Bala Krishna: ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణ సినీ నట ప్రస్థానం ఆగష్టు 30వ తేదీకి 50ఏళ్లు పూర్తి చేసుకోనుంది. ఆయన నటించిన తొలి సినిమా ‘తాతమ్మ కల’ 1974 ఆగష్టు 30వ తేదీన విడుదలైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ బాలకృష్ణ 108 సినిమాల్లో నటించారు. 109వ సినిమాగా బాబీ దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతోంది. ఈక్రమంలో బాలకృష్ణ సినీ ప్రస్థానం 50ఏళ్లూ పూర్తవుతున్న సందర్భంగా చిత్ర పరిశ్రమ ఆయన్ను ఘనంగా సన్మానించనుంది.
చిత్రరంగ ప్రముఖులు కె.ఎల్.దామోదర్, సునీల్ నారంగ్, ప్రసన్న కుమార్, వల్లభనేని అనిల్.. ఇటివలే బాలకృష్ణను కలిసి వేడుకకు అంగీకరించాలని కోరగా బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈక్రమంలో ఆహ్వాన పత్రిక సిద్ధం చేశారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్ అవుతోంది. సెప్టెంబర్ 1న హైదరాబాద్ లో కార్యక్రమం జరుగనుంది. భారతీయ సినీ దిగ్గజాలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కార్యక్రమానికి హాజరుకానున్నారు. నటుడిగానే కాకుండా హిందూపురం ఎమ్మెల్యేగా, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్ గా బాలకృష్ణ సేవలందిస్తున్నారు.
Official Invitation of Tollywood‘s Celebration of “Fifty Years of Nandamuri Balakrishna Garu”#NandamuriBalakrishna#Balayya #JaiBalayya 🔥🔥 pic.twitter.com/ZQ9468FRNK
— Telugodu ᴮᵃˡᵃʸʸᵃ ᴮᵈᵃʸ ᵀʳᵉⁿᵈ ᴼⁿ ᴶᵘⁿᵉ ¹⁰ᵗʰ (@AndhraTelugodu) July 31, 2024
