Switch to English

ప్లస్సూ.. మైనస్సూ.. ‘బాలయ్య – జూ. ఎన్టీయార్’ కస్సుబుస్సూ.!

నందమూరి బాలకృష్ణ పెద్ద షాక్ ఇచ్చేశారు యంగ్ టైగర్ ఎన్టీయార్‌కి. అదీ రాజకీయాల గురించి. టీడీపీలోకి ఎన్టీయార్ వస్తే ప్లస్సవుతుందంటూ జరుగుతున్న ప్రచారంపై తాజాగా బాలయ్యని ప్రశ్నిస్తే, ‘ప్లస్సయ్యి.. మైనస్ అవ్వొచ్చు కదా.. ప్లస్సు ప్లస్సు.. ప్లస్సు మైనస్సు.. మైనస్సు మైనస్సు.. ప్లస్సు..’ అంటూ ఏదో ఈక్వేషన్ చెప్పారు. అయినా, ప్లస్సయ్యి.. మైనస్ అవడమేంటబ్బా.? అంటే, యంగ్ టైగర్ ఎన్టీయార్ కూడా వెన్నుపోటుకి గురయ్యే అవకాశం వుందని హెచ్చరిస్తున్నట్టా.? లేదంటే, జూనియర్ వల్ల టీడీపీకి నష్టమేనని బాలయ్య చెప్పదలచుకుంటున్నరా.? ఈ విషయమై సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు.

బాలయ్య తీరుని కవర్ చేసుకోలేక తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు నానా పాట్లూ పడుతున్నారు. మరోపక్క, జూనియర్ ఎన్టీయార్ అభిమానులు మాత్రం, బాలయ్య తీరుని తీవ్రంగా తప్పు పడుతున్నారు. 2008 ఎన్నికల సమయంలో యంగ్ టైగర్ ఎన్టీయార్‌తో ఎన్నికల ప్రచారం చేయించుకున్న టీడీపీ, ఇప్పుడెందుకు ఇలా మాట్లాడుతోంది.? అన్న ప్రశ్న జూనియర్ అభిమానుల నుంచి దూసుకొస్తోంది. ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా.. మాటల్లో స్పష్టత విషయంలో జూనియర్ ఎన్టీయార్ టాప్. విషయ పరిజ్ఞానం ఆయనకు చాలా ఎక్కువ. అయితే, ఈ వయసులో సినిమాలు వదిలేసి రాజకీయాల్లోకి రావాలనే కీలక నిర్ణయం జూనియర్ ఎన్టీయార్ తీసుకునే అవకాశమే లేదు.

కానీ, జూనియర్ ఎన్టీయార్ వల్ల టీడీపీకి ఖచ్చితంగా లాభం వుంటుంది. సమయానుగుణంగా టీడీపీ, జూనియర్ ఎన్టీయార్ నుంచి సాయం పొందితే.. టీడీపీకి తిరిగి పూర్వ వైభవం వస్తుంది. కానీ, ఆ ఆలోచన టీడీపీ అధినేత చంద్రబాబుకిగానీ, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకిగానీ, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కిగానీ వున్నట్టు లేదు. ఇటీవల ఓ సందర్బంలో యంగ్ టైగర్ ఎన్టీయార్ ముందు రాజకీయాలకు సంబంధించిన ప్రశ్నని వుంచితే, ‘ఇది సమయమూ కాదు, సందర్భమూ కాదు.. మరోసారి మాట్లాడుకుందాం..’ అని సమాధానమిచ్చిన సంగతి తెలిసిందే. మరోపక్క, జూనియర్ అభిమానులు మాత్రం.. తమ అభిమాన హీరో, తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపట్టాల్సిందేనని కోరుకుంటున్నారు.

సినిమా

యూట్యూబ్‌ శివ వ్యాఖ్యలతో జబర్దస్త్‌ అనసూయ వాకౌట్‌

తెలుగు బుల్లి తెర కామెడీ షో అనగానే అందరు ఠక్కున గుర్తు చేసుకునే షో జబర్దస్త్‌ కామెడీ షో. అనసూయ హోస్ట్‌ గా ఈ షో...

సమంత ‘సాకీ’ బిజినెస్‌ మరింత విస్తరణ

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ ఒక వైపు సినిమాల్లో నటిస్తూనే మరో వైపు వెబ్‌ సిరీస్ లు చేస్తూ బిజీగా ఉంది. ఇంతే కాకుండా మరో వైపు...

లాక్‌ డౌన్‌ ఎత్తివేత.. థియేటర్ల పరిస్థితి ఏంటీ?

తెలంగాణలో దశల వారిగా లాక్ డౌన్ ను సడలిస్తూ వచ్చారు. పరిస్థితులు చక్కబడటంతో పాటు కేసులు తగ్గడంతో పూర్తిగా లాక్‌ డౌన్ ను ఎత్తివేసే అవకాశం...

ఫ్యాన్‌ మీట్‌ ను వాయిదా వేసిన ప్రభాస్‌

బాహుబలితో పాన్‌ ఇండియా స్టార్‌ హీరోగా పేరు దక్కించుకున్న ప్రభాస్‌ ఆమద్య తన ఫ్యాన్స్ ను కలిసేందుకు ఒక కార్యక్రమంను ఏర్పాటు చేయాలని భావించాడు. దేశ...

పుష్ప తుది ఘట్టంకు ముహూర్తం ఫిక్స్‌

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్‌ దర్శకత్వం లో రూపొందుతున్న సినిమా పుష్ప. ఈ సినిమా రెండు పార్ట్‌ లు గా విడుదల కాబోతున్న విషయం తెల్సిందే....

రాజకీయం

సీఎంకు రఘురామ మరో లేఖ.. మాటలు అదుపులో పెట్టాలి

ఏపీ సీఎం వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డికి వరుసగా రఘురామ కృష్ణ రాజు లేఖలు రాస్తున్నాడు. ఇప్పటికే ఎన్నికల్లో ఇచ్చిన పలు హామీల గురించి ప్రశ్నిస్తు వాటిని వెంటనే నెరవేర్చాలంటూ డిమాండ్ చేస్తూ...

జస్ట్ ఆస్కింగ్: కుక్క గట్టిగా మొరిగితే సింహం అయిపోతుందా.?

అధికార పార్టీకి చెందిన ఓ నేత సోషల్ మీడియా వేదికగా ‘కుక్క గట్టిగా మొరిగితే సింహం అయిపోతుందా.?’ అంటూ ట్వీటేశారు. నిజానికి, ఇది కొత్త మాట కాదు. గత కొద్ది రోజులుగా సోషల్...

తప్పుగాడు పప్పుగాడు.. కొడాలి నాని సీరియస్‌

తెలుగు దేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు మరియు లోకేష్‌ ల పై మరో సారి మంత్రి కొడాలి నాని సీరియస్‌ అయ్యాడు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును తప్పుగాడు అని.. ఎమ్మెల్సీ...

550 నాటౌట్: అమరావతి ఉద్యమం ఏం సాధించింది.?

మూడు రాజధానులు వద్దు.. ఒకే రాజధాని అమరావతి ముద్దు.. అంటూ 550 రోజులుగా అమరావతి ఉద్యమాన్ని రైతులు నడుపుతున్నారు. కూకట్ పల్లి ఆంటీలన్నారు.. పెయిడ్ ఆర్టిస్టులన్నారు.. కమ్మ సామాజిక వర్గానికి చెందినవారే ఉద్యమిస్తున్నారంటూ...

ఇది క్లియర్: ప్రత్యేక హోదాకి పూర్తిగా పాతరేసినట్లే.!

అయిపాయె.. జగనన్న వస్తాడు.. మోడీ సర్కారు మెడలు వంచి మరీ ప్రత్యేక హోదా తెస్తాడు.. అని నమ్మిన వైసీపీ శ్రేణులకు ఇకపై గొంతు పెగిలే అవకాశమే లేదు. నమ్మి ఓట్లేసిన జనాల నోళ్ళకు...

ఎక్కువ చదివినవి

టీడీపీ ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టడం వల్లే ఈ పరిస్థితి: సీఎం జగన్

ఏపీకి ప్రత్యేక హోదాపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. గత టీడీపీ ప్రభుత్వం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టడంతో ఢిల్లీలో పదేపదే అడగడం తప్ప చేసేదేమీ లేదన్నారు. 2020-21 ఏడాది జాబ్...

బాలీవుడ్ ఆఫర్ ను పట్టేసిన సాయి పల్లవి?

తన న్యాచురల్ నటనకు తోడు అదరగొట్టే డ్యాన్సింగ్ టాలెంట్ ఉన్న సాయి పల్లవి కథాబలం ఉన్న చిత్రాలను మాత్రమే ఎంచుకుంటోంది. ప్రస్తుతం నాని సరసన శ్యామ్ సింగ రాయ్ చిత్రంలో నటిస్తోన్న సాయి...

ఇదేంటి ‘రమణ’.. ఈ ట్విస్ట్‌ ఏంటీ?

తెలంగాణ రాష్ట్ర తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు ఎల్‌ రమణ పార్టీ మారబోతున్నాడు అంటూ చాలా రోజులుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. టీఆర్‌ఎస్ నుండి ఈటెల వెళ్లి పోయిన నేపథ్యంలో అదే జిల్లాకు...

సైకో పాత్రలో పిచ్చెక్కిస్తా అంటోన్న రాశి ఖన్నా

సాఫీగా సాగిపోతోన్న రాశి ఖన్నా కెరీర్ కు వరల్డ్ ఫేమస్ లవర్ పెద్ద బ్రేక్ లా అయింది. అందులో ఆమె పాత్ర మిస్ ఫైర్ అవ్వడంతో ఒక్కసారిగా అవకాశాలు తగ్గిపోయాయి. అయితే అది...

అభిమానికి కాల్‌ చేసిన బాలయ్య

నందమూరి బాలకృష్ణ మరోసారి తన మంచితనంను చాటుకున్నాడు. తన అభిమానులకు ఎప్పటికి చేరువగా ఉండే బాలయ్య రెగ్యులర్‌ గా అభిమానులతో టచ్ లో ఉంటాడు. ఇటీవల తన బర్త్‌ డే సందర్బంగా అభిమానులతో...