Switch to English

బాలయ్య వర్సెస్ రోజా: ఎవరి ఫ్లూటు.! ఎవరు ముందు ఊదాలి.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,464FansLike
57,764FollowersFollow

రాజకీయాల్లో సినిమా డైలాగులు పేల్చడంలో దిట్ట సినీ నటి, వైసీపీ ఎమ్మెల్యే, మంత్రి రోజా. ఒకప్పుడు సినీ నటి కదా, ఆ సినిమాటిక్ ఛాయలు మంత్రి అయినా పోగొట్టుకోలేదామె.! మంత్రి పదవి వచ్చాక జబర్దస్త్ మానేశారుగానీ, బుల్లితెరపై ఆమె అప్పట్లో వేసిన ‘జబర్దస్త్ వేషాలు’ అన్నీ ఇన్నీ కావు. సరే, సినిమా నటులు రాజకీయాల్లో వున్నప్పుడు.. నటనను కెరీర్‌గా కొనసాగించకూడదా.? అంటే, కొనసాగించకూడదని ఎవరూ చెప్పరు, చెప్పడం సబబు కాదు కూడా.

కానీ, మంత్రిగా ప్రజలకు ఏం చేశాం.? అన్న విషయాన్ని పక్కన పెట్టి, సినిమాటిక్ డైలాగులతో కాలక్షేపం చేస్తేనే వస్తుంది అసలు సమస్య. సినీ నటిగా వున్న సమయంలోనే, తెలుగు సినిమా సంక్షోభం ఎదుర్కొన్నప్పుడు.. ఆ సంక్షోభానికి ఏపీ ప్రభుత్వం సినిమా టిక్కెట్ల ధరల విషయంలో అడ్డగోలుగా వ్యవహరించినప్పుడు.. రోజా ఎందుకు పెదవి విప్పలేదు.? అప్పుడామె ఎవరి ముందు ఫ్లూటు ఊదుతున్నారని నందమూరి బాలకృష్ణ అభిమానులు ప్రశ్నిస్తున్నారు.

‘బాలయ్య ఫ్లూటు బాబు ముందు ఊదు.. జగన్ అన్న ముందు కాదు, అక్కడ ఉంది రీల్ సింహం కాదు, జ‘గన్’ అనే రియల్ సింహం. తేడా వస్తే దబిడి దిబిడే’ అంటూ రోజా సోషల్ మీడియా వేదికగా ఓ ట్వీటేశారు.

ఒకప్పుడు వైఎస్ జగన్ కూడా నందమూరి బాలకృష్ణకు వీరాభిమాని అట. అలా చెప్పేందుకు బోల్డన్ని సాక్ష్యాలున్నాయి. కడప బాలయ్య ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా అప్పట్లో పత్రికల్లో వైఎస్ జగన్ పేరుతో ఓ ప్రకటన కూడా వచ్చింది. అందుకేనేమో, చాలా సినిమాల్ని నట్టేట్లో టిక్కెట్ల ధరల విషయమై ముంచేసినా, ‘అఖండ’ సినిమాకి ‘ఆయన అడిగింది చేసెయ్యండి..’ అని మంత్రులను ఆదేశించారట ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఆ విషయాన్ని స్వాయానా అప్పట్లో మంత్రిగా వున్న పేర్ని నాని చెప్పారు.

‘బాలకృష్ణగారూ మళ్ళీ ఎప్పుడు కలిసి సినిమా చేద్దాం..’ అని ఆ మధ్య జబర్దస్త్ వేదికగా బాలయ్యను బతిమాలుకున్నారు రోజా. అంతేనా.? టీడీపీ – వైసీపీ మధ్య చట్ట సభల్లో హోరాహోరీగా పోరు జరుగుతున్న సమయంలో బాలయ్యతో కులాసాగా రోజా సెల్ఫీలు తీసుకున్న విషయం చాలామందికి గుర్తుండే వుంటుంది.

ఇది కదా 60-40 బంధం అంటే. వైసీపీ, టీడీపీ వేర్వేరు కాదు.. ఇద్దరూ ఒకరి ముందు ఇంకొకరు ఫ్లూటు ఊదుకుంటున్నారు.. వెరసి, రాష్ట్ర ప్రజల్ని వెర్రి వెంగళప్పల్ని చేస్తున్నారంతే.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

ఎక్కువ చదివినవి

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి జగన్నాధ్’

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో స్టయిల్స్, మేనరిజమ్స్ ఫాలో అవుతారు ఫ్యాన్స్....

జనసేన స్ట్రైక్ రేట్ 98 శాతం కాదు, 100 శాతం.!?

‘వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను..’ అంటూ చాలాకాలం క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేస్తే, ‘ఇదెలా సాధ్యం.?’ అంటూ రాజకీయ విశ్లేషకులు పెదవి విరిచారు. టీడీపీ - జనసేన...

నర్సాపురం అసెంబ్లీ గ్రౌండ్ రిపోర్ట్: ఎడ్జ్ జనసేన పార్టీకే.!

2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నర్సాపురం కూడా ఒకింత హాట్ టాపిక్ అవుతున్న నియోజకవర్గమే. నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం అలాగే, ఆ పరిధిలోని నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం.. ఈ...

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం ఇదే

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh). సినిమాలో డీన్ పాత్ర పోషించిన బాలీవుడ్...