నందమూరి బాలకృష్ణ కె.ఎస్ బాబీ కాంబినేషన్ లో వచ్చిన సినిమా డాకు మహారాజ్. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగ వంశీ నిర్మించిన ఈ సినిమాలో శ్రద్ధ శ్రీనాథ్, ప్రగ్యా జైశ్వాల్, ఊర్వశి రౌతెలా హీరోయిన్స్ గా నటించారు. థమన్ అందించిన మ్యూజిక్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజైన డాకు మహారాజ్ థియేట్రికల్ రన్ సక్సెస్ సాధించింది.
ఇక ఇప్పుడు ఆ సినిమా డిజిటల్ రిలీజ్ కు డేట్ లాక్ అయ్యింది. డాకు మహారాజ్ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ కొనేసింది. ఈ సినిమాను భారీ మొత్తానికే కొనేసినట్టు తెలుస్తుంది. డాకు మహారాజ్ సినిమా ఫిబ్రవరి 21న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ ఫిక్స్ చేశారు. థియేట్రికల్ వెర్షన్ ఫ్యాన్స్ ని అలరించిన ఈ సినిమా ఓటీటీ రిలీజ్ తో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.
బాలకృష్ణ రెగ్యులర్ మాస్ కమర్షియల్ సినిమాలకు కాస్త భిన్నంగా కె ఎస్ బాబీ తన మార్క్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈమధ్య స్టార్ సినిమాలు థియేట్రికల్ రిలీజ్ తర్వాత ఓటీటీలోకి వచ్చాక కూడా ఆ సినిమా గురించి సోషల్ మీడియాలో ఎక్కువ డిస్కషన్ జరుగుతుంది. మరి డాకు మహారాజ్ ఓటీటీ రిలీజ్ హడావిడి ఎలా ఉండబోతుందో చూడాలి. డాకు మహారాజ్ తర్వాత బాలకృష్ణ మరోసారి బోయపాటి శ్రీనుతో సినిమా చేస్తున్నాడు. అఖండ సీక్వెల్ గా వస్తున్న ఈ ప్రాజెక్ట్ ని ఈ ఇయర్ దసరాకి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.