విలేజ్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన బలగం చిత్రం విడుదలైంది. పేరున్న కమెడియన్ వేణు టిల్లు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయగా ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ లీడ్ రోల్స్ లో నటించారు. భీమ్స్ సంగీతం అందించిన ఈ చిత్రం మరి ఎలా ఉందో చూద్దామా.
కథ:
తెలంగాణ పల్లెకు చెందిన తెలంగాణ కుటుంబానికి చెందిన కథ ఇది. సాయి (ప్రియదర్శి) వివిధ రకాల బిజినెస్ లు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునే వ్యక్తి. ఒకరోజు అతని తాత కొమరయ్య (సుధాకర్ రెడ్డి) సడెన్ గా చనిపోతారు. కొమరయ్య అంత్యక్రియల కోసం కుటుంబ సభ్యులు అందరూ వస్తారు. అయితే గతంలో ఉన్న ఇగో సమస్యలు మళ్ళీ వాళ్ళ మధ్య వస్తాయి. అవేంటి? కొమరయ్య చావు వల్ల ఒక గూటికి చేరిన కుటుంబ సభ్యులు మళ్ళీ కలిసారా? లేదా?
నటీనటులు:
ప్రియదర్శి నిజాయితీతో కూడిన పెర్ఫార్మన్స్ ఇచ్చాడనే చెప్పాలి. ఎప్పట్లానే తన కామెడీ టైమింగ్ తో మెప్పించిన ప్రియదర్శి ఎమోషనల్ గానూ ఆకట్టుకున్నాడు. తన పాత్రను పోషించిన తీరుకి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. హీరో లవర్ గా కావ్య కళ్యాణ్ రామ్ కూడా డీసెంట్ పెర్ఫార్మన్స్ ఇచ్చింది.
తాత పాత్రలో సుధాకర్ రెడ్డి పెర్ఫార్మన్స్ సూపర్బ్. ఈ చిత్రానికి వెన్నెముక లాంటి పాత్ర ఇది. ఇక మిగతా కుటుంబ సభ్యులు, సహ నటీనటుల పెర్ఫార్మన్స్ కూడా మెచ్చుకోదగ్గ విధంగా ఉన్నాయి.
సాంకేతిక వర్గం:
వేణు ఎంచుకున్న కథ చాలా బాగుంది. ఎమోషనల్ గా ఆకట్టుకుంటుంది. మీరు కనుక తెలంగాణ పల్లె నుండి వస్తే కచ్చితంగా ఈ చిత్రం ఇంప్రెస్ చేస్తుంది. స్క్రీన్ ప్లే లో ఎత్తుపల్లాలు ఉన్నాయి. మధ్యలో కొన్ని సాగతీత సీన్లు వస్తాయి కూడా. కామెడీ అక్కడక్కడా అయింది. ఇక క్లైమాక్స్ పోర్షన్స్ అయితే హార్డ్ హిట్టింగ్ గా ఉంది.
భీమ్స్ అందించిన సంగీతం చిత్రానికి మెయిన్ ప్లస్ పాయింట్ గా చెప్పుకోవాలి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా నీట్ గా ఉంది. ఆచార్య వేణు కెమెరా పనితనం కూడా బాగుంది. ఎడిటింగ్ కూడా ఓకే. అయితే క్లైమాక్స్ ఒక ఐదు నిముషాలు కత్తెర వేయొచ్చు. ఇక నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లుగా ఉన్నాయి.
పాజిటివ్ పాయింట్స్:
- ప్రియదర్శి పెర్ఫార్మన్స్
- ఎమోషన్స్, డీసెంట్ స్టోరీ
- సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్
- సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్
- కామెడీ
నెగటివ్ పాయింట్స్:
- కొన్ని ఫ్లాట్ సీన్స్
- సాగతీసిన క్లైమాక్స్ పోర్షన్స్
- కామెడీకి ఇంకా స్కోప్ ఉంది
- టైలర్ పాత్ర కథకు పెద్దగా అవసరం లేకపోవడం
విశ్లేషణ:
ఎమోషన్స్ ప్రధానంగా సాగే చిత్రం బలగం. ఒక కుటుంబంలో ఉండే చాలా రిలేటబుల్ పాయింట్ నే తీసుకుని సెన్సిబుల్ గా తెరకెక్కించాడు వేణు టిల్లు. నేటివిటీ ఫ్యాక్టర్, పాటలు, బలమైన ఎమోషన్స్ అన్నీ కలగలసి బలగం ఒక బలమైన చిత్రంగా నిలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే మెచ్చుకోదగ్గ ప్రయత్నమే.
తెలుగు బులెటిన్ రేటింగ్: 2.75/5