అవతార్ .. 2009 లో వచ్చిన ఈ హాలీవుడ్ సినిమా సంచలన విజయాన్ని అందుకుని ప్రేక్షకులను విస్మయ పరిచింది. హాలీవుడ్ ప్రముఖ దర్శకుడు జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వచించిన ఈ సినిమా సహజ వనరుల కోసం పనుషులు పండోరా గ్రహానికి వెళ్లడం అక్కడ నావి అనే జాతికి చెందిన జీవులతో యుద్ధం, సహాయం చేయడంలాంటి ఆసక్తికర మలుపులతో సాగుతుంది.
కామెరూన్ అద్భుత ఆలోచనకు ప్రతిరూపంగా తెరకెక్కిన ఈ సినిమాకు సీక్వెల్ రూపొందుతున్న విషయం తెలిసిందే. నిజానికి ఈ సినిమాకు నాలుగు సీక్వెల్స్ ఉంటాయని చెప్పాడు జేమ్స్ కామెరూన్. అందులో రెండో భాగం అవతార్ 2 ని 2021 డిసెంబర్ 17న విడుదల చేస్తున్నట్టు సోషల్ మీడియాలో ప్రకటించాడు దర్శకుడు. ఈ రెండో భాగానికి అవతార్.. ది వేవ్ ఆఫ్ వాటర్ అనే పేరు ఖరారు చేసేలా ఉన్నారు.
అవతార్ పార్ట్ 1 సినిమాను 1,648 కోట్లతో తెరకెక్కించగా .. ఆ సినిమా ఏకంగా 20,455 కోట్లను వసూలు చేసి బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద దుమారమే రేపింది. ఇప్పుడు అవతార్ రెండో భాగాన్ని దాదాపు 2000 కోట్లతో తెరకెక్కిస్తున్నారు. జేమ్స్ కామెరూన్ విజువల్ వండర్ గా తెరెక్కించే ఈ సినిమా కూడా హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ పై పెద్ద దుమారం రేపడం ఖాయమని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు.