జానీ మాస్టర్ కు బెయిల్ మంజూరు అయింది. ప్రస్తుతం చంచల్ గూడ జైలులో ఉన్న ఆయనకు మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసింది రంగారెడ్డి కోర్టు. దీంతో ఆయన బయటకు రాబోతున్నారు. తన దగ్గర పనిచేసిన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పై లైంగికదాడి కేసులో, ఫోక్సో చట్టం కేసులో ఆయన అరెస్ట్ అయి జైలుకు వెళ్లారు. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ను వేధించాడని.. మైనర్ గా ఉన్నప్పటి నుంచే లైంగిక దాడికి పాల్పడుతున్నాడంటూ సదరు బాధితురాలు కేసు పెట్టిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ లోనే అగ్ర కొరియోగ్రాపర్ గా ఉన్న జానీ మాస్టర్ పై ఈ కేసు తీవ్ర సంచలనం రేపింది.
దాంతో ఆయన జైలుకు వెళ్లారు. ప్రస్తుతం ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే జానీ మాస్టర్ కు నేషనల్ అవార్డు వచ్చింది. అది తీసుకోవడం కోసం బెయిల్ మంజూరు చేయాలంటూ ఆయన తరఫు లాయర్ కోర్టులో పిటిషన్ వేశారు. విచారణ జరిపిన కోర్టు.. చివరకు ఆయనకు ఈ నెల 6 నుంచి 10వ తేది వరకు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ మధ్యంతర బెయిల్ ను పొడిగిస్తారా.. లేదంటే మళ్లీ జైలుకు జానీ మాస్టర్ వెళ్తారా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఆయన రిమాండ్ ఖైదీగానే ఉన్నాడు కాబట్టి.. దీనిపై మాట్లాడే అవకాశం ఉండదు.
కానీ జానీ మాస్టర్ ఇప్పటి వరకు ఈ కేసుపై నోరెత్తలేదు. ఎంత మౌనంగా ఉంటే ఆయనపై అన్ని ఆరోపణలు పెరుగుతాయే తప్ప తగ్గవనేది ఆయన గుర్తుంచుకోవాలి. అయితే ఈ కేసులో జానీ మాస్టర్ భార్య మాత్రం అసిస్టెంట్ కొరియోగ్రఫర్ తప్పు చేసిందని.. తన భర్త ఎలాంటి తప్పులు చేయలేదంటూ చెబుతోంది. మరి ఈ కేసులో ఏం జరుగుతుందో చూడాలి.