకుని..’ అంటూ సాగే సంభాషణలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
ప్రముఖ దర్శకుడు మారుతి సమర్పణలో విజయపాల్ రెడ్డి ఆదిదల సినిమాను నిర్మిస్తున్నారు. మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహిస్తున్నారు. ఇన్ఫ్యూషన్ బ్యాండ్ సంగీతం అందిస్తున్న సినిమాకు సంబంధించి ప్రీ-ప్రోడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి. త్వరలోనే షూటింగ్ ప్రారంభిస్తున్నట్టు తెలిపింది చిత్ర యూనిట్. సత్యరాజ్, సత్యం రాజేశ్, వశిష్ట తదితరులు నటిస్తున్నారు.