Switch to English

Bala Krishna Birthday specials: ఫ్యాక్షన్ సినిమాలకు బ్రాండ్.. రాయలసీమ పౌరుషం.. ‘బాలకృష్ణ’

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,468FansLike
57,764FollowersFollow

Bala Krishna Birthday specials: బాలకృష్ణను ఇప్పుడు నటసింహం అంటున్నారు కానీ.. 90ల్లో ఆయన్ను యువరత్న అని పిలిచుకునేవారు అభిమానులు. కానీ.. అదే 90ల్లో బాలకృష్ణకు మరో పేరు కూడా ఉంది. అదే బాక్సాఫీస్ బోనాంజా. ఈ బిరుదుకు తగ్గట్టే ఆయనకు బాక్సాఫీస్ హిట్లు కలెక్షన్లు ఉండేవి. మాస్, ఫ్యామిలీ కంటెంట్స్ తో ఆయనకు హిట్లు ఉన్నాయి. అయితే.. బాలకృష్ణలోని అసలైన మాస్ ను బయటకు తీసుకొచ్చింది మాత్రం రాయలసీమ బ్యాక్ డ్రాప్ సినిమాలే. ఈ జోనర్ ను బాలకృష్ణ ఒడిసి పట్టుకున్న తీరు అద్భుతం. ఏకంగా ఆయనే ఫ్యాక్షన్ సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్ లా మారిపోయారు. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో రెండేళ్ల వ్యవధిలో ఏకంగా రెండు ఇండస్ట్రీ హిట్లు కొట్టి బాలకృష్ణ ఆ జోనర్లో తన పొటెన్షియాలిటీని చూపారు. అవే.. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు.

సమరసింహారెడ్డి వీర విహారం..

బాలకృష్ణ కెరీర్లో బిగ్గెస్ట్ రోరింగ్ హిట్స్ లో ఒకటి సమరసింహారెడ్డి. తన కెరీర్లో తనకు నచ్చిన టాప్ 3 సినిమాల్లో ఒకటి కూడా. బాలకృష్ణ మేకోవర్.. రాయలసీమ పౌరుషాన్నే చూపించిందంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా రైల్వే స్టేషన్ ఫైట్ సీన్, కుటుంబాన్నే హతమార్చిన అనంతర సన్నివేశాలు సినిమాకే హైలైట్. గట్టిగా తొడ కొట్టానంటే.. ఆ సౌండ్ కే చస్తావురా, నీ ఇంటికొచ్చా.. నట్టింటికొచ్చా.. అని బాలకృష్ణ చెప్పిన డైలాగులకు, వీరోచిత నటనకు ఫ్యాన్స్ మురిసారు. పరుచూరి బ్రదర్స్ డైలాగులకు బాలకృష్ణ ప్రాణ ప్రతిష్ట చేశారని చెప్పాలి. బి.గోపాల్ దర్శకత్వం, మణిశర్మ పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోరింగ్ సినిమాను ఎక్కడా తగ్గనివ్వలేదు. దీంతో బాలకృష్ణ కెరీర్లో ఒక ఇండస్ట్రీ హిట్, ల్యాండ్ మార్క్ మూవీగా నిలిచింది. కలెక్షన్లు, సెంటర్లలో రికార్డులు నెలకొల్పింది.

నరసింహానాయుడు విశ్వరూపం..

సమరసింహారెడ్డితో బాలకృష్ణ సృష్టించిన రికార్డులను మరో రెండేళ్లకే ఆయనే బ్రేక్ చేసుకోవడం విశేషం. ఆ సినిమానే నరసింహానాయుడు. బాలకృష్ణ తన నటనలోని ఫోర్స్ మరోసారి చూపిన సినిమా. కథలో కీలక మలుపులు, హీరో పాత్ర ప్రేక్షకుల్ని కట్టిపడేశాయి. రైల్వే స్టేషన్లో తోబుట్టువుల్ని ట్రైన్ ఎక్కించే ఫైట్, చైల్డ్ సెంటిమెంట్, ఫ్లాష్ బ్యాక్.. బాలకృష్ణకు రెండో ఇండస్ట్రీ హిట్ ఇచ్చాయి. క్లైమాక్స్ లో ఎర్ర శాలువా కప్పుకుని బాలకృష్ణ వస్తుంటే.. ఆ శాలువా కప్పుకునే మా అయ్యను చంపాడు అనే ఎలివేషన్ సినిమాను పీక్స్ కు తీసుకెళ్లిపోయింది. ఈ సినిమాల తర్వాత బాలకృష్ణ చేసిన చెన్నకేశవరెడ్డి కూడా బాలకృష్ణ కెరీర్లో చెప్పుకోదగ్గ హిట్. అనేక సినిమాలు ఇదే జోనర్లో చేసిన బాలకృష్ణ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ సినిమాకు సెల్ఫ్ బికేమ్ బ్రాండ్ అంబాసిడర్ అయ్యారని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే....

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

Jithender Reddy: ‘జితేందర్ రెడ్డి’ నుంచి మంగ్లీ పాట.. “లచ్చిమక్క” విడుదల

Jithender Reddy: బాహుబలి, మిర్చి సినిమాలతో నటుడిగా పేరు తెచ్చుకున్న రాకేష్ వర్రె హీరోగా నటించిన సినిమా ‘జితేందర్ రెడ్డి’ (Jithender Reddy). విరించి వర్మ...

రాజకీయం

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...

ఎక్కువ చదివినవి

Raghu Babu: నటుడు రఘుబాబు కారు ఢీకొని బైకర్ మృతి..

Raghu Babu: సినీ నటుడు రఘుబాబు (Raghu Babu) ప్రయాణిస్తున్న కారు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన హైదరాబాద్ పరిధిలో జరిగింది. నల్గొండ బైపాస్ రోడ్డులో జరిగిన ప్రమాదంలో కారు ఢీకొని...

మళ్ళీ అదే పెళ్ళిళ్ళ గోల.! గులక రాయి గట్టిగానే తగిలిందా.?

మళ్ళీ అదే పాత స్క్రిప్ట్.! ఇందులో తేడా ఏమీ వుండదు.! ఐదేళ్ళ పాలనలో రాష్ట్ర ప్రజలకు ఏం చేశారో చెప్పుకోవాలి.! మళ్ళీ అధికారంలోకి వస్తే ఏం చేస్తారో చెప్పుకోవాలి.! మద్య నిషేధంపై మాట...

Directors Day: ఈసారి ఘనంగా డైరక్టర్స్ డే వేడుకలు..! ముఖ్య అతిథిగా..

Directors Day: మే4వ తేదీన హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో తెలుగు డైరక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డైరక్టర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించబోతున్నారు. దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతి సందర్భంగా కొన్నేళ్లుగా (కోవిడ్...

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి నివాసంలో జరిగిన వీరి భేటికీ టాలీవుడ్...

‘గులక రాయి’ ఘటనలో సమాచారమిస్తే రెండు లక్షల బహుమతి.!

ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ, రెండు లక్షల రూపాయల నజరానా ప్రకటించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరంలో జరిగిన దాడికి సంబంధించి సరైన సమాచారం ఇచ్చినవారికి ఈ...