Switch to English

పవన్‌ని విమర్శించే అవంతి.. కాలేజీలో లాభాలను ప్రజలకు పంచుతారా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,464FansLike
57,764FollowersFollow

అబ్బబ్బా.. ఆంధ్రప్రదేశ్ మంత్రి అవంతి శ్రీనివాస్ గారికి భలే ఐడియా వచ్చింది. వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రెస్‌మీట్ పెట్టి మరీ నలుగురి ముందు జనసేనాని పవన్ కల్యాణ్‌గారికి ఇచ్చి పడేశారు. ఐడియా ఇచ్చారని చెప్తే తప్పులో కాలేసినట్టే. సవాల్ చేశారని చెప్పుకోవాలి.

‘పవన్ కల్యాణ్‌కు గొప్ప మనసు ఉంటే ఓ సినిమా తీసి, ఆ సినిమాకు తీసుకునే పారితోషికాన్ని భవన నిర్మాణ కార్మికులకు అందించాలి’ అని విశాఖలో అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. పనిలో పనిగా కాపు యువతను పెడదోవ పట్టించేలా పవన్ వ్యవహార శైలి ఉందని ఏవో నాలుగు మాటలు మాట్లాడారు. ఆవేశంలో అన్నారో, ఆలోచించి అన్నీ తెలుసుకుని అన్నారో కానీ, అవంతి శ్రీనివాస్ కొన్ని నిజాలు మాట్లాడారు.

పవన్ ఒక సినిమాకు తీసుకునే పారితోషికంతో భవన నిర్మాణ కార్మికుల సమస్యలు తీరతాయని అవంతి మాటలను బట్టి అర్థమవుతోంది. అది నిజమే. పవన్‌కు ఒక్కో సినిమాకు 40 నుండి 50 కోట్ల రూపాయలు ఇవ్వడానికి ఎంతోమంది నిర్మాతలు క్యూ లైనులో ఉన్నారు. పవన్ సినిమాలు చేస్తూ, ఆ వచ్చే డబ్బుతో ప్రజల సమస్యలు తీరుస్తూ వెళితే… వైకాపా నేతలు, వైకాపా ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రజల సమస్యలు తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు లేదా? ఈ ప్రశ్నలకు అవంతి శ్రీనివాస్ ఏం సమాధానం చెబుతారు?

ఏదో గొప్ప సలహా ఇచ్చానని అనుకుంటున్నా అవంతి శ్రీనివాస్, తెలుగు రాష్ట్రాల్లో అవంతి ఎడ్యుకేషనల్ సొసైటీ పేరు మీద బోలెడు కాలేజీలు నడుపుతున్నారు. అసలు, ఆయన ఇంటి పేరు అవంతి కాదు. ముత్తంశెట్టి. కాలేజీల పుణ్యమా అంటూ అవంతి శ్రీనివాస్ అయ్యారు. సదరు కాలేజీల ద్వారా వచ్చే లాభాలను ఆయన ప్రజలకు పంచుతారా? పంచేంత గొప్ప మనసు ఆయనకు లేదా? కాలేజీల ద్వారా, రాజకీయాలోకి వచ్చింది డబ్బులు సంపాదించుకోవడానికేనా? ఈ ప్రశ్నలకు ఆయన ఏం సమాధానం చెబుతారో?

సినిమాలు చేయడం ద్వారా వచ్చిన డబ్బులతో పవన్ ఎంతమందికి గుప్తదానాలు చేశారనేది ఇండస్ట్రీలో చాలామందికి తెలుసు. ఆయన్ను విమర్శించం మాని, ప్రజల సమస్యలు తీర్చే విధంగా అవంతి శ్రీనివాస్  చర్యలు తీసుకుంటే బావుంటుందని సోషల్ మీడియాలో యువత హితవు పలుకుతున్నారు. వేలకు వేలు ఫీజులు వసూలు చేసే ఆయన నీతులు చెప్పడం మాని, పాటిస్తే బావుంటుందంటున్నారు.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ:...

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి...

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

రాజకీయం

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

ఎక్కువ చదివినవి

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish Shankar) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగా...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్ అంటున్న మేకర్స్

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad Square) తెరకెక్కబోతోంది. యూత్ ఓరియంటెడ్ మూవీస్...

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...

Chiranjeevi: ‘పేదలకు అందుబాటులో..’ యోదా డయోగ్నోస్టిక్స్ ప్రారంభోత్సవంలో చిరంజీవి

Chiranjeevi: ‘ఓవైపు వ్యాపారం మరోవైపు ఉదాసీనత.. రెండూ చాలా రేర్ కాంబినేషన్. యోదా డయాగ్నోస్టిక్స్ అధినేత కంచర్ల సుధాకర్ వంటి అరుదైన వ్యక్తులకే ఇది సాధ్య’మని మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)...