Balakrishna: జూన్ 10.. నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు. ఆయన అభిమానులకు పండగ రోజు. ఇప్పుడు మరింత జోష్ ఇచ్చేలా కొత్త అప్డేట్స్ తో మురిపించారు. ఆయన హీరోగా తెరకెక్కే 111వ సినిమా అప్డేట్ వచ్చింది. వీరసింహారెడ్డితో సక్సెస్ ఇచ్చిన గోపీచంద్ మలినేనితో మరోసారి ఆయన సినిమా చేయనున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్లో సతీశ్ కిలారు నిర్మిస్తున్నారు.
‘గాడ్ ఆఫ్ మాసెస్ ఈజ్ బ్యాక్. ఈసారి గర్జన మరింత గట్టిగా వినిపించనుంది. బాలకృష్ణతో మరోసారి కలిసి పని చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. చరిత్రలో నిలిచిపోయే సినిమా కానుంద’ని గోపీచంద్ ఎక్స్ వేదికగా ఓ పోస్టర్ రిలీజ్ చేసి సంతోషాన్ని పంచుకున్నారు. జూన్ 10న సినిమా ప్రారంభిస్తామని గతంలోనే గోపీచంద్ చెప్పుకొచ్చారు.
మరోవైపు.. బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శీను దర్శకత్వంలో అఖండ-2 చేస్తున్నారు. షూటింగ్ తుదిదశకు చేరుకుంది. బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా జూన్ 9న సాయంత్రం 6.03కి టీజర్ విడుదల చేయబోతున్నారు. సెప్టెంబర్ 25న సినిమా విడుదల కానుంది. తమన్ సంగీతం అందిస్తున్నారు.
