Balakrishna: బసవతారకం ఇందో-అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి పేరుతో వస్తున్న మోసపూరిత ప్రకటనలపై హీరో బాలకృష్ణ మండిపడ్డారు. అటువంటి ప్రకటనలు ఎవరూ నమ్మవద్దని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈమేరకు పోస్ట్ చేస్తూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
‘ప్రజలకు హెచ్చరిక..! బంగారు బాలయ్య – బసవతారకం ఈవెంట్’ పేరుతో అశ్విన్ అట్లూరి అనే వ్యక్తి నాపేరు, బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి పేరును అక్రమంగా ఉపయోగించుకుని లబ్ది పొందాలనే ప్రయత్నం చేస్తున్నారు. మా అనుమతి లేకుండా విరాళాల సేకరణకు పాల్పడుతున్నారు. తమ పేరు మీద కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు ప్రచారం చేస్తున్నారు’.
‘ఈ ఈవెంట్ కు నా నుంచి ఎటువంటి అనుమతి లేదు. ఆసుపత్రి ట్రస్ట్ బోర్డు తరపున కూడా ఎటువంటి అధికారిక ఆమోదం లేదు దయచేసి.. ప్రజలు ఇటువంటి అనధికారిక, మోసపూరిత కార్యక్రమాలపై అప్రమత్తంగా ఉండాలి. కార్యక్రమాల నిర్వహణ.. విరాళాల సేకరణ వంటివి ధ్రువీకరించిన, ప్రసార మాధ్యమాల ద్వారానే నిర్వహిస్తాం. మోసపూరిత ప్రకటనలపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండా’లని పేర్కొన్నారు.
