ఏపీ క్రియేటివిటీ కల్చర్ కమిషన్ క్రియేటివ్ హెడ్ గా ఎల్.జోగినాయుడును రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈమేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జోగి నాయుడుకు నియామకానికి సంబంధించి తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా ఏపీ స్టేట్ క్రియేటివిటీ అండ్ కల్చర్ కమిషన్ విజయవాడ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ను ఆదేశించింది. 90ల్లో జెమినీ టీవీలో వచ్చిన జోగి బ్రదర్స్ కార్యక్రమంలో జోగినాయుడు పాపులర్ అయ్యారు.
ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ స్పందించారు. జగన్ గారిని నమ్ముకున్నందుకు జోగి నాయుడుకు కూడా పదవి దక్కింది. ఆల్ ది బెస్ట్ తమ్ముడు అంటూ ట్వీట్ చేశారు. ఇప్పటికే ఆలీ, పోసాని కృష్ణమురళికి జగన్ పదవులు ఇచ్చిన నేపథ్యంలో జోగినాయుడుకు కూడా పదవి అని బండ్ల రాసుకొచ్చారు. 2019లో వైసీపీ తరపున జోగినాయుడు ప్రచారం చేశారు. వైసీపీకి అనుకూలంగా ఉన్న సినీ పరిశ్రమ వ్యక్తులకు జగన్ ప్రభుత్వం ఏదొక పదవి కట్టబెడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు జోగినాయుడుకు కూడా కీలక పదవి కట్టబెట్టింది.
జగన్ గారి ని నమ్ముకున్నందుకు జోగి నాయుడు కి కూడా పదవి ఆల్ ది బెస్ట్ తమ్ముడు 💐 @ysjagan 🙏 pic.twitter.com/H0T7pO3MiR
— BANDLA GANESH. (@ganeshbandla) February 19, 2023