Daaku Maharaaj : అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ విజయాలను సొంతం చేసుకున్న నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో డాకు మహారాజ్ సినిమా చేస్తున్నారు. సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి అంటూ చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ రెండు వారాల్లోనే ముగించి ప్రమోషన్ షురు చేసే అవకాశాలు ఉన్నాయి.
టైటిల్ ప్రకటించినప్పటి నుంచి అంచనాలు భారీగా పెరిగాయి. దర్శకుడు బాబీ గత చిత్రం వాల్తేరు వీరయ్య మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. పైగా డాకు మహారాజ్ సినిమా టీజర్‌కి మంచి స్పందన వచ్చింది. అందుకే డాకు మహారాజ్ సినిమా సంక్రాంతికి విజేతగా నిలిచే అవకాశాలు ఉన్నాయని నందమూరి ఫ్యాన్స్‌తో పాటు సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
‘డాకు మహారాజ్’ షూటింగ్ పూర్తయిందని మేకర్స్ ప్రకటించారు. ముందుగా ప్రకటించినట్లుగానే సంక్రాంతి కానుకగా చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు స్పష్టం చేశారు. ‘డాకు ఇన్ యాక్షన్’ పేరుతో చిత్రీకరణ సమయంలోని తీసిన ఒక ఫొటోని విడుదల చేశారు. దర్శకుడు బాబీ కీలక సన్నివేశం గురించి బాలయ్యకు వివరిస్తూ ఉన్న ఆ స్టిల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎస్.థమన్ సంగీతం అందిస్తుండగా, విజయ్ కార్తీక్ కన్నన్ కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ‘డాకు మహారాజ్’ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా 2025, జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ కానుంది.