ఆకుల అఖిల్, దర్శిక మీనన్, చిత్రం శ్రీను, గడ్డం నవీన్, చిట్టిబాబు, రేవతి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం బాలుగాడి లవ్ స్టోరీ. శ్రీ ఆకుల భాస్కర్ సమర్పణలో భామ క్రియేషన్స్ పతాకంపై ఆకుల మంజుల నిర్మించిన ఈ చిత్రానికి ఎల్. శ్రీనివాస్ తేజ్ దర్శకత్వం వహించారు.
సినిమా రిలీజ్‌కు ముందు జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. ఈ కార్యక్రమానికి చిత్ర యూనిట్‌తో పాటు జర్నలిస్టులు ప్రభు, కిషోర్ దాస్, వినోద్ చౌదరి, నిర్మాత మహేంద్రనాధ్, హీరోయిన్ మేఘన, మా అసోసియేషన్ ఈసీ మెంబర్ మానిక్, దర్శకుడు తల్లాడ సాయి తదితరులు హాజరయ్యారు.
సినిమా గురించి మాట్లాడుతూ సీనియర్ జర్నలిస్ట్ ప్రభు “టైటిల్ బాగుంది. పాటలు ఆకట్టుకుంటున్నాయి. కంటెంట్ బలంగా ఉంది కాబట్టి తప్పకుండా విజయం సాధిస్తుంది” అని అన్నారు. నిర్మాత ఆకుల మంజుల “ఇది మా అబ్బాయి ఆకుల అఖిల్ హీరోగా, శ్రీనివాస్ తేజ్ దర్శకుడిగా మొదటి సినిమా. అందరికీ ఈ చిత్రం మంచి పేరు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నా” అన్నారు.
ఆకుల భాస్కర్ మాట్లాడుతూ “ఈ సినిమా నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. ఘనశ్యామ్ ఇచ్చిన పాటలు హైలైట్ అవుతాయి. ప్రేక్షకులు థియేటర్స్‌లో చూసి ఎంజాయ్ చేయాలి” అన్నారు.
దర్శకుడు శ్రీనివాస్ తేజ్ “చిరంజీవి గారిని ఆదర్శంగా తీసుకొని ఈ సినిమా తీశాను. ఇందులో కామెడీ, యాక్షన్, లవ్ అన్నీ ఉన్నాయి. అఖిల్ హీరోగా ప్రేక్షకులను ఆకట్టుకుంటాడు” అని చెప్పారు.
హీరో అఖిల్ “మా సినిమా ఆగస్ట్ 8న థియేటర్స్‌లో విడుదల అవుతోంది. ప్రేక్షకులు తప్పకుండా కనెక్ట్ అవుతారని నమ్ముతున్నాను” అన్నారు. హీరోయిన్ దర్శిక మీనన్ “ఈ అవకాశం ఇచ్చినందుకు నిర్మాతలకు, దర్శకుడికి థాంక్స్. సినిమా చాలా బాగా వచ్చింది. మీ అందరికీ నచ్చుతుంది” అని చెప్పారు.
ఈ చిత్రాన్ని ‘సిల్వర్ స్క్రీన్’ గణేష్ భారీగా విడుదల చేస్తున్నారు. బాలుగాడి లవ్ స్టోరీ ఆగస్ట్ 8న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
