Switch to English

మాజీ మంత్రి నారాయణకు ముందస్తు బెయిల్.! ఆ కేసు ఇంకా వుందా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,513FansLike
57,764FollowersFollow

మాజీ మంత్రి నారాయణ ఇంకా తెలుగుదేశం పార్టీలోనే వున్నారా.? చాలామందికి వున్న డౌటానుమానం ఇది.! మొన్నీమధ్యనే పదో తరగతి పరీక్షా పత్రాల లీకేజీ కేసులో నారాయణ అరెస్టయిన విషయం విదితమే. ఇలా ఏపీ సీఐడీ ఆయన్ని అరెస్టు చేస్తే, అలా ఆయన బెయిల్ పొందారు.

తాజాగా రాజధదాని అమరావతికి సంబంధించి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ అక్రమాల కేసులో మాజీ మంత్రి నారాయణ బెయిల్ పొందారు. నారాయణతోపాటు ప్రముఖ వ్యాపారవేత్త లింగమనేని రమేష్, రామకృష్ణ హౌసింగ్ సొసైటీ డైరెక్టర్ అంజనీ కుమార్ తదితరులకు ముందస్తు బెయిల్ పొందారు.

నిజానికి, రాజధాని అమరావతి ఎప్పుడో అటకెక్కింది. వైసీపీ అధికారంలోకి వస్తూనే, అమరావతిని అటకెక్కించిందిగానీ.. ఆ అమరావతి పేరుతో పబ్లిసిటీ స్టంట్లు మాత్రం కొనసాగిస్తూనే వుంది. వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డికి ఈ కేసుల డ్యూటీని అప్పగించింది వైసీపీ. ఆయన నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో వుండడం సంగతేమోగానీ, అధికార పార్టీ తరఫున ప్రతిపక్షం మీద కేసులేయడంలో ఎప్పుడూ బిజీగా వుంటారు.

అలా వేసిన ఓ కేసుకు సంబంధించి ఏపీ సీఐడీ దూకుడు ప్రదర్శించి, భంగపడింది. ప్రతిసారీ న్యాయస్థానంలో చుక్కెదురవుతున్నాసరే, అమరావతి పేరుతో కేసులు పెట్టడంలో మాత్రం వైసీపీ సర్కారు ‘తగ్గేదే లే’ అంటోంది. గడచిన మూడేళ్ళుగా ‘మూడు కేసులు.. ఆరు మొట్టికాయలు..’ అన్న చందాన ఎప్పటికప్పుడు అధికార వైసీపీ పరువు పోగొట్టుకుంటోంది.

ప్రభుత్వానికి ఎన్ని మొట్టికాయలు తగులుతున్నా, ‘తగ్గేదే లే’ అన్నట్టు అధికారంలో వున్నవారు వ్యవహరించడం సోషల్ మీడియా వేదికగా ఎన్ని సెటైర్లు పడుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాము అధికారంలో వున్నన్నాళ్ళూ విపక్షాలపై కేసులు తప్పవ్.. అదే సమయంలో ప్రభుత్వానికీ మొట్టికాయలు తప్పవ్.. అన్నట్టుంది వైసీపీ తీరు.

అమరావతి ప్రాజెక్టు అంటూ ముందుకు కదిలితే.. వైసీపీ ఆరోపిస్తున్నట్లుగా అందులో ఎక్కడన్నా లోటుపాట్లు వుంటే అవి బయటకు వస్తాయి. ప్రాజెక్టు ఆపేసి, కేసులు పెడితే.. అక్రమాలెలా బయటకు వస్తాయ్.? ఇది కదా వైసీపీ – టీడీపీ మధ్య నడుస్తున్న 60-40 ఒప్పందం.? అన్నది రాజకీయ పరిశీలకుల వాదనగా కనిపిస్తోంది.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో...

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల...

Manchu Manoj: ‘చిరంజీవి-మోహన్ బాబు’ పై మంచు మనోజ్ సరదా కామెంట్స్

Manchu Manoj: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) జన్మదిన వేడుకల సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ (Manchu...

Game Changer: ‘గేమ్ చేంజర్’ స్పెషల్ అప్డేట్.. పూనకాలు తెప్పించిన దిల్...

Game Changer: దిగ్గజ దర్శకుడు శంకర్ (Shankar) దర్శకత్వంలో రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్ (Game Changer). నేడు రామ్...

రాజకీయం

టీడీపీ వెకిలి వేషాలకు బాధ్యత ఎవరిది.?

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అనపర్తి నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించడాన్ని తెలుగు దేశం పార్టీ మద్దతుదారులు జీర్ణించుకోలేకపోతున్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు స్వయంగా, ఈ పంపకాలను డిజైన్ చేసి, ఆమోద ముద్ర...

అన్న జగన్‌కి పక్కలో బల్లెంలా తయారైన చెల్లెలు సునీత.!

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య వ్యవహారానికి సంబంధించి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు, స్వయానా ఆ వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి కౌంటర్ ఎటాక్...

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

వైసీపీ ఎంపీ వంగా గీతకి ఎందుకింత ప్రజా తిరస్కారం.?

వంగా గీత.. వైసీపీ ఎంపీ.! ఆమె అనూహ్యంగా ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. అదీ పిఠాపురం నియోజకవర్గం నుంచి. కాకినాడ ఎంపీగా పని చేస్తున్న వంగా గీత, అదే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని...

ఎక్కువ చదివినవి

ఎన్నికల బరిలో కంగనా రనౌత్.. పోటీ అక్కడ నుంచే

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్( Kangana Ranaut) భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేయనున్నారు. ఆ పార్టీ ఈరోజు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇందులో...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అనగనగా ఒక...

కవిత, కేజ్రీవాల్.. తర్వాత అరెస్టయ్యేదెవరు.?

దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో తెలంగాణకు చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టు.. ఇంకో సంచలనం. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీయార్ కుమార్తె కవిత...

Chiranjeevi: బెంగళూరు నీటి సమస్యపై చిరంజీవి స్పందన.. ఫొటోలు వైరల్

Chiranjeevi: 40ఏళ్లలో బెంగళూరువాసులు ఎప్పుడూ ఎదుర్కోనంత నీటి సమస్యను ఎదుర్కొంటున్నారు. సర్వత్రా ఆందోళన కలిగిస్తోన్న సమస్యకు ప్రాంతాలతో సంబంధంలేదని.. నీటి వాడకం, పొదుపుపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అనేకమంది సూచిస్తున్నారు. ఈక్రమంలో మెగాస్టార్...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...