నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు సినిమాల తరువాత తమిళ దర్శకుడు కె ఎస్ రవికుమార్ దర్శకత్వంలో నటించేందుకు రెడీ అయ్యాడు. రూలర్ పేరుతొ తెరకెక్కనున్న ఈ సినిమా జూన్ లో మొదలు కానుంది. ఇక ఈ సినిమా తారువాత బాలకృష్ణ హీరోగా నటించే నెక్స్ట్ సినిమా బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటించనున్నాడు. ఇప్పటికే వీరిద్దరి మధ్య కథా చర్చలు కూడా జరిగాయి.
అయితే ఈ కథకోసం బోయపాటి ఏకంగా 60 కోట్ల బడ్జెట్ చెప్పాడట, కానీ బడ్జెట్ విషయంలో బాలయ్య నో చెప్పాడని .. కేవలం 40 కోట్లలోనే సినిమా చేయాలనీ కండిషన్ పెట్టాడట. దాంతో బోయపాటి మరో కథను సిద్ధం చేసి బాలయ్యకు వినిపించాడట. ఆ కథ నచ్చడంతో బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్. బాలయ్య – బోయపాటి ల కాంబినేషన్ లో ఇదివరకే వచ్చిన సింహ, లెజెండ్ సినిమాలు బాలయ్య కెరీర్ లో ల్యాండ్ మార్క్ సినిమాలుగా నిలిచాయి. దాంతో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చే ఈ హ్యాట్రిక్ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
ప్రస్తుతం బాలయ్య రూలర్ సినిమా చేస్తుండడంతో అటు బోయపాటి కూడా ఓ సినిమా చేయాలనీ ప్లాన్ చేస్తున్నాడు. అది త్వరలోనే పూర్తీ చేసి ఆగస్టులో బాలయ్య సినిమాను మొదలు పెడతారట. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్స్ ని తనదైన శైలిలో తెరకెక్కించే బోయపాటి శ్రీను తాజాగా రామ్ చరణ్ తో తీసిన వినయ విధేయ రామ భారి పరాజయాన్ని అందుకుంది. దాంతో మంచి హిట్ కోసం బోయపాటి కసరత్తులు చేస్తున్నాడు.