టాలీవుడ్‌లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు పొందిన నిర్మాత Bandla Ganesh మరోసారి తన స్టైల్‌ను చూపించాడు. తన కుమార్తె Janani Bandla ఎంగేజ్‌మెంట్ వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించి ఇండస్ట్రీతో పాటు రాజకీయ వర్గాల ప్రముఖులను ఒకే వేదికపైకి తీసుకువచ్చాడు. జనని – Surya Teja Chilukuri నిశ్చితార్థ వేడుక ఫ్యామిలీ ఈవెంట్‌ను మించి సెలబ్రిటీ గ్యాదరింగ్‌గా మారింది.
ఈ వేడుకకు మెగాస్టార్ Chiranjeevi తన కుటుంబంతో కలిసి హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు . అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి N. Chandrababu Naidu, Nara Bhuvaneswari కలిసి విచ్చేసి వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మాజీ ఉపరాష్ట్రపతి M. Venkaiah Naidu కూడా హాజరై శుభాకాంక్షలు తెలిపారు.
సినీ రంగం నుంచి దర్శకులు Sreenu Vaitla, Kona Venkat, Boyapati Srinu పాల్గొన్నారు. హాస్యనటుడు Brahmanandam, మురళి మోహన్ హాజరయ్యారు . నటుడు Srikanth తన కుటుంబంతో వచ్చాడు. యువ హీరో Akash Jagannadh కూడా పాల్గొన్నాడు.
నిర్మాతలు Naveen Yerneni, T. G. Vishwa Prasad, సీనియర్ నిర్మాత Ambika Krishna హాజరై శుభాకాంక్షలు తెలిపారు. రాజకీయ నాయకులలో Lagadapati Rajagopal, Errabelli Dayakar Rao, ఎంపీ Raghunandan Rao పాల్గొన్నారు. మీడియా రంగం నుంచి Vemuri Radhakrishna హాజరయ్యారు . అలాగే భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి N. V. Ramana కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు..
ఇండస్ట్రీ, పొలిటిక్స్, మీడియా రంగాలకు చెందిన ప్రముఖుల సమక్షంలో జరిగిన ఈ ఎంగేజ్‌మెంట్ వేడుక ఒక గ్రాండ్ ఈవెంట్‌గా నిలిచింది. ఒకే వేదికపై ఇంతమంది ప్రముఖులను సమీకరించడం ద్వారా బండ్ల గణేష్ తన ప్రభావాన్ని మరోసారి చాటుకున్నాడు. జనని – సూర్య తేజ జంటకు ఈ వేడుక శుభారంభంగా నిలిచింది.
