Balakrishna: బాలకృష్ణ హీరోగా 21ఏళ్ల క్రితం నటించిన సినిమా ‘లక్ష్మీనరసింహా’. జయంత్ సి.పరాన్జీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాను నిర్మాత బెల్లంకొండ సురేశ్ నిర్మించారు. తమిళంలో విక్రమ్ హీరోగా తెరకెక్కిన ‘సామి’ సినిమాకు ఇది రీమేక్. ఇప్పుడీ సినిమాను జూన్ 10న బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా రీ-రిలీజ్ చేస్తున్నారు.
సినిమాకు అదనపు ఆకర్షణగా జోడించిన కొత్త పాటను హైదరాబాద్ లో విడుదల చేశారు మేకర్స్. ‘మంచినీళ్లు తాగినోడు మామూలోడు..’ అంటే సాగే పాటకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించగా చంద్రబోస్ సాహిత్యం అందించారు. అయితే.. నాటి ఫిల్మ్ లో తొలగించిన పాటను జోడించాలని చూసినా బాలకృష్ణ స్టెప్పులు మాత్రమే ఉండటంతో ఇలా కొత్తగా డిజైన్ చేశారు.
4k హంగులతో సినిమాను అభిమానుల కోసం రీ-రిలీజ్ చేస్తున్నట్టు నిర్మాత వెల్లడించారు. ఓ డ్యాన్స్ బీట్ కు భీమ్స్, చంద్రబోస్ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. ఇళయరాజా తర్వాత ఇలా చేయడం తొలిసారి. డ్యాన్స్ కు తగ్గట్టు సంగీతం, సాహిత్యం అందించడం సంతోషంగా ఉందని భీమ్స్, చంద్రబోస్ పేర్కొన్నారు.
