ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్న ఎన్టీఆర్ ఆ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో తన 30వ చిత్రాన్ని చేయబోతున్న విషయం తెల్సిందే. ఇటీవలే సినిమా అధికారిక ప్రకటన వచ్చింది. రాధాకృష్ణ మరియు నందమూరి కళ్యాణ్ రామ్ లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. త్వరలోనే ప్రారంభం కాబోతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్లో విడుదల చేయబోతున్నారు. ఇక ఈ చిత్రం టైటిల్ గురించి గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది.
త్రివిక్రమ్ ఈమద్య కాలంలో తన ప్రతి సినిమాకు కూడా అ అక్షరం కలిసి వచ్చేలా పెడుతున్నాడు. ఇప్పుడు ఎన్టీఆర్ 30 సినిమాకు కూడా అ అక్షరంతో ప్రారంభం అయ్యే టైటిల్ నే ఖరారు చేసినట్లుగా సమాచారం అందుతోంది. ఇటీవల హాసిని అండ్ హారిక క్రియేషన్స్ బ్యానర్లో అయినను పోయి రావలె అనే టైటిల్ను రిజిస్ట్రర్ చేయించారట. మొదట అయినను పోయి రావలె హస్తినకు అని వార్తలు వచ్చాయి. కాని లెంగ్త్ ఎక్కువ అవుతుందనే ఉద్దేశ్యంతో హస్తినకు అనే పదంను తీసేయడం జరిగిందట.
ఈ చిత్రంలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటించబోతుందని వార్తలు వచ్చాయి. రష్మిక మందన్న కూడా ఈ సినిమాలో ఉంటుందని అంటున్నారు. అయితే ఇద్దరు స్టార్ హీరోయిన్స్ కనుక ఒకే సినిమాలో ఇద్దరు నటించేందుకు ఒప్పుకోక పోవచ్చు అంటున్నారు. వీరిద్దరిలో ఎవరో ఒకరు త్వరలోనే ఫైనల్ అవ్వబోతున్నారు. మే నెలలో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం షూటింగ్ పూర్తి కానుంది. ఆ వెంటనే త్రివిక్రమ్ దర్శకత్వంలో తన 30వ చిత్రాన్ని ఎన్టీఆర్ మొదలెట్టే అవకాశం ఉంది.
661651 586141Following study some of the weblog articles for your website now, and that i really like your method of blogging. I bookmarked it to my bookmark web site list and are checking back soon. Pls consider my internet internet site too and inform me what you consider. 185064
975465 960768Exceptional post nevertheless , I was wanting to know should you could write a litte much more on this subject? Id be quite thankful in case you could elaborate a little bit more. Thanks! 901871