నిర్మల్ జిల్లా భైంసాలో జరిగే ప్రజా సంగ్రామ యాత్రకు తనను అడ్డుకోవడంపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మండిపడ్డారు. నేటి సభకు ఖచ్చితంగా వెళ్తానని తేల్చి చెప్పారు. ప్రజా సంగ్రామ యాత్ర కోసం కరీంనగర్ నుంచి నిర్మల్ వెళ్తున్న ఆయన్ను జగిత్యాల మండలం తాటిపల్లి వద్ద పోలీసులు రాత్రి అడ్డుకున్నారు.
‘పాదయాత్రకు అన్ని ఏర్పాట్లు చేసుకున్న తరువాత చివరి క్షణంలో అనుమతి లేదని చెప్పడమేంటి..? మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర పడ్నవీస్ వస్తున్నారని పోలీసులకు ముందే సమాచారం ఇచ్చాం. సభ ఏర్పాట్లు పర్యవేక్షించి ఇప్పుడు యూటర్న్ తీసుకుంటారా? రూట్ మ్యాప్ కూడా ప్రకటించి బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు చేసాక హఠాత్తుగా అనుమతి లేదంటారా..? బైంసా ఏమైనా నిషేధిత ప్రాంతమా? అక్కడికి ఎందుకు పోకూడదు..?’.
‘బైంసా సున్నిత ప్రాంతమంటే.. దానినే కాపాడలేని ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని ఏం కాపాడుతారు..? సీఎంకు చేతకాకపోతే ఇంట్లో కూర్చోవాలి. కేసీఆర్ నియంత పాలనకు ఇదే నిదర్శనం. మధ్యాహ్నం వరకు సమయం ఉంది. వెయిట్ చూస్తాం.. లేదంటే కోర్టును ఆశ్రయిస్తాం.