నందమూరి బాలకృష్ణ గతంలో ఎప్పుడూ లేనంత బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ చేస్తోన్న బాలకృష్ణ సెప్టెంబర్ నుండి గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక యాక్షన్ ఎంటర్టైనర్ ను చేయనున్నాడు.
అంత కాకుండా బాలయ్య ఆరుగురు నిర్మాతల నుండి అడ్వాన్స్ లు తీసుకున్నాడు. మరింత మంది లైన్లో ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే విజయవంతమైన చిత్రాలను అందించిన దర్శకుడు అనిల్ రావిపూడి ఎప్పటినుండో బాలయ్యతో సినిమా చేయాలనుకుంటున్నాడు.
గోపీచంద్ మలినేని సినిమా తర్వాత అనిల్ తో బాలకృష్ణ పనిచేస్తాడని వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ లైనప్ లో మార్పు వచ్చినట్లు తెలుస్తోంది. అనిల్ రావిపూడి కంటే ముందు పూరి జగన్నాథ్ తో పనిచేయాలని అనుకుంటున్నాడు బాలకృష్ణ. వచ్చే ఏడాది ఈ సినిమా మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి.
647385 793189I as properly believe thence , perfectly pent post! . 575438