Switch to English

పంచభూతాలున్నాయ్ తస్మాత్ జాగ్రత్త: వైఎస్ జగన్‌కి ఎమ్మెల్యే బాలకృష్ణ హెచ్చరిక.!

91,319FansLike
57,013FollowersFollow

‘మార్చెయ్యడానికీ, తీసెయ్యడానికీ ఎన్టీయార్ అన్నది పేరు కాదు.. ఓ సంస్కృతి.. ఓ నాగరికత.. తెలుగు జాతి వెన్నెముక..’ అంటూ సినీ నటుడు, టీడీపీ నేత, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన తండ్రి స్వర్గీయ ఎన్టీయార్ పేరు మీదున్న హెల్త్ యూనివర్సిటీకి, పేరు మార్చి వైఎస్సార్ పేరుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పెట్టడంపై తీవ్రంగా స్పందించారు.

‘తండ్రి గద్దెనెక్కి ఎయిర్ పోర్ట్ పేరు మార్చాడు.. కొడుకు గద్దెనక్కి యూనివర్సిటీ పేరు మారుస్తున్నాడు..’ అంటూ బాలయ్య మండిపడ్డారు. అంతేనా, ‘మిమ్మల్ని మార్చడానికి ప్రజలున్నారు… పంచభూతాలున్నాయ్ తస్మాత్ జాగ్రత్త..’ అంటూ బాలయ్య హెచ్చరించడం మరో ఆసక్తికరమైన విషయం.

ఈ పంచ భూతాల సంగతి తర్వాత మాట్లాడుకుందాం.! ‘అక్కడ ఆ మహనీయుడు పెట్టిన భిక్షతో బతుకుతున్న నేతలున్నారు.. పీతలున్నారు.. విశ్వాసంలేని వాళ్ళని చూసి కుక్కలు వెక్కిరిస్తున్నాయ్.. శునకాల ముందు తలవంచుకు బతికే సిగ్గులేని బతుకులు..’ అంటూ బాలయ్య ముగించారు.

ఇంతకీ, శునకాలు సైతం వెక్కరించే నాయకులెవరబ్బా.? శునకాల ముందు తలవంచుకు బతికే సిగ్గులేని బతుకులెవరివబ్బా.? బాలయ్య ఎవర్ని టార్గెట్ చేసినట్లు.? బహుశా మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నాని మీదనే ఈ ‘శునకాల’ ప్రయోగం బాలయ్య చేసి వుండొచ్చన్నది సోషల్ మీడియాలో నందమూరి అభిమానులే కాదు, ఇతర నెటిజన్లు కూడా వ్యక్తం చేస్తున్న అభిప్రాయం.

ఇంతకీ, ఆ పంచభూతాల వ్యవహారమేంటి.? వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు గనుక, పంచభూతాలు కన్నెర్రజేశాయన్నది బహుశా బాలయ్య ఉద్దేశ్యం కావొచ్చు. హైద్రాబాద్‌లో శంషాబాద్ విమానాశ్రయానికి ఎన్టీయార్ పేరు పెట్టాల్సి వుండగా, దాన్ని మార్చింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి.

సో, అలా పంచభూతాలు వైఎస్ రాజశేఖర్ రెడ్డి మీద పగబట్టాయన్నమాట. ఇప్పుడు హెల్త్ యూనివర్సిటీకి పేరు మార్చడం ద్వారా వైఎస్సార్ తనయుడు వైఎస్ జగన్ అంతకు మించిన పాపం చేశారన్నది బహుశా బాలయ్య ఉద్దేశ్యం కావొచ్చన్నది నెటిజనుల విశ్లేషణ.

పంచభూతాలున్నాయ్ తస్మాత్ జాగ్రత్త: వైఎస్ జగన్‌కి ఎమ్మెల్యే బాలకృష్ణ హెచ్చరిక.!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

మహిళలు దుస్తులు లేకపోయినా బాగుంటారు: వివాదాస్పదమైన రామ్ దేవ్ వ్యాఖ్యలు

ప్రముఖ యోగ గురు రామ్ దేవ్ బాబా మహిళలపై చేసిన వ్యాఖ్యలు తాజాగా వివాదాస్పదమయ్యాయి. మహిళలు దుస్తులు లేకపోయినా బాగుంటారని అన్నారు. మహారాష్ట్రలోని ఠాణేలో పతంజలి...

కీర్తి భట్‌పై సింపతీ వేవ్.! బిగ్ బాస్ విన్నర్‌ని చేస్తుందా.?

కీర్తి భట్.! బుల్లితెర నటీమణి.! ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు సీజన్ సిక్స్‌లో వన్ ఆఫ్ ది ఇంట్రెస్టింగ్ కంటెస్టెంట్స్ అని చెప్పొచ్చు. చేతి వేలికి...

కాంతారా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..! ఓటీటీలో ‘వరాహరూపం’లో ఒరిజినల్ వెర్షన్

సంచలన విజయం సాధించిన ‘కాంతారా’ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. సినిమా క్లైమాక్స్ లో వచ్చే ‘వరాహరూపం’ సినిమాకే హైలైట్ గా నిలిచింది. అయితే.. తమ...

మోక్షజ్ఞ ఎంట్రీ షురూ..! సినిమాపై.. దర్శకుడిపై క్లారిటీ ఇచ్చిన బాలకృష్ణ..

నందమూరి అభిమానుల ఎదురుచూపులకు తెర దించుతూ నటసింహం బాలకృష్ణ కీలక అనౌన్స్ మెంట్ చేశారు. తనయుడు నందమూరి మోక్షజ్ఞ తెరంగేట్రానికి ముహూర్తం కుదిరిందనే కీలక అప్డేట్...

నటీమణులపై అసభ్యకర పోస్టులు… అనసూయ ఫిర్యాదు… నిందితుడి అరెస్ట్

సినీ నటులు, యాంకర్లు అని తేడా లేకుండా సెలబ్రిటీల ఫోటోలను మార్ఫింగ్ చేసి అసభ్య పదజాలంతో సామజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతోన్న వ్యక్తిని సైబరాబాద్ పోలీసులు...

రాజకీయం

టీడీపీ ఎమ్మెల్యే గంటా వైసీపీలో చేరబోతున్నారా.?

మెగాస్టార్ చిరంజీవి ఆశీస్సులతో, సూచనలతో మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారట. అసలు గంటా శ్రీనివాసరావు టీడీపీలోనే వున్నారా.? చాలామందికి వస్తోన్న డౌట్ ఇది. 2019...

ఛాలెంజ్ విసురుతున్నా.. ఈసారి మీరెలా గెలుస్తారో చూస్తా..: పవన్ కల్యాణ్

‘ఎవరికి అన్యాయం జరిగినా స్పందిస్తాం.. మాకు ఓట్లు వేసినా.. వేయకపోయినా అండగా ఉంటాం’ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. మంగళగిరిలోని పార్టీ ఆఫీసులో ఇప్పటం గ్రామంలో ఇళ్ల కూల్చివేత బాధితులకు...

‘సీకే పల్లి పీఎస్ ముందు పరిటాల సునీత, శ్రీరామ్ బైఠాయింపు..’ పరిస్థితి ఉద్రిక్తత

సత్యసాయి జిల్లా సీకే పల్లి పోలిస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రి, టీడీపీ నేత పరిటాల సునీత, ధర్మవరం టీడీపీ ఇంచార్జి పరిటాల శ్రీరామ్, జిల్లా టీడీపీ అధ్యక్షుడు పార్ధసారధి...

ముఖ్యమంత్రి అజ్ఞానంలో వుంటారు.! జనసేనాని సంచలన వ్యాఖ్యలు.!

‘నేను ఉద్దానం ఎప్పుడు వెళ్ళానో కూడా ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తెలియకపోవడం శోచనీయం. ఏమీ తెలియకుండానే ఆయన ఏవేవో మాట్లాడేస్తుంటారు నా గురించి. ఆయన అలా అజ్ఞానంలో వుంటారు....

జస్ట్ ఆస్కింగ్: క్రమశిక్షణ అంటే బూతులు తిట్టడమా.?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని నాలుగు మంచి మాటలు చెప్పారు. ఉన్నత పదవుల్లో వున్నవాళ్ళు మంచి మాటలు చెప్పాలి. వాటిని ప్రజలు ఆచరించేలా చూడాలి. అంతకన్నా...

ఎక్కువ చదివినవి

బర్త్ డే స్పెషల్: అక్కినేని సినీ వారసత్వాన్ని ఘనంగా చాటుతున్న ‘నాగచైతన్య’

కుటుంబానికి ఉన్న ఘనమైన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడం ఎవరికైనా ఒక సవాలు.. అంతకుమించి బాధ్యత. సినీ రంగంలో ఇది మరీ ఎక్కువ. అతితక్కువ కాలంలో పేరు, ప్రతిష్ట, డబ్బు వచ్చేది సినిమాల్లోనే. అయితే.....

లవ్ టుడే మూవీ రివ్యూ

తమిళంలో సెన్సేషన్ గా నిలిచిన లవ్ టుడే చిత్రం ఈరోజే తెలుగులో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి యూత్ ను టార్గెట్ చేసిన ఈ చిత్రం దిల్ రాజు సపోర్ట్ తో విడుదలైంది....

స్క్రిప్టు లేకుండా విమర్శలైనా చేయలేకపోతున్న సీఎం జగన్.! ఎందుకిలా.?

ఎలాంటి జగన్ ఎలా అయిపోయాడు.? ఈ చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతోంది. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి...

పవర్ స్టార్ కు బాస్ పార్టీ పిచ్చ పిచ్చగా నచ్చేసిందిట

మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న వాల్తేర్ వీరయ్య సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానున్న విషయం తెల్సిందే. ఇదిలా ఉంటే చిత్ర ప్రమోషన్స్ షురూ అవుతున్నాయి. ఈ...

శంకరాభరణం చిత్రానికి మరో అరుదైన గౌరవం !!

గోవాలో జరిగే 53వ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ - 2022 లో “శంకరాభరణం” చిత్రం- రీ స్టోర్డ్ ఇండియన్ క్లాసిక్స్ (తిరిగి భద్ర పరచాల్సిన గొప్ప చిత్రం) విభాగంలో ఎంపికయ్యింది. నేషనల్ ఫిల్మ్ ఆర్చివ్స్...