Switch to English

జనసేనలోకి మాజీ మంత్రి బాలినేని.! ఈ పుకార్లు పుట్టించిందెవరబ్బా.?

91,428FansLike
56,273FollowersFollow

నిప్పు లేకుండా పొగ రాదన్నది తరచూ మనం వినే మాట. కానీ, ఇప్పుడు నిప్పుతో పని లేదు, పొగ దానంతట అదే వచ్చేస్తోంది. రాజకీయాల్లో అయితే మరీనూ.! మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి జనసేన పార్టీలో చేరబోతున్నారన్నది ఓ గాసిప్. తనకు అత్యంత సన్నహితులైనవారు, అనుచరులు, అభిమానులతో బాలినేని శ్రీనివాస్ రెడ్డి సమావేశం ఏర్పాటు చేశారట.. దాంతో, ఆయన జనసేనలోకి వెళ్ళబోతున్నారనే ప్రచారం జరిగింది.

ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్, చేనేతని ప్రమోట్ చేసేలా సోషల్ మీడియాలో ఓ క్యాంపెయిన్ జరుగుతోంటే, దానిపై స్పందించారు. తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీయార్ తనను ట్యాగ్ చేయడంపై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ, చేనేత వస్త్రాలు తాను ధరించి వున్న ఫొటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేసిన సంగతి తెలిసిందే.

జనసేనాని కూడా పలువుర్ని ఈ ఛాలెంజ్ కోసం ట్యాగ్ చేశారు. అందులో వైసీపీ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి కూడా వున్నారు. బాలినేని కూడా పవన్ తనను ట్యాగ్ చేయడంపై స్పందించడం వైసీపీ శ్రేణులకు నచ్చలేదు. బాలినేనిపై సోషల్ మీడియా వేదికగా బాలినేని శ్రీనివాస్ రెడ్డిని వైసీపీ శ్రేణులే ట్రోల్ చేశాయి. నిజానికి, ఆయన మంత్రి పదవి కోల్పోవడానికి కూడా వైసీపీలో ఓ వర్గమే కారణం.

బాలినేని అనుచరుడ్ని, బాలినేని అనుచరులే కొందరు ఆ మధ్య చావబాదడంతో, ఓ సామాజిక వర్గం అప్పట్లో బాలినేనిపై గుస్సా అయ్యింది. అలా కొడుతున్న వీడియో లీక్ అవడం తెలిసిన సంగతే. వైసీపీలో ఈ వీడియోల లీక్ సంస్కృతి చాలా చాలా ఎక్కువ. ఇప్పుడు బాలినేని, జనసేనలో చేరబోతున్నారన్న పుకారు పుట్టించింది కూడా వైసీపీ శ్రేణులేనన్న ప్రచారం జరుగుతోంది.

పొమ్మన లేక బాలినేనికి వైసీపీ పొగపెడుతోందన్న ఆరోపణలు గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి. బాలినేని మాత్రం, తాను పార్టీని వీడేది లేదంటున్నారు. తనకు వైసీపీ అధిష్టానం అప్పగించిన బాధ్యతల్లో భాగంగానే, పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించినట్లు చెబుతున్నారు. వైసీపీని వీడబోననీ, తాను వైఎస్ రాజశేఖర్ రెడ్డి పెట్టిన రాజకీయ భిక్షతోనే రాజకీయాల్లో ఈ స్థాయిలో వున్నానంటున్నారయన.!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘నవాబ్’ మూవీ కోసం 12 ఎకరాల్లో డంప్ యార్డ్ సెట్

ముఖేష్ గుప్తా, అనన్య నాగళ్ల హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా నవాబ్. ఈ చిత్రంలో రామ రాజ్, మురళీ శర్మ, రాహుల్ దేవ్, శ్రవణ్ రాఘవేంద్ర,...

‘లెహరాయి’ నుండి “బేబీ ఒసేయ్ బేబీ” పాట విడుదల

బెక్కం వేణుగోపాల్ సమర్పణలో ఎస్ ఎల్ ఎస్ మూవీస్ నిర్మాణ సంస్ణ లో రంజిత్, సౌమ్య మీనన్ హీరో హీరోయిన్స్ గా, ధ‌ర్మ‌పురి ఫేం గగన్...

అందం కోసం బుట్టబొమ్మ సర్జరీపై క్లారిటీ

హీరోయిన్ పూజా హెగ్డే తన అందాన్ని పెంచుకోవడం కోసం ఇటీవల ముక్కు సర్జరీ చేయించుకుంది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన విషయం...

బాబోయ్‌ రష్మిక మరీ అంత పెంచేసిందా?

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుసగా బాలీవుడ్ లో సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. సౌత్ లో కొన్ని ఆఫర్స్ ని ఈమె కాదన్నట్లుగా...

బిగ్‌బాస్‌ 6 : ఆ సర్వే టాప్‌ 5 లో శ్రీసత్య

ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ఓర్మాక్స్ వారు ప్రతివారం సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అయ్యే సెలబ్రెటీల జాబితాను ప్రకటిస్తూ ఉంటారు. సోషల్‌ మీడియాలో ఎక్కువగా ఎవరి...

రాజకీయం

గులాబీ రాజకీయం.! జాతీయ తెలుగు పార్టీ దిశగా.!

ఇంతలోనే ఎంత మార్పు.? నిజానికి, ఈ మార్పు మంచిదే.! తెలుగు తల్లి ఎవనికి తల్లి.? అని ప్రశ్నించిన తెలంగాణ రాష్ట్ర సమితి, ఇప్పుడు ‘తెలుగు పార్టీ, జాతీయ రాజకీయాల్లో సత్తా చాటబోతోంది..’ అని...

అమరావతి రైతుల పాదయాత్ర: మంత్రుల బెదిరింపులు.! జనం బేఖాతర్.!

రాజధాని అమరావతి విషయంలో మంత్రులు బెదిరింపులకు దిగుతున్నారు. జనాన్ని రెచ్చగొడుతున్నారు. అమరావతి నుంచి అరసవెల్లికి జరుగుతున్న మహా పాదయాత్రను అడ్డుకునేందుకు ప్రభుత్వం స్థాయిలో, పార్టీ స్థాయిలో ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. అవి సఫలం...

కేసీయార్ స్కెచ్.! ఆంధ్రప్రదేశ్‌లోనూ టీఆర్ఎస్ పోటీ.?

‘ఆంధ్రప్రదేశ్‌లోనూ తెలంగాణ రాష్ట్ర సమితి పోటీ చేయాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారు..’ అని పలు సందర్భాల్లో గులాబీ పార్టీ నేతలు వ్యాఖ్యానించడం చూశాం. ఆ లిస్టులో తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్...

‘జ..గన్’ అంటోన్న రోజా.! ‘గన్..జా’ అంటోన్న టీడీపీ.! అసలేంటి కథ.?

ఆడ పిల్లకి అన్యాయం జరిగితే, గన్ కంటే ముందుగా జగన్ అక్కడ వుంటాడంటూ పదే పదే వైసీపీ నేత రోజా చెప్పడం చూశాం. ఎమ్మెల్యేగా వున్నప్పటినుంచీ ఆమె ఇవే మాటలు చెబుతూ వస్తున్నారు....

మొగల్తూరు రాజకీయం.! ప్రభాస్, చిరంజీవి.. అసహనం వ్యక్తం చేసిన వేళ.!

‘మరీ ఇంత నీఛానికి దిగజారుతారా.?’ అన్న చర్చ సినీ పరిశ్రమలో చాలామంది ప్రముఖుల మధ్య జరుగుతోంది. సినీ నటుడు, మాజీ కేంద్ర మంత్రి, దివంగత కృష్ణంరాజు సంస్మరణ కార్యక్రమం ఆయన సొంతూరులో నిర్వహించిన...

ఎక్కువ చదివినవి

బిగ్‌బాస్.! నీకు మతి పోయిందా ఏంటి.?

వీకెండ్ ఎపిసోడ్ అంటే ఎలా వుండాలి.? ఫుల్ జోష్‌తో వుండాలి. నాగార్జున వచ్చినాడు, వెళ్ళినాడు.! అంతే, అంతకు మించి ఏమీ లేదక్కడ. చలాకీ చంటికి ఈ సీజన్ మొత్తం కెప్టెన్సీ అయ్యే అర్హత...

మరీ అంత నీఛమా బిగ్ బాస్.?

సినిమాల్లో హీరోయిన్లు గాఢమైన లిప్ లాక్స్‌తో రెచ్చిపోతున్నారు. ఓటీటీలో కనిపించే పడక గది వ్యవహారాల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.! సెన్సార్ వున్నాగానీ, సినిమాల్ని కట్టడి చేయలేకపోతున్నాం. ఓటీటీ మీద...

ఇక ‘టాప్ గేర్’ వేస్తున్న ఆది సాయికుమార్.

వరుస సినిమాలతో ప్రామిసింగ్ హీరోగా తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు యంగ్ హీరో ఆది సాయికుమార్. ప్రేమ కావాలి సినిమాతో వెండితెరకు పరిచయమై పలు వైవిధ్యభరితమైన సినిమాల్లో భాగమవుతూ తనదైన నటనతో...

ఆది సాయికుమార్ “సీఎస్ఐ సనాతన్” గ్లింప్స్ విడుదల

చాగంటి ప్రొడ‌క్ష‌న్ లో ఆది సాయికుమార్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "సీఎస్ఐ సనాతన్". ఈ చిత్రంలో క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్ (సియ‌స్ ఐ) ఆఫీస‌ర్ గా ఆదిసాయికుమార్ ఒక కొత్త రోల్...

‘హరిహర వీర మల్లు’ ప్రీ షెడ్యూల్ వర్క్ షాప్

విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు ప్రేక్షకులను మెప్పించగల విజయవంతమైన చిత్రాలను రూపొందించడంతో దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దిట్ట. 'కంచె', 'గౌతమీపుత్ర శాతకర్ణి' వంటి చిరస్మరణీయమైన మరియు జాతీయ పురస్కారాలు గెలుచుకున్న చిత్రాలను ఆయన...