భారీ అంచనాల మధ్య విడుదలైన అవెంజర్స్ ఎండ్ గేమ్ అనుకున్నట్టుగా బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ముదులుపుతుంది . గతం లో వచ్చిన అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ సాధించిన 50 రోజుల కలెక్షన్ లను ఎండ్ గేమ్ కేవలం 11 రోజులలో సాధించింది . టైటానికి (1997) అప్పట్లో కొన్నేళ్ల వరకు బాక్స్ ఆఫీస్ వద్ద తన సత్తా చాటింది. మొదట్లో 2 బిలియన్ డాలర్స్ అందుకున్న సినిమాగా ఆ సినిమా నిలిచింది. ఆ రికార్డ్ ను అందుకోవడానికి టైటానిక్ కి 5,233 రోజులు పడితే అవెంజర్స్ ఎండ్ గేమ్ కేవలం 11 రోజుల సమయాన్ని మాత్రమే తీసుకుంది.
అప్పట్లో టికెట్స్ ధరలు చూసుకుంటే టైటనిక్ కలెక్షన్స్ ఒక వండర్. టెక్నాలిజీ ఎంత పెరిగినా విజువల్ ఎఫెక్ట్స్ సినిమాలు ఎన్నొచ్చినా కొన్నేళ్ల వరకు టైటానిక్ చెరగని ముద్ర వేసుకుంది. ఇక ఇప్పుడు 11 రోజుల్లో 2 బిలియన్ డాలర్స్ ను అందుకొని అవెంజర్స్ ఎండ్ గేమ్ టాప్ లిస్ట్ లోకి చేరిపోయింది. ఇదిలాగే కొనసాగితే జేమ్స్ కెమరూన్ తీసిన అవతార్ కలెక్షన్లను అందుకోవడం కష్టమేమి కాదు . ఇదే ఊపులో మరో రెండు వారలు సినిమా నడిస్తే ఎండ్ గేమ్ చిత్రం బాక్స్ ఆఫీస్ చరిత్రను తిరుగరాస్తుంది అనడం లో సందేహమేమి లేదు ..
2 బిలియన్ డాలర్స్ ను అందుకున్న టాప్ హాలీవుడ్ మూవీస్ (రికార్డును అందుకోవడానికి పట్టిన కాలం)
అవెంజర్స్: ఎండ్ గేమ్ (11రోజుల్లో)
అవతార్ (47రోజుల్లో)
అవెంజర్స్: ఇన్ఫినిటీ వార్:(48 రోజుల్లో)
స్టార్ వార్: ఫోర్స్ అవెక్ నెస్(54రోజుల్లో)
టైటానిక్(5,233 రోజుల్లో)