పాన్ ఇండియా స్థాయిలో ఆసక్తిని రేకెత్తిస్తున్న ‘బాలన్ – ది బాయ్’ సినిమా జూన్ 19న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. గ్రాండియర్ ఫిలిం మేకింగ్‌కు పేరుగాంచిన కేవీఎన్ ప్రొడక్షన్స్, తెస్పియన్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ‘మంజుమ్మెల్ బాయ్స్’ ఫేమ్ దర్శకుడు చిదంబరం తెరకెక్కిస్తున్నారు. ‘ఆవేశం’ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న జితూ మాధవన్ ఈ సినిమాకు కథ, స్క్రిప్ట్ అందించడం విశేషం.
ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ విడుదల చేయనుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన మేకర్స్, అన్నపూర్ణ స్టూడియోస్‌తో కలసి పని చేయడం ఆనందంగా ఉందని తెలిపారు. దీంతో ‘బాలన్ – ది బాయ్’ సినిమా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో విస్తృత స్థాయిలో ప్రేక్షకులకు చేరనుంది.
ఇప్పటికే ఈ సినిమా అంతర్జాతీయ వేదికలపైనా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల ఫ్రాన్స్‌లో జరిగిన ప్రతిష్ఠాత్మక కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో ‘బాలన్ – ది బాయ్’ ప్రదర్శించబడగా, అక్కడ మంచి స్పందన లభించింది. మన నేటివిటీతో పాటు యూనివర్సల్ ఎమోషన్స్ కలగలిపిన కథతో దర్శకుడు చిదంబరం ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు చిత్రబృందం చెబుతోంది.
చందు సలీమ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి సుషిన్ శ్యామ్ సంగీతం అందిస్తున్నారు. షైజు ఖాలిద్ సినిమాటోగ్రఫీ నిర్వహించగా, వివేక్ హర్షన్ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. వెంకట్ కె నారాయణ, శైలజా దేశాయి ఫెన్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రం థియేటర్లలో ప్రత్యేక అనుభూతిని అందిస్తుందని మేకర్స్ నమ్మకంగా చెబుతున్నారు.
